AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral: కడుపులో అసౌకర్యంగా ఉందని ఆస్పత్రికి యువకుడు – స్కానింగ్ తీసి రిపోర్ట్ చూడగా స్టన్

థాయ్‌లాండ్‌లో మద్యం మత్తులో పొరపాటున కాఫీ స్పూన్ మింగిన 29 ఏళ్ల యువకుడు.. ఆ స్పూన్ తన శరీరంలో ఆరు నెలల పాటు ఉన్న విషయం తెలియకుండానే జీవించాడు. షాంఘైలో వైద్య పరీక్షలో ఈ వింత విషయం వెలుగుచూడడంతో... 90 నిమిషాల సుదీర్ఘ శస్త్రచికిత్స అనంతరం స్పూన్‌ను తొలగించారు.

Viral: కడుపులో అసౌకర్యంగా ఉందని ఆస్పత్రికి యువకుడు - స్కానింగ్ తీసి రిపోర్ట్ చూడగా స్టన్
Medical Case
Ram Naramaneni
|

Updated on: Jun 30, 2025 | 4:34 PM

Share

చైనాలోని 29 ఏళ్ల యాన్ అనే యువకుడు ఆరు నెలల పాటు తన శరీరంలో 15 సెం.మీ పొడవైన కాఫీ స్పూన్ ఉన్న విషయాన్ని తెలియకుండానే జీవించాడు. ఈ విచిత్ర సంఘటన అతను థాయ్‌లాండ్‌లో మద్యం మత్తులో ఉంటూ పొరపాటున స్పూన్‌ను మింగడంతో మొదలైంది. జనవరిలో థాయ్‌లాండ్ పర్యటనకు వెళ్లిన యాన్.. ఎక్కువగా మద్యం తాగిన తర్వాత వాంతి చేయడానికి కాఫీ స్పూన్ ఉపయోగించాడు. అయితే పొరపాటున స్పూన్ అతని గొంతులో జారి పోయింది. ఆ ఘటన తర్వాత అతను సోయి లేకుండా ఉన్నాడు. తర్వాత మేల్కొన్నప్పుడు అదో కల అనుకుని ఆ విషయం పట్టించుకోవడం మానేశాడు. ఆ రోజు అతనికి కడుపు నొప్పి ఉన్నా, అది వాంతుల వల్ల అని భావించాడు.

జూన్‌లో షాంఘైకి తిరిగి వచ్చిన యాన్.. కడుపులో అసౌకర్యంగా అనిపించడంతో.. ఫుడ్ తినేప్పుడు ఏమైనా ప్లాస్టిక్ ముక్కను మింగాడేమోనని అనుమానంతో వైద్యుడిని సంప్రదించాడు. స్కానింగ్‌ ద్వారా అతని కడపులో సీరామిక్ కాఫీ స్పూన్ అతని చిన్న పేగు మొదటి భాగమైన డుఓడెనమ్‌(ఇది చిన్నపేగుల మొదటి భాగం)లో ఇరుక్కుని ఉన్నట్లు తెలిసింది.

షాంఘై జోంగ్‌షాన్ హాస్పిటల్ మెడికల్ టీం యాన్‌కు ఎండోస్కోపిక్ శస్త్రచికిత్స చేశారు. మొదటి ప్రయత్నంలో ఫోర్సెప్స్ ఉపయోగించి స్పూన్‌ను బయటకు తీయడం కష్టంగా మారింది. ఎందుకంటే అది చాలా మెత్తగా మారిపోయింది. ఆ తర్వాత క్లిష్టమైన పద్ధతితో, రెండు ఫోర్సెప్స్ సహాయంతో స్పూన్‌ను కడుపులోకి తీసుకువచ్చి, అక్కడి నుంచి బయటకు తీశారు. ఈ ఆపరేషన్ సుమారు 90 నిమిషాల పాటు సాగింది. స్పూన్‌ను విజయవంతంగా తొలగించడంతో యాన్ పూర్తి ఆరోగ్యంతో కోలుకున్నాడు.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..  

Follow Us
ఇట్స్ అఫీషియల్.. అప్పుడే OTTలోకి సుమంత్ క్రైమ్ థ్రిల్లర్ మూవీ
ఇట్స్ అఫీషియల్.. అప్పుడే OTTలోకి సుమంత్ క్రైమ్ థ్రిల్లర్ మూవీ
15 ఏళ్ల చిన్న కుర్రాడితో డైటింగ్.. 50 ఏళ్ల వయసులో స్టిల్ సింగిల్.
15 ఏళ్ల చిన్న కుర్రాడితో డైటింగ్.. 50 ఏళ్ల వయసులో స్టిల్ సింగిల్.
జీరో కేలరీలు, కొవ్వును కోసేసే సూపర్‌ఫుడ్.. ఊర్లల్లో ఫ్రీగానే..
జీరో కేలరీలు, కొవ్వును కోసేసే సూపర్‌ఫుడ్.. ఊర్లల్లో ఫ్రీగానే..
సెప్టెంబర్ నెలలో వీరే మహా అదృష్టవంతులు..లిస్ట్‌లో మీ రాశి ఉందా?
సెప్టెంబర్ నెలలో వీరే మహా అదృష్టవంతులు..లిస్ట్‌లో మీ రాశి ఉందా?
రెస్టారెంట్ స్టైల్‌ కరకరలాడే ఆలూ ఫ్రై.. ఇంట్లోనే ఇలా సింపుల్‌గా..
రెస్టారెంట్ స్టైల్‌ కరకరలాడే ఆలూ ఫ్రై.. ఇంట్లోనే ఇలా సింపుల్‌గా..
ఘాటెక్కిస్తున్న ఉల్లి ధరలు.. కిలో ఎంతంటే..?
ఘాటెక్కిస్తున్న ఉల్లి ధరలు.. కిలో ఎంతంటే..?
తెలంగాణలో టాక్సిక్ మూవీ ప్రభంజనం.. గంటలోనే హౌస్ ఫుల్..
తెలంగాణలో టాక్సిక్ మూవీ ప్రభంజనం.. గంటలోనే హౌస్ ఫుల్..
'కోచింగ్‌, గైడెన్స్ లేకుండానే 6 నెలల్లో UPSC ప్రిలిమ్స్‌ క్లియర్'
'కోచింగ్‌, గైడెన్స్ లేకుండానే 6 నెలల్లో UPSC ప్రిలిమ్స్‌ క్లియర్'
ఆ జిల్లా వాసులకు గుడ్‌న్యూస్.. 30 గ్రామాలను కలుపుతూ బైపాస్ రోడ్డు
ఆ జిల్లా వాసులకు గుడ్‌న్యూస్.. 30 గ్రామాలను కలుపుతూ బైపాస్ రోడ్డు
Meena : ఆ హీరో లేకపోతే తెలుగులో మీనా లేదు.. ఎక్కువ హిట్స్ ఇచ్చిన
Meena : ఆ హీరో లేకపోతే తెలుగులో మీనా లేదు.. ఎక్కువ హిట్స్ ఇచ్చిన