Funny Video: చలికాలంలో ఇలాంటి స్నానం నెవ్వర్‌ బిఫోర్‌.. ఎవ్వర్‌ ఆఫ్టర్‌.. వీడియో చూస్తే పొట్ట చెక్కలవ్వాల్సిందే

శీతాకాలంలో పొద్దున్నే స్నానం చేయాలంటే చాలామంది బద్ధకిస్తారు. అప్పుడు, ఇప్పుడు అనుకుంటూ వాయిదా వేస్తుంటారు. కొందరైతే సూర్యుడు నడి నెత్తిమీదకు వస్తే కానీ స్నానానికి ఉపక్రమించరు

Funny Video: చలికాలంలో ఇలాంటి స్నానం నెవ్వర్‌ బిఫోర్‌.. ఎవ్వర్‌ ఆఫ్టర్‌.. వీడియో చూస్తే పొట్ట చెక్కలవ్వాల్సిందే
Representative Image
Follow us
Basha Shek

|

Updated on: Dec 24, 2022 | 12:13 PM

శీతాకాలంలో పొద్దున్నే స్నానం చేయాలంటే చాలామంది బద్ధకిస్తారు. అప్పుడు, ఇప్పుడు అనుకుంటూ వాయిదా వేస్తుంటారు. కొందరైతే సూర్యుడు నడి నెత్తిమీదకు వస్తే కానీ స్నానానికి ఉపక్రమించరు. మరి తప్పనిపరిస్థితుల్లో అయితే హీటర్లు లేదా గ్రీజర్లో పెట్టుకుని వేడినీళ్లతో స్నానం చేస్తుంటారు. మరికొందరైతే తూతూమంత్రంగా కాళ్లు చేతులు శుభ్రం చేసుకుని మమా అనిపిస్తుంటారు. ఇప్పుడు మనం మాట్లాడుకోబోయే వ్యక్తి కూడా అలాంటివాడే. శీతాకాలంలో అతను స్నానం చేసిన విధానం చూస్తే నోరెళ్ల బెట్టాల్సిందే. దీనికి సంబంధించిన ఒక వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో తెగ వైరలవుతోంది. దీనిని చూసిన ఎముకలు కొరికే చలిలో ఇంత ఈజీగా స్నానం చేయవచ్చా అని కామెంట్లు పెడుతున్నారు. వీడియోలోకి వెళితే.. నిద్ర లేవగానే ఒక వ్యక్తి స్నానం చేసేందుకు రెడీ అవుతాడు. బాత్‌రూంలోకి వెళ్లి నీటి తొట్టె వద్ద నిలబడి బకెట్‌తో నీళ్లు తీసుకుని తలమీద పోసుకుంటాడు. ఇందులో వింతేమంది అనుకుంటున్నారా? అక్కడే ఉంది అసలు విషయం.. అతను నీళ్లు పోసుకున్నట్లే కనిపిస్తుంది.. కానీ బకెట్‌లో అసలు నీళ్లే ఉండవు. జస్ట్‌ ఖాళీ బకెట్‌తో నీళ్లు పోసుకున్నట్లుగా నటిస్తాడు అంతే. అయితే నిజంగా చలికాలంలో స్నానం చేస్తే.. ఎలా ప్రవర్తిస్తారో అచ్చం అలాగే నటించడం నెటిజన్లను తెగ నవ్విస్తోంది.

పైగా మధ్య మధ్యలో సబ్బుతో పూసుకున్నట్లుగా నటించడం, చలికి గజాగజా వణకడం, చివరగా టవల్ తీసుకుని శుభ్రం చేసుకోవడాన్ని చూస్తే పొట్టచెక్కలవ్వడం ఖాయం. ఇది పాత వీడియోనే అయినప్పటికీ చాలామంది దీనిని షేర్‌ చేస్తూ తెగ వైరల్‌ చేస్తున్నారు. ఇతడు మహా నటుడు.. వీడి వేషాలు మాములుగా లేవుగా అంటూ నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. మరి మీరు కూడా ఈ వైరల్‌ వీడియోను చూసేయండి. కాసేపు సరదాగా నవ్వుకోండి.

ఇవి కూడా చదవండి

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం క్లిక్ చేయండి..

ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే