AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: తనకు ఆర్థికంగా తోడుగా నిలిచిన మూగ జీవికి.. ‘నీడ’గా నిలిచాడు.. ఐడియాకు ఫిదా అవ్వాల్సిందే..

Viral Video: మనం ఎవరివాళ్ల అయితే లాభపడతామో వారి పట్ల కృతజ్ఞతతో ఉండాలని చెబుతుంటారు. అయితే మనుషులు ఆశిస్తారు కాబట్టి వారి పట్ల కృతజ్ఞత భావతో ఉంటాం. అంతేకాకుండా ఎక్కడ మళ్లీ వారితో..

Viral Video: తనకు ఆర్థికంగా తోడుగా నిలిచిన మూగ జీవికి.. 'నీడ'గా నిలిచాడు.. ఐడియాకు ఫిదా అవ్వాల్సిందే..
Viral Photo
Narender Vaitla
|

Updated on: Oct 09, 2021 | 9:39 PM

Share

Viral Video: మనం ఎవరివాళ్ల అయితే లాభపడతామో వారి పట్ల కృతజ్ఞతతో ఉండాలని చెబుతుంటారు. అయితే మనుషులు ఆశిస్తారు కాబట్టి వారి పట్ల కృతజ్ఞత భావతో ఉంటాం. అంతేకాకుండా ఎక్కడ మళ్లీ వారితో అవసరం పడుతుందో అని ఇష్టం లేకపోయినా నటిస్తాం. మరి జంతువుల పట్ల ఇదే భావన ఉంటుందా.? అంటే తాజాగా నెట్టింట వైరల్‌ అవుతోన్న ఓ ఫొటో చూస్తే మాత్రం కచ్చితంగా ఉంటుందనే సమాధానం వస్తుంది. సాధారణంగా కొన్ని జంతువులు మన జీవితంలో భాగమైపోతాయి. అంతేకాకుండా ఆర్థికంగా వాటిపైనే ఆధారపడుతుంటాం. అలాంటి వాటిలో ఎద్దులు మొదటి స్థానంలో ఉంటాయి. ఇలాగే తనకు ఆర్థికంగా తోడుగా నిలిచిన ఎద్దుకు దాని యజమాని చేసిన పని నెటిజన్ల మనసులను చూరగొంటోంది.

ఇంతకీ విషయమేంటంటే.. ఒకతను ఎద్దుతో బండిని తయారు చేసి సరుకుల రవాణాకు ఉపయోగించుకుంటున్నాడు. ఈ క్రమంలో విపరీతమైన ఎండ ఉండడం వల్ల ఎద్దుకు ఇబ్బంది కలుగుతుందని భావించాడో ఏమో.. ఆ ఎద్దును ఎండ నుంచి రక్షించడానికి ఓ వినూత్న ఆలోచన చేశాడు. ఎద్దుల బండికి నాలుగు వైపులా కర్రలను ఏర్పాటు చేసి వాటిపై ఎండ పడకుండా ఏర్పాటు చేశాడు. దీంతో ఎద్దు ఎంచక్కా ఎండపడకుండా హాయిగా ముందుకు వెళుతోంది. ఈ ఏర్పాటును చూసిన కొందరు ఫోటోను తీసి సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశారు. దీంతో ప్రస్తుతం ఈ ఫోటో నెట్టింట వైరల్‌గా మారింది. ఈ ఫోటో చూసిన కొందరు ఆ ఎద్దు యజమానిని పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు.

Also Read: Dancing Trees: తెల్లని ఇసుక, సాల్సా డ్యాన్స్ చేసే చెట్లు ఈ బీచ్‌లో ప్రత్యేకం… ఎక్కడంటే..

Black Eyed Beans: శాఖాహారులకు సూపర్ ఫుడ్ అలసందలు.. చౌకగా దొరికే వీటిని తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఎన్నో

Black Eyed Beans: శాఖాహారులకు సూపర్ ఫుడ్ అలసందలు.. చౌకగా దొరికే వీటిని తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఎన్నో