AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Dancing Trees: తెల్లని ఇసుక, సాల్సా డ్యాన్స్ చేసే చెట్లు ఈ బీచ్‌లో ప్రత్యేకం… ఎక్కడంటే..

Dancing trees of Sumba Island: చెట్లు చిరు గాలి వీస్తే వయ్యారంగా ఊగుతాయి. అదే బలంగా గాలి వీస్తే.. చెట్లు ఓ రేంజ్ లో ఊగిపోతూ.. చెట్లు నేలకు ఒరిగిపోతాయన్నట్లు..

Dancing Trees: తెల్లని ఇసుక, సాల్సా డ్యాన్స్ చేసే చెట్లు ఈ బీచ్‌లో ప్రత్యేకం... ఎక్కడంటే..
Dancing Trees Of Sumba Isla
Surya Kala
|

Updated on: Oct 09, 2021 | 9:25 PM

Share

Dancing Trees of Sumba Island: చెట్లు చిరు గాలి వీస్తే వయ్యారంగా ఊగుతాయి. అదే బలంగా గాలి వీస్తే.. చెట్లు ఓ రేంజ్ లో ఊగిపోతూ.. చెట్లు నేలకు ఒరిగిపోతాయన్నట్లు భయం గొల్పిస్తాయి. అయితే సంతోషంగా గంతులు వేసే చెట్ల గురించి తెలుసా.. సంతోషం వస్తే మనిషి గంతులేసి డ్యాన్స్ చేసినట్లు.. ఒక ద్వీపంలో చెట్లు కూడా తమకు సంతోషం వస్తే ఓ రేంజ్ లో డ్యాన్స్ చేస్తాయట. ఆ చెట్లు చేసే డ్యాన్స్ విన్యాసాలు.. చూడడానికి సాల్సా డ్యాన్స్ లా అనిపిస్తుంది. ఈ డ్యాన్సింగ్ ట్రీస్ ఎక్కడ ఉన్నాయో తెలుసా..

ఇండోనేషియాలోని సుంబా ద్వీపంలో  ప్రముఖ పర్యాటక ప్రదేశాలలో ఒకటి వాలకిరి బీచ్‌. ఈ బీచ్ లో తెల్లని ఇసుక,  “డాన్సింగ్‌ ట్రీస్‌” పర్యాటకులకు కనువిందు చేస్తాయి. ప్రశాంతమైన సముద్ర తీరంలో ఇసుక తిన్నెల మీద వయ్యారంగా సాల్సా డ్యాన్స్ చేస్తుంటే చూపరులు కనులు తిప్పుకోలేరట. సముద్ర తీరంలో ఉండే ఈ చెట్లు అలల తాకిడికి ఒక చోట నుంచి మరొక చోటకు ప్రయాణం చేస్తాయి. పొట్టిగా రెండు మూడు కొమ్మలతో చిన్న చిన్న ఆకులతో మనిషి రూపంలో దర్శనమిచ్చే ఈ చెట్లను తదేకంగా చూస్తే డ్యాన్స్ చేస్తున్నాయన్నట్లు భ్రమ కలుగుతుందట.  చెట్లు డ్యాన్స్ చేస్తున్నట్లు ఉండే దృశ్యం సూర్యోదయం సమయంలో, సూర్యాస్తమయం సమయంలో చూడాలని పర్యాటకులు చెబుతున్నారు. సుంబా ద్వీపానికి ఈ మొక్కలకి చేసే సాల్సా డ్యాన్స్ చూడడనికి పర్యాకులు ప్రకృతి ప్రేమికులు క్యూ కడతారట.

Also Read: రూ. 15 కోట్ల విలువైన ఆస్థిని తన పెంపుడు కుక్క ఫ్రాన్సిస్కో కు రాసిన మోడల్.. ఎక్కడంటే ..

Follow Us
మహాలక్ష్మీ వ్రతం అందరూ చేయవచ్చా? ఈ 4 మంది మాత్రం ఉపవాసం చేయకూడదట!
మహాలక్ష్మీ వ్రతం అందరూ చేయవచ్చా? ఈ 4 మంది మాత్రం ఉపవాసం చేయకూడదట!
శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..
శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..
పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..
పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..
ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి
ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి
మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!
మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!
ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..
ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..
ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..
ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..
ఈ తేదీల్లో పుట్టినవారికి డబ్బు విషయంలో అదృష్టం కలిసొస్తుందట!
ఈ తేదీల్లో పుట్టినవారికి డబ్బు విషయంలో అదృష్టం కలిసొస్తుందట!
టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
కమ్మని దోసకాయ కొబ్బరి పచ్చడి.. తాలింపు లేకపోయినా అదిరిపోయే టేస్ట్
కమ్మని దోసకాయ కొబ్బరి పచ్చడి.. తాలింపు లేకపోయినా అదిరిపోయే టేస్ట్