Viral Video: ‘జింక కంటే చేపను వేటాడమే కష్టం’.. చిరుత వైరల్ వీడియో
మనకు చిరుత గుర్తుకు రాగానే సహజంగానే జింకను వేటాడుతుందని భావిస్తుంటాం. నిజానికి ఎక్కువ శాతం చిరుతలు జింకనే తమ ఆహారంగా మార్చుకుంటాయి. జింకను వేటాడే సమయంలో చిరుత ఎంత ఓపికగా, సమయస్ఫూర్తిగా వ్యవహరిస్తుందో తెలిసిందే. ఇందుకు సంబంధించి ఎన్నో వీడియోలు మనం చూసే ఉంటాం. అయితే చిరుత చేపలను వేటాడితే ఎలా ఉంటుందో...
ఈ సృష్టిలో ప్రతీ జీవి తన మనుగడ కోసం పోరాటం చేస్తుంది. ఆదిమానవులు జంతువులను వేటాడుతూ జీవనాన్ని ప్రారంభించారు. అయితే ఆ తర్వాత వ్యవసాయం చేయడం మొదలు పెట్టి ఆహారాన్ని తయారు చేసుకోవడం ప్రారంభించారు. ఆధునిక మానవడి ఆహారశైలిలో ఎన్నో మార్పులు వచ్చాయి. అయితే జంతువులకు వేటే ప్రధాన ఆధారం. జీవులు తమ శక్తికి అనుగుణంగా ఇతర జంతువులను వేటాడుతూ జీవనం సాగిస్తుంటాయి.
మనకు చిరుత గుర్తుకు రాగానే సహజంగానే జింకను వేటాడుతుందని భావిస్తుంటాం. నిజానికి ఎక్కువ శాతం చిరుతలు జింకనే తమ ఆహారంగా మార్చుకుంటాయి. జింకను వేటాడే సమయంలో చిరుత ఎంత ఓపికగా, సమయస్ఫూర్తిగా వ్యవహరిస్తుందో తెలిసిందే. ఇందుకు సంబంధించి ఎన్నో వీడియోలు మనం చూసే ఉంటాం. అయితే చిరుత చేపలను వేటాడితే ఎలా ఉంటుందో ఎప్పుడైనా ఊహించారా.?
చిరుత చేపలను వేటాడడం ఏంటని అనుకోకండి.. ఇతర జంతువులు లభించని సమయంలో చిరుతలు చేపలను కూడా వేటాడుతాయి. అయితే చేపలు వేటాడే సమయంలో పడే కష్టం మాములుగా ఉండదు. తాజాగా ఓ చిరుత చేపలను వేటాడే వీడియో ఒకటి బాగా వైరల్ అవుతోంది. దక్షిణాఫ్రికాలోని క్లాసెరి నేషనల్ పార్క్‌లో ఓ చిన్న నీటి కొలను ఉంది. అయితే కొలను మొత్తం బురదతో నిండి ఉంది. అయితే అందులో భారీ ఎత్తున చేపలు ఉన్నాయి.
వైరల్ వీడియో..
అయితే వాటిని పట్టుకోవడానికి చిరుత ఎంతో కష్టపడాల్సి వచ్చింది. బురదలో పడి ఉన్న చెట్టు కొమ్మపై నెమ్మదిగా ఎక్కుతూ చేపలను పట్టుకునే ప్రయత్నం చేసింది. అయితే చివరికి చిరుత బురదలోకి దిగి, క్యాట్ ఫిష్‌ను పట్టుకొని అక్కడి నుంచి వెళ్లిపోయింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం క్లిక్ చేయండి..