AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: మనుషులు కూడా దీని ముందు దిగదుడుపే.. ‘కాకి’ ట్యాలెంట్ చూస్తే ఫ్యూజులు ఎగిరిపోతాయ్..!

Viral Video: కాకి గురించి కథలు చిన్నప్పటి నుంచి ఎన్నో చదువుకునే ఉంటారు. మనుషుల మధ్య తిరిగే కాకులకు.. సహజంగానే కొన్ని మనుషుల లక్షణాలు అబ్బినట్లున్నాయి.

Viral Video: మనుషులు కూడా దీని ముందు దిగదుడుపే.. ‘కాకి’ ట్యాలెంట్ చూస్తే ఫ్యూజులు ఎగిరిపోతాయ్..!
Crow
Shiva Prajapati
|

Updated on: May 02, 2022 | 6:40 AM

Share

Viral Video: కాకి గురించి కథలు చిన్నప్పటి నుంచి ఎన్నో చదువుకునే ఉంటారు. మనుషుల మధ్య తిరిగే కాకులకు.. సహజంగానే కొన్ని మనుషుల లక్షణాలు అబ్బినట్లున్నాయి. అందుకే కాబోలు ఇక్కడ ఓ కాకి.. మనుషులను మించి తన ట్యాలెంట్‌ను ప్రదర్శిస్తుంది. చిన్నప్పుడు మనం చదువుకునే ఉంటాం.. కుండలో నీళ్లు అడుగున ఉంటే ఓ కాకి నీళ్లను తాగేందుకు అందులో రాళ్లు వేయడం, కుండలో నీళ్లు పైకి రాగానే వాటిని తాగేసి తుర్రున జారుకోవడం మనకు తెలిసిందే. కానీ, ఇప్పుడు ట్రెండ్ మారింది. మరింత స్మార్ట్‌గా మారాయి కాకులు. ఈ కాకి చేసిన పని చూస్తే మీరు కూడా అదే అంటారు.

తెలివైన పక్షులలో కాకి కూడా ఒకటి. అయితే, ఆ కాకి ఇప్పుడు మనుషులకే పోటీగా వస్తోంది. సాధారణంగా ఒక ఫజిల్‌ను పూర్తి చేయాలంటే కొంచెం కష్టపడుతుంటాం. కానీ, ఈ కాకి మాత్రం ఏమాత్రం ఇబ్బంది పడకుండా చకచకా ఫజిల్‌ను పూర్తి చేసి ఔరా అనిపిస్తోంది. ఫజిల్ బాక్స్ ఇచ్చి.. దానిని పూర్తిచేయమని కాకి ముందు పెట్టగా.. ఆ కాకి ఫటాఫట్ పూర్తి చేసింది. డైస్ సైజ్‌ను గుర్తించి అందులో ఫిక్స్ చేసింది. కాకి ఆ ఫజిల్‌ను ఫిక్స్ చేస్తున్న వీడియోను ట్విట్టర్‌లో పోస్ట్ చేయగా.. అదికాస్తా వైరల్ అయ్యింది. ఆ వీడియోను చూసి నెటిజన్లు షాక్ అవుతున్నారు. ఇంత ట్యాలెంట్ ఎలా సాధ్యమైందా అని అవాక్కవుతున్నారు. మరెందుకు ఆలస్యం ఈ షాకింగ్ వీడియోను మీరూ చూసేయండి.

Also read:

Child care tip: వేసవిలో పిల్లల శరీరం చల్లగా ఉండాలంటే ఈ నూనెతో మసాజ్ చేయండి..!

Viral Video: ఒక్క నీటి చుక్క నిండు ప్రాణాలను కాపాడింది.. గుండెను పిండేస్తున్న వీడియో..!

Trs vs Bjp: బండి సంజయ్‌కి నిజంగా ప్రేమ ఉంటే ఆ పని చేయాలి.. మంత్రి కేటీఆర్ డిమాండ్..