AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కొంపముంచిన రీల్స్‌ పిచ్చి.. ఏకంగా తొమ్మిది మంది యువకులు గల్లంతు..! కట్‌చేస్తే..

తొమ్మిది మంది యువకులు నది ఒడ్డున తమ మొబైల్ ఫోన్లతో రీల్స్ తయారు చేస్తున్నారు. వారిలో కొందరు మరింత లోతైన నీటిలోకి వెళ్లారు. వారు నీటిలో దూకుతుండగా నీటి ప్రవాహం ఒక్కసారిగా పెరిగిపోవటంతో ప్రవాహంలో కొట్టుకుపోయారు. తమ స్నేహితులను చూసి ఒడ్డున ఉన్న యువకులు వారిని రక్షించడానికి నదిలోకి దూకారు. వారు కూడా వరద ఉధృతికి కొట్టుకుపోయారు. నదిలోకి దిగిన తొమ్మిది మంది యువకులు ఒక్కొక్కరుగా మునిగిపోవడం ప్రారంభించారు.

కొంపముంచిన రీల్స్‌ పిచ్చి.. ఏకంగా తొమ్మిది మంది యువకులు గల్లంతు..! కట్‌చేస్తే..
Nine Youths Drowned In Rive
Jyothi Gadda
|

Updated on: Sep 25, 2025 | 9:53 PM

Share

బీహార్‌లోని గయ జిల్లాలో గురువారం ఒక పెద్ద ప్రమాదం జరిగింది. రీల్స్ షుట్‌ చేస్తుండగా తొమ్మిది మంది యువకులు నదిలో పడి మునిగిపోయారు. స్థానికులు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించారు. వెంటనే పోలీసులకు కూడా సమాచారం అందించారు. కానీ, వారు పోలీసులు వచ్చేలోపుగానే స్థానికులు వారందరినీ రక్షించారు. ప్రథమ చికిత్స కోసం యువకులను పోలీసు వాహనంలో ఆసుపత్రికి తరలించారు. అక్కడ వారి పరిస్థితి విషమంగా ఉందని తెలిసింది. .

గురువారం సాయంత్రం గయా జిల్లాలోని ఖిజ్రసరై పోలీస్ స్టేషన్ పరిధిలోని కెన్నీ బ్రిడ్జి సమీపంలో తొమ్మిది మంది యువకులు సరదాగా షికారు చేయడానికి వెళ్లారు. అక్కడ వారంతా సరదాగా గడుపుతున్నారు. కొందరు కెమెరాలతో రీల్స్‌ తీస్తుండగా ప్రమాదవశాత్తు నదిలో పడి మునిగిపోయారు. వారంతా మొదట నది ఒడ్డున తమ మొబైల్ ఫోన్లతో రీల్స్ తయారు చేస్తున్నారు. వారిలో కొందరు మరింత లోతైన నీటిలోకి వెళ్లారు. వారు నీటిలో దూకుతుండగా నీటి ప్రవాహం ఒక్కసారిగా పెరిగిపోవటంతో ప్రవాహంలో కొట్టుకుపోయారు. తమ స్నేహితులను చూసి ఒడ్డున ఉన్న యువకులు వారిని రక్షించడానికి నదిలోకి దూకారు. వారు కూడా వరద ఉధృతికి కొట్టుకుపోయారు. నదిలోకి దిగిన తొమ్మిది మంది యువకులు ఒక్కొక్కరుగా మునిగిపోవడం ప్రారంభించారు.

వారి అరుపులు, కేకలు దూరంగా ఉన్న స్థానికులు గమనించారు. గ్రామస్తులు వెంటనే రక్షణ, సహాయ చర్యలను ప్రారంభించారు. అతికష్టం మీద యువకులందరినీ రక్షించారు. వారిని ఖిజ్రాసరాయ్‌లోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వారిలో ఆరుగురు యువకుల పరిస్థితి తీవ్రంగా ఉండటంతో గయాలోని మగధ్ మెడికల్ కాలేజీకి తరలించారు. మరో ముగ్గురు యువకులు ప్రస్తుతం ప్రమాదం నుండి బయటపడ్డారని తెలిసింది. స్థానిక పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. ఆసుపత్రి నుండి వైద్య నివేదికలు అందిన తర్వాత తదుపరి చర్యలు తీసుకుంటామని పోలీసులు చెప్పారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

Follow Us
Video: స్మిత్ మచ్చర్‌కు ఇజ్రాయెల్ అత్యున్నత శౌర్య పురస్కారం
Video: స్మిత్ మచ్చర్‌కు ఇజ్రాయెల్ అత్యున్నత శౌర్య పురస్కారం
భారత సంతతి మహిళ నవనీతం పిళ్లైను వరించిన నోబెల్ శాంతి పురస్కారం
భారత సంతతి మహిళ నవనీతం పిళ్లైను వరించిన నోబెల్ శాంతి పురస్కారం
రాంచీలో వెస్టిండీస్ సంచలన విజయం
రాంచీలో వెస్టిండీస్ సంచలన విజయం
టమాటా పులావ్ ఇలా చేశారంటే.. అన్నం గిన్నె ఖాళీ అయ్యే వరకు ఆపలేరు!
టమాటా పులావ్ ఇలా చేశారంటే.. అన్నం గిన్నె ఖాళీ అయ్యే వరకు ఆపలేరు!
వీరి జీవితాన్ని మార్చబోతున్న గ్రహాల రాకుమారుడు.. అప్పులు క్లియర్
వీరి జీవితాన్ని మార్చబోతున్న గ్రహాల రాకుమారుడు.. అప్పులు క్లియర్
రెమ్యునరేషన్ భారీగా పెంచేసిన మమిత.. ఒక్కో మూవీకి ఎన్ని కోట్లంటే?
రెమ్యునరేషన్ భారీగా పెంచేసిన మమిత.. ఒక్కో మూవీకి ఎన్ని కోట్లంటే?
పార్క్ చేసిన కారును బొమ్మలా వెనక్కి నెట్టేసిందిగా..!
పార్క్ చేసిన కారును బొమ్మలా వెనక్కి నెట్టేసిందిగా..!
పండగకు ఊరికి వెళ్లేవారికి అలర్ట్.. ఇంటి భద్రతపై పోలీసుల కీలక సూచన
పండగకు ఊరికి వెళ్లేవారికి అలర్ట్.. ఇంటి భద్రతపై పోలీసుల కీలక సూచన
అమెరికా కలపై అనిశ్చితి.. అగ్రరాజ్యంలో జాబ్ ఓకే..
అమెరికా కలపై అనిశ్చితి.. అగ్రరాజ్యంలో జాబ్ ఓకే..
బిర్యానీ ఆకుతో కాళ్ల నొప్పులు మాయం అవుతాయా? వైరల్ చిట్కా
బిర్యానీ ఆకుతో కాళ్ల నొప్పులు మాయం అవుతాయా? వైరల్ చిట్కా