AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral: చిన్నారికి ఆగకుండా వాంతులు.. ఆస్పత్రికి తీసుకెళ్లగా.. ఎక్స్‌రేలో సెంటీమీటర్ పొడవైన..

ప్రపంచంలో కొత్త కొత్త వ్యాధులన్నింటిని చూస్తున్నాం. తాజాగా చైనాలో ఒక కొత్త వ్యాధి బయటపడింది. 8 ఏళ్ల బాలిక సజీవ పురుగులను వాంతి చేసుకుంది. ఇప్పుడు ఈ వార్త వైరల్ అవుతోంది. దానికి అసలు కారణం ఏంటో ఇప్పుడు తెలుసుకుందామా మరి.

Viral: చిన్నారికి ఆగకుండా వాంతులు.. ఆస్పత్రికి తీసుకెళ్లగా.. ఎక్స్‌రేలో సెంటీమీటర్ పొడవైన..
Telugu News
Ravi Kiran
|

Updated on: Jul 02, 2025 | 1:45 PM

Share

ఈ ప్రపంచంలో రోజురోజుకూ వింత వ్యాధులు వెలుగు చూస్తున్నాయ్. మనుషుల్లో అరుదుగా కనిపించే ఈ వింత వ్యాధులతో వైద్యులు అయోమయంలో పడుతున్నారు. తాజాగా ఆ కోవకు చెందిన ఓ ఘటన చైనాలో చోటు చేసుకుంది. చైనాలోని యాంగ్‌జౌ నగరంలో వైద్యులు ఓ అరుదైన వ్యాధిని చూసి దెబ్బకు షాక్ అయ్యారు. తూర్పు చైనా జియాంగ్సు ప్రావిన్స్‌లోని యాంగ్‌జౌ నగరంలో 8 ఏళ్ల బాలిక దాదాపు ఒక నెల నుంచి అదేపనిగా సజీవంగా ఉన్న పురుగులను వాంతి చేసుకుంటోంది. ఆమె కుటుంబం కూడా దీన్ని చూసి ఆశ్చర్యపోయింది.

ఆ చిన్నారి ఎలాంటి వ్యాధితో బాధపడుతోందని.. సదరు కుటుంబానికి అంతుచిక్కలేదు. కానీ ఆ అమ్మాయి ప్రతిసారీ ఒక సెంటీమీటర్ పొడవున్న పురుగులను వాంతి చేసుకుంటోందని ఆమె తండ్రి పేర్కొన్నాడు. వెంటనే స్థానిక ఆస్పత్రికి తరలించారు. జియాంగ్సులోని సూచో విశ్వవిద్యాలయంలో చిల్డ్రన్స్ హాస్పిటల్‌లో చిన్నారులకు పరీక్షలు చేయించగా.. అక్కడి డాక్టర్లు ఎక్స్‌రే, టెస్టులు నిర్వహించి.. సదరు చిన్నారి మాత్ ఫ్లై అని పిలువబడే డ్రెయిన్ ఫ్లై లార్వా వల్ల కలిగే వ్యాధితో బాధపడుతోందని చెప్పారు. ఈ కీటకాలు తరచుగా ఇంటి డ్రెయిన్లు, బాత్రూమ్‌లు, వంటశాలలు వంటి తేమ, చీకటి ప్రదేశాలలో కనిపిస్తాయి. సమ్మర్ సీజన్లలో దక్షిణ చైనాలో ఇవి కనిపించడం సర్వసాధారణం. డాక్టర్లు.. సదరు చిన్నారి తల్లిదండ్రులకు ఈ విషయాన్ని చెప్పగా.. వారు తమ ఇంట్లో ఈ చిన్న పురుగులను చూశామని పేర్కొన్నారు. కానీ అవి ఆరోగ్యానికి హాని కలిగిస్తాయని ఎప్పుడూ ఊహించలేదు.

ఇక ఆ పురుగులు చిన్నారి శరీరంలోకి ఎలా ప్రవేశించాయనే విషయానికి వస్తే, యాంగ్జౌ CDC విభాగం హెడ్ జు యుహుయ్ మాట్లాడుతూ, కలుషితమైన నీటి ద్వారా పురుగులు బాలిక శరీరంలోకి ప్రవేశించి ఉండవచ్చని అన్నారు. బాలిక పళ్ళు తోముకున్నప్పుడు లేదా టాయిలెట్ ఫ్లష్ చేసినప్పుడు, నీటి స్ప్రే ద్వారా పురుగులు ఆమె శరీరంలోకి ప్రవేశించి ఉండవచ్చునన్నారు. ఈ లార్వా రక్తం ద్వారా వ్యాధిని వ్యాపింపజేస్తుందని తెలిపారు.

SCMP నివేదిక ప్రకారం, మురుగునీటి పురుగులను ఒట్టి చేతులతో తాకకూడదు. ఎందుకంటే అవి మోసుకెళ్లే బ్యాక్టీరియా కళ్ళు లేదా నోటి ద్వారా మానవ శరీరంలోకి ప్రవేశిస్తుంది. మురుగు ప్రభావిత కాలువలపై ఉప్పు, బేకింగ్ సోడా కలిపిన వేడి నీటిని పోయడం ద్వారా లార్వాలను తొలగించవచ్చునని స్పష్టం చేశారు.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..