
కేరళలోని త్రిసూర్ నగరం నడిబొడ్డున ఉన్న ప్రభుత్వ వృద్ధాశ్రమంలో అద్బుత సంఘటన చోటు చేసుకుంది. జీవితం చివరి అంకంలో ఉన్న ఇద్దరు వృద్ధులు ఊహించని విధంగా ఒక్కటయ్యారు. 79 ఏళ్ల విజయ్ రాఘవన్, 75 ఏళ్ల సులోచన పెళ్లి చేసుకున్నారు. ఈ ఇద్దరూ వృద్ధాశ్రమంలోనే ఉంటున్నారు. విజయ్ రాఘవన్ 2019 నుంచి అక్కడ ఉంటుండగా, సులోచన 2024లో చేరారు. కాలక్రమేణా వారి మధ్య ఏర్పడిన స్నేహం ప్రేమగా మారిందని తెలుస్తోంది. ఈ క్రమంలోనే జులై 7 సోమవారం రోజున ప్రత్యేక వివాహ చట్టం కింద వీరు పెళ్లి చేసుకున్నారు. రాష్ట్ర ఉన్నత విద్యా మంత్రి ఆర్ బిందు, నగర మేయర్ ఎంకే వర్గీస్, ఇతర అధికారులు, వృద్ధాశ్రమ సిబ్బంది ఈ వృద్ధ జంట వివాహ వేడుకకు హాజరయ్యారు.
ఈ పెళ్లి సంతృప్తికరమైన జీవనానికి ప్రేమకు వయస్సు అడ్డుకాదని చాటిచెప్పింది. ఈ అందమైన క్షణానికి సాక్షిగా ఉండటం నాకు గౌరవంగా ఉంది అంటూ సామాజిక న్యాయ శాఖను కూడా నిర్వహిస్తున్న విద్యామంత్రి బిందు అన్నారు. ఈ జంట రాబోచే రోజులు ప్రేమ, ఆనందంతో నిండిపోవాలని ఆమె తన ఫేస్‌బుక్ ఫోస్ట్ ద్వారా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి…