Snakebite: తెలంగాణలో గతేడాది 2,479 పాము కాటు కేసులు… ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడి
తెలగాణలో ప్రతిఏటా వేల సంఖ్యలో పాము కాటు కేసులు నమోదవుతున్నాయి. గత 2024 సంవత్సరంలో 2, 479 మంది పాము కాట్లకు గురయ్యారు. అదృష్టవశాత్తూ, రాష్ట్రంలో ఎటువంటి మరణాలు సంభవించలేదని ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ తెలిపింది. 2023లో, రాష్ట్రంలో 2,559 పాము కాటు కేసులు నమోదయ్యాయి, 2022లో 2,562 కేసులు నమోదయ్యాయి. దేశవ్యాప్తంగా పాముకాటు బాధితుల్లో

తెలగాణలో ప్రతిఏటా వేల సంఖ్యలో పాము కాటు కేసులు నమోదవుతున్నాయి. గత 2024 సంవత్సరంలో 2, 479 మంది పాము కాట్లకు గురయ్యారు. అదృష్టవశాత్తూ, రాష్ట్రంలో ఎటువంటి మరణాలు సంభవించలేదని ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ తెలిపింది. 2023లో, రాష్ట్రంలో 2,559 పాము కాటు కేసులు నమోదయ్యాయి, 2022లో 2,562 కేసులు నమోదయ్యాయి.
దేశవ్యాప్తంగా పాముకాటు బాధితుల్లో కొద్దిమంది మాత్రమే క్లినిక్‌లు, ఆసుపత్రులకు వెల్లగలుగుతున్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, బీహార్, జార్ఖండ్, మధ్యప్రదేశ్, ఒడిశా, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్ మరియు గుజరాత్‌లలో జనసాంద్రత తక్కువగా ఉన్న చోట, వ్యవసాయ ప్రాంతాలలో నివసించే ప్రజలు 70 శాతం మరణాలకు కారణమవుతున్నారు, ముఖ్యంగా వర్షాకాలంలో పాము కాటు కేసుల ఎక్కువగా ఉంటున్నాయి. 2030 నాటికి పాముకాటు వల్ల కలిగే మరణాలు, వైకల్యాలను సగానికి తగ్గించడానికి ఒక వ్యూహాత్మక విధానాన్ని నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అమలు చేస్తోంది. నేషనల్ యాక్షన్ ప్లాన్ ఫర్ ప్రివెన్షన్ అండ్ కంట్రోల్ ఆఫ్ స్నేక్‌బైట్ ఎన్వెనోమింగ్ (NAPSE) నివేదికలో సంచలన విషయాలు వెల్లడించింది. ఏటా మూడు నుండి నాలుగు మిలియన్ల మంది పాము కాటుకు గురవుతున్నారు. అందులో దాదాపు 58,000 మరణాలు సంభవిస్తున్నాయని, ఇది ప్రపంచవ్యాప్తంగా ఉన్న పాముకాటు మరణాలలో సగం అని ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది.
సెంట్రల్ బ్యూరో ఆఫ్ హెల్త్ ఇన్వెస్టిగేషన్ (CBHI) నివేదికల ప్రకారం (2016-2020), భారతదేశంలో సగటున 3 లక్షల వార్షిక పాముకాటు కేసులు నమోదయ్యాయి. పాముకాటు విషప్రయోగం కారణంగా దాదాపు 2,000 మరణాలు సంభవిస్తున్నాయి. పల్లె జనం పొలం, ఇతర పనులకు వెళ్లిన సమయంలో ఎక్కువగా బాధితులవుతున్నారు. వర్షాకాలంలో చెట్లు, పొదల్లో… గుంతలు, ఇతరచోట్ల పాములు బయటకు వస్తూ ఆ సమీపంలో ఉండేవారిని కరుస్తున్నాయి.
భారతదేశంలో వ్యవసాయ కార్మికులు ఎక్కువగా సాంప్రదాయ వ్యవసాయ పద్దతులనే పాటిస్తూ ఉంటారు. యంత్రాల ద్వారా వ్యవసాయం చేయడం వ్యవసాయ కార్మికులకు అవగాహన లేకపోవడం శాపంగా మారింది. దీంతో పాముకాటుకు గురయ్యే ప్రమాదం ఎక్కువగా ఉంది. వర్షాకాలంలో వ్యవసాయ కార్యకలాపాలు పెరుగుతాయి. అదే సమయంలో పాములు సంతానోత్పత్తి చేసుకునే కాలం. దీంతో ఈ సీజన్‌లో పాములు ఎక్కువగా బయటకు వస్తుంటాయి. తగినంత వెలుతురు లేకపోవడం, నేలపై పడుకోవడం, బహిరంగ మరుగుదొడ్ల వాడకం వల్ల ఎక్కువగా పాము కాటుకు గురవుతుంటారు.