హైదరాబాద్, జులై 27: సాధారణంగా చెస్ అంటేనే అతి కష్టమైన గేమ్ .. ఎత్తులకు పై ఎత్తులు వేయాలి. మెదడుకు పదును పెట్టాలి… అవతలి వ్యక్తుల ఎత్తులను ముందే పసిగట్టి చిత్తు చేయాలి. సాధారణ చెస్ గేమే కష్టం అనుకుంటే నగరానికి చెందిన ఓ ఇంటర్మీడియట్ అమ్మాయి బ్లైండ్ ఫోల్డ్ చెస్ అవలీలగా ఆడేస్తోంది… కళ్ళకు గంతలు కట్టుకుని..నోటేషన్స్ తీసుకోకుండానే సరైన రీతిలో చెస్ కాయిన్స్ అమరుస్తూ అబ్బుర పరుస్తోంది. వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్ తో పాటు ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ లో చోటు సంపాదించింది… ఇంతకీ ఎవరు అమ్మాయి…?? బ్లైండ్ ఫోల్డ్ చెస్ లో ఆమె ప్రతిభ ఎలాంటిది…? తెలుసుకుందాం పదండి.
పైన ఫోటోలోని అమ్మాయి పేరు లిఖిత అన్నపూర్ణ.. వనస్థలిపురం హైకోర్టు కాలనీలో ఉంటుంది.. లిఖిత తల్లిదండ్రులు సాఫ్ట్‌దేర్ ఉద్యోగులు. ప్రస్తుతం లిఖిత హబ్సిగూడలో ఇంటర్ ఫస్టియర్ చదువుతుంది.. పది సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు లిఖితకు చెస్ మీద ఇంట్రెస్ట్ రావడంతో పేరెంట్స్ సాయి ప్రియ, రవి కిషోర్ లికితను ప్రోత్సహించారు. ఎక్కడ చెస్ టోర్నమెంట్లు జరిగిన లిఖితను ఎంకరేజ్ చేసుకుంటూ ఆమెలో ఉన్న టాలెంట్‌ను బయటకు తీశారు. లిఖిత అనతికాలంలోనే ఎన్నో మెడల్స్‌తో పాటు గొప్ప పేరును సంపాదించుకుంది. అయితే చెస్ గేమ్‌లో ఏదైనా కొత్తగా ట్రై చేయాలని ప్రయత్నించింది లిఖిత. గ్రాండ్ మాస్టర్ లో కొంతమంది చెస్ ప్లేయర్లు కళ్ళకు గంతలు కట్టుకొని ఆటను ఆడతారు.. అయితే బ్లైండ్ ఫోల్డ్ కట్టుకున్నటువంటి వ్యక్తి, ఎదురుగా ఉన్నటువంటి వ్యక్తి ఏ చెస్ పీస్‌ను కదిలించాడో గమనించగలరు.
అదెలా సాధ్యం అంటారా అదే ఈ బ్లైండ్ ఫ్లోర్డ్ చెస్ గేమ్ అంటే..ఏ చెస్ పీస్ జరిపాడో గమనించిన సదరు వ్యక్తి పక్కనున్నటువంటి వ్యక్తి ద్వారా ఆ చెస్ పీసులను మూవ్ చేయిస్తాడు. కానీ లిఖిత ఎవరు సహాయం లేకుండా అంటే.. నోటేషన్స్ తీసుకోకుండానే.. కనీసం పీసులను కూడా ముట్టుకోకుండా కళ్లకు గంతలు కట్టుకుని చెస్ గేమ్‌ను ఆడాలి అనుకుంది. ఇలా ప్రతిరోజు కళ్ళకు దూది పెట్టుకుని గట్టిగా గంతలను కట్టి ప్రతిరోజు ప్రాక్టీస్ చేసేది. ఈ సాధనలో లిఖిత గేమ్ బోర్డును తన ముందు పెట్టిన తర్వాత కళ్ళకు గంతలను కట్టుకొని వైట్, బ్లాక్ పీసులను కలిపి ఇచ్చిన దేని కలర్ దానికే చెస్ బోర్డు మీద అమర్చుగలిగే అంత నాలెడ్జ్‌ను సంపాదించుకుంది. లిఖిత ఈ విధంగా 40 సెకన్లలోనే చెస్ బోర్డు మీద పీసులను అమర్చగలదు. ఈ ప్రత్యేక టాలెంట్ ఉన్నటువంటి ఈ మాస్టర్ మైండ్ కిడ్‌కి మల్టిపుల్ బోర్డ్స్ పెట్టిన డిజిటల్‌లో బోర్డు పెట్టిన 64 పీసులను కలిపి ఇచ్చిన కళ్ళకు గంతలు కట్టి ఇలానే చెస్ బోర్డు మీద అమర్చగలదు. అయితే లిఖిత చదువులోనూ ఏం తక్కువ కాదు.. పదవ తరగతి భాష్యంలో చదువుకున్న లిఖిత 9.6 మార్కులతో ఉత్తీర్ణత సాధించింది.
మరోవైపు లిఖిత వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్, ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ తో పాటు జిసిపి సర్టిఫికెట్స్ కూడా సొంతం చేసుకుంది. ఎటువంటి కోచింగ్ ఇవ్వకుండా గైడ్ చేయకపోయినా తనలో ఉన్నటువంటి టాలెంట్‌ను తానే బయట పెట్టుకుంది.. అయితే ఈ బ్లైండ్ ఫోల్డ్ చెస్ గేమ్‌కు ఆదరణ లేదని అంటున్నారు ఆమె తల్లిదండ్రులు. రంగుని సైతం కనిపెట్టి ఏ విధంగా పీసులను బోర్డుపై అమర్చగలుగుతుంది అంటూ చాలామంది అనుమానం వ్యక్తం చేస్తున్నారని తల్లిదండ్రులు చెబుతున్నారు. మొదట్లో లిఖితను సైకియాట్రిస్ట్ వైద్యులు వద్దకు కూడా తీసుకువెళ్లారు. అక్కడి డాక్టర్లు అడిగినటువంటి ప్రశ్నలకు ఆ కలర్ సెన్స్ తనకు ముట్టుకోగానే తెలుస్తోంది అంటూ సమాధానమిచ్చింది లిఖిత.. దీంతో ఆశ్చర్యానికి గురైనటువంటి వైద్యులు 1000 మందిలో ఒకరికి మాత్రమే ఇలాంటి టాలెంట్ ఉంటుందని లికితను ప్రోత్సహించారు. ఈ విధంగా లిఖిత ఎంతోమంది స్టూడెంట్స్‌కు ఆన్లైన్, ఆఫ్‌లైన్ క్లాసులు సైతం చెబుతుంది.. తనలో ఉన్నటువంటి టాలెంట్ తనకే కాకుండా పదిమందికి పంచుతోంది.. తల్లిదండ్రులు మాత్రం ఈ గేమ్‌కు ఆదరణ రావాలని ఆశపడుతున్నారు.. ఇలాంటి టాలెంట్ ఉన్నటువంటి పిల్లలను ప్రభుత్వం సైతం ప్రోత్సహిస్తే ఇండియాకు మెడల్స్ వస్తాయని భావిస్తున్నారు. మరోవైపు గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్‌కి అప్లై చేసుకున్న లిఖిత ప్రస్తుతం పెండింగ్‌లో ఉన్నట్లు తెలుస్తుంది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి.