వ్యాక్సిన్ తీసుకోవడం, తీసుకోకపోవడం వారి ఇష్టం.. ఒలింపిక్ కమిటీ అధ్యక్షుడు
వచ్చే ఏడాది టోక్యోలో జరగనున్న ఒలింపిక్స్‌లో పాల్గొనే క్రీడాకారులకు కరోనా వ్యాక్సిన్ విషయంలో అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ(ఐఓసీ) వెసులుబాటు కల్పించింది.

Olympic Athletes Covid 19 vaccine: వచ్చే ఏడాది టోక్యోలో జరగనున్న ఒలింపిక్స్‌లో పాల్గొనే క్రీడాకారులకు కరోనా వ్యాక్సిన్ విషయంలో అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ(ఐఓసీ) వెసులుబాటు కల్పించింది. ఈ మెగా ఈవెంట్‌లో పాల్గొనే వారు కరోనా వ్యాక్సిన్ వేయించుకోవడం తప్పనిసరేం కాదని ఐఓసీ అధ్యక్షుడు థామస్ బాచ్ అన్నారు. వ్యాక్సిన్ తీసుకోవడం అథ్లెట్ల నిర్ణయానికే వదిలేశామని ఆయన తెలిపారు. (చంద్రప్రభ వాహనంపై.. ధనలక్ష్మిగా దర్శనమిచ్చిన పద్మావతి అమ్మవారు)
దీనిపై థామస్ మంగళవారం మాట్లాడుతూ.. ”ఈ నిర్ణయం తీసుకోవడానికి చాలా కారణాలే ఉన్నాయి. ఒలింపిక్స్ జరిగే సమయానికి ఎన్ని వ్యాక్సిన్‌లు అందుబాటులోకి వస్తాయనే విషయంపై స్పష్టత లేదు. అలాగే వ్యాక్సిన్‌లు ఒక్కొక్కరిపై ఒక్కోలా ప్రభావాన్ని చూపే అవకాశం ఉంది. కొందరిలో ఈ వ్యాక్సిన్‌లు దుష్ప్రభావం చూపే అవకాశాలు కూడా ఉన్నాయి. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నాం” అని తెలిపారు. అయితే తాము మాత్రం అథ్లెట్లు వ్యాక్సిన్ తీసుకోవల్సిందిగా కోరుతామని వెల్లడించారు. కాగా టోక్యో ఒలింపిక్స్ వచ్చే ఏడాది జూలై 23 నుంచి మొదలవుతాయి. ఈ నేపథ్యంలో జపాన్‌లోని టోక్యో ఒలింపిక్స్ ప్రధాన వేదిక నేషనల్ స్టేడియంతోపాటు క్రీడాకారులు బస చేసే క్రీడా గ్రామాన్ని సందర్శించారు థామస్. అలాగే అక్కడి సౌకర్యాలను ఆయన పరిశీలించారు. (Bigg Boss 4: కమాండో ఇన్‌స్టిట్యూట్‌గా మారిన హౌజ్.. అదరగొట్టిన అభిజిత్, హారిక)