Bigg Boss 4: కమాండో ఇన్‌స్టిట్యూట్‌గా మారిన హౌజ్‌.. అదరగొట్టిన అభిజిత్‌, హారిక

మంగళవారం టాస్క్‌లో భాగంగా హౌజ్‌ని కమాండో ఇన్‌స్టిట్యూట్‌గా మార్చేశాడు బిగ్‌బాస్‌. మొదటిరోజు ట్రైనింగ్‌లో భాగంగా ఇంటి సభ్యులకు కొన్ని ఛాలెంజ్‌లు ఎదుర్కోవాల్సి ఉంటుందని

Bigg Boss 4: కమాండో ఇన్‌స్టిట్యూట్‌గా మారిన హౌజ్‌.. అదరగొట్టిన అభిజిత్‌, హారిక
Follow us

| Edited By:

Updated on: Nov 18, 2020 | 7:43 AM

Bigg Boss 4 Abhijeet: మంగళవారం టాస్క్‌లో భాగంగా హౌజ్‌ని కమాండో ఇన్‌స్టిట్యూట్‌గా మార్చేశాడు బిగ్‌బాస్‌. మొదటిరోజు ట్రైనింగ్‌లో భాగంగా ఇంటి సభ్యులకు కొన్ని ఛాలెంజ్‌లు ఎదుర్కోవాల్సి ఉంటుందని, కొన్ని డ్రిల్స్ చేయాల్సి ఉంటుందని బిగ్‌బాస్ చెప్పాడు. ఇక అఖిల్‌ కమాండో ఇన్‌స్టిట్యూట్‌కి కూడా కెప్టెన్‌గా ఉంటాడని తెలిపాడు. మొదట ఛాలెంజ్‌లో భాగంగా బజర్ కొట్టిన సొహైల్‌.. వెయిట్ ఛాలెంజ్‌ టాస్క్‌లో విఫలం అయ్యాడు. బరువైన వెయిట్‌లను స్విమ్మింగ్‌ పూల్‌ నుంచి తీసుకురావాల్సి ఉండగా.. చివర వరకు గట్టిగానే పోరాడాడు. కానీ ఒక్క వెయిట్ దూరంలో సొహైల్‌ ఓడిపోయాడు. దీంతో చాలా భావోద్వేగానికి గురయ్యాడు.

ఆ తరువాత రెండో ఛాలెంజ్‌లో భాగంగా బజర్‌ని నొక్కిన అఖిల్‌.. కాళ్లు చేతులు కింద తగలకుండా పోల్‌ని వాటేసుకున్నాడు. కష్టం మీద ఈ టాస్క్‌ని కంప్లీట్ చేశాడు. ఇక మూడో బజర్‌ని మోగించిన అభిజిత్‌.. మంకీ బార్‌ టాస్క్‌ని స్వీకరించాడు. ఇందులో భాగంగా మంకీ బార్ మీద కాళ్లూ చేతులు వేసి 10 నిమిషాల పాటు వేలాడుతూ ఉండాల్సి ఉండగా.. దాన్ని విజయవంతంగా కంప్లీట్ చేశాడు. దీంతో ఫిజికల్‌ టాస్క్‌లకు దూరంగా ఉంటాడంటూ ఇన్ని రోజులు వేలు చూపించే వారి నోళ్లు మూతపడేలా చేశాడు. టాస్క్‌ తరువాత ఈసారైనా నామినేట్ చేయకండి అని అందరికీ చెప్పాడు. తరువాత అఖిల్‌ చేతుల మీదగా అభి స్టార్‌ని అందుకున్నాడు

చివరగా బజర్‌ని మోగించిన హారిక.. టైర్ టాస్క్‌ చేయడానికి రెడీ అయ్యింది. 10 నిమిషాల పాటు టైర్‌ని 10 రౌండ్లు టైర్‌ని దొర్లించాల్సి ఉండగా.. 9 నిమిషాలలోనే చేసింది. దీంతో అభి చేతుల మీదుగా స్టార్ అందుకుంది. మొత్తానికి ఈ టాస్క్‌లో అభిజిత్‌, హారిక అదరగొట్టేశారు.

పెరుగులో బెల్లం కలిపి తింటే ఈ జబ్బులకు మందు అవసరం లేదు!
పెరుగులో బెల్లం కలిపి తింటే ఈ జబ్బులకు మందు అవసరం లేదు!
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
నల్లగా ఉన్నాయని చీప్‌గా చూడకండి.. ఈ రైస్ గుండె జబ్బులున్నవారికి.!
నల్లగా ఉన్నాయని చీప్‌గా చూడకండి.. ఈ రైస్ గుండె జబ్బులున్నవారికి.!