YS.Sharmila: మళ్లీ పాదయాత్ర మొదలు పెట్టనున్న వైఎస్.షర్మిల.. బీఆర్ఎస్ పాలనకు అంతిమయాత్ర అంటూ..

|

Jan 24, 2023 | 1:31 PM

తీవ్ర ఉద్రిక్త పరిస్థితుల నడుమ ఆగిపోయిన.. వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు వైఎస్.షర్మిల పాదయాత్ర మళ్లీ స్టార్ట్ అవుతోంది. వరంగల్ ఘటనతో తెలంగాణలో ఆమె చేపడుతున్న పాదయాత్ర ఆగిపోయింది. షర్మిల కాన్వాయ్ పై దాడి...

YS.Sharmila: మళ్లీ పాదయాత్ర మొదలు పెట్టనున్న వైఎస్.షర్మిల.. బీఆర్ఎస్ పాలనకు అంతిమయాత్ర అంటూ..
Ys Sharmila
Follow us on

తీవ్ర ఉద్రిక్త పరిస్థితుల నడుమ ఆగిపోయిన.. వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు వైఎస్.షర్మిల పాదయాత్ర మళ్లీ స్టార్ట్ అవుతోంది. వరంగల్ ఘటనతో తెలంగాణలో ఆమె చేపడుతున్న పాదయాత్ర ఆగిపోయింది. షర్మిల కాన్వాయ్ పై దాడి చేయడం, ఆ కారుతోనే షర్మిల ప్రగతి భవన్ ముట్టడికి వెళ్లడం, అక్కడ పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకోవడం, స్టేషన్ కు తీసుకెళ్లడం, వంటివి చకచకగా జరిగిపోయాయి. ఈ క్రమంలో పాదయాత్రకు పోలీసులు అనుమతివ్వలేదు. అయితే తాజాగా.. ఈనెల 28 నుంచి పాదయాత్ర మళ్లీ ప్రారంభం అవుతుందోదని వైఎస్.షర్మిల వెల్లడించారు. ఎక్కడైతే పాదయాత్ర ఆగిందో..అక్కడి నుంచే స్టార్ట్ అవుతుందని చెప్పారు. షర్మిల పాదయాత్ర.. బీఆర్ఎస్ పాలనకు అంతిమయాత్ర అని ఆమె ఫైర్ అయ్యారు. పోలీసులు అనుమతి ఇచ్చినా ఇవ్వకపోయినా పాదయాత్ర స్టార్ట్ అవుతుందని తెలిపారు. ముందస్తు ఎన్నికలు రావన్న షర్మిల.. కేసీఆర్ కు ఆ ఆలోచన లేదని చెప్పారు.

వైఎస్సార్ పాదయాత్ర ఫలితాలే ఆయన అమలు చేసిన పథకాలు. వైఎస్సార్ కు ఇచ్చిన ఆదరణే.. ఇప్పుడు నాకూ ఇస్తున్నారు. వైఎస్సార్ రైతులకు అండగా నిలబడ్డారు. కేసీఆర్ రూ.5 వేలు రైతు బంధు ఇచ్చి.. వైఎస్సార్ ఇచ్చిన రూ.30వేలు లబ్ధిని ఆపేశారు. ఆరోగ్య శ్రీ పథకానికి తూట్లు పొడిచారు. ధనిక రాష్ట్రాన్ని 8 ఏళ్లలో కేసీఆర్ అప్పుల పాలు చేశారు. మళ్ళీ పాదయాత్ర మొదలవుతుంది. ఎక్కడ పాదయాత్ర ఆగిందో అక్కడి నుండే స్టార్ట్ అవుతుంది. పోలీసులు అనుమతి ఇచ్చిన ఇవ్వకున్నా పాదయాత్ర చేసి తిరుతాను. రేవంత్ రెడ్డికి ఆయన పార్టీలోనే అయన మీద నమ్మకం లేదు. ఆ విషయం గురించి మాట్లాడినా అనవసరం.

     – వైఎస్.షర్మిల, వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు

ఇవి కూడా చదవండి

మరోవైపు.. కడప ఎంపీ అవినాష్ రెడ్డికి సీబీఐ నోటీసులు ఇవ్వడంపై స్పందించారు వైఎస్.షర్మిల. వైఎస్ వివేకానంద రెడ్డి కడపలో గొప్ప నాయకుడని కొనియాడారు. అతి దారుణంగా హత్య జరిగి ఇన్ని రోజులు అవుతున్నా.. నిందితులను గుర్తించలేకపోవడం దారణం అని అన్నారు. ఈ కేసును త్వరగా తేల్చాలని రిక్వెస్ట్ చేశారు. ఇందులో ప్రభుత్వం జోక్యం లేదని తాను భావిస్తున్నట్లు వైఎస్.షర్మిల చెప్పారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం