YS Sharmila: విమర్శలు శృతిమించితే సహించేది లేదు.. టీఆర్‌ఎస్‌కు వార్నింగ్‌ ఇచ్చిన షర్మిల

|

Nov 30, 2022 | 9:21 PM

తెలంగాణలో రాజకీయాలు భగ్గుమంటున్నాయి. రాష్ట్రంలో పాదయాత్ర చేస్తున్న తెలంగాణ వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిలను వరంగల్‌ జిల్లా నర్సింపేటలో అడ్డుకోవడంతో..

YS Sharmila: విమర్శలు శృతిమించితే సహించేది లేదు.. టీఆర్‌ఎస్‌కు వార్నింగ్‌ ఇచ్చిన షర్మిల
Ys Sharmila
Follow us on

తెలంగాణలో రాజకీయాలు భగ్గుమంటున్నాయి. రాష్ట్రంలో పాదయాత్ర చేస్తున్న తెలంగాణ వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిలను వరంగల్‌ జిల్లా నర్సింపేటలో అడ్డుకోవడంతో మరింత వివాదం నెలకొంది. ఆమెను అరెస్టు చేసిన పోలీసులు అక్కడి నుంచి హైదరాబాద్‌కు తీసుకువచ్చి కోర్టులో హాజరు పర్చారు. అనంతరం ఆమె బెయిల్‌పై విడుదలయ్యారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో రాజకీయాలు మరింతగా వేడెక్కాయి. ఈ నేపథ్యంలో టీఆర్‌ఎస్‌ నేతలు షర్మిలపై తీవ్ర విమర్శలు చేయగా, ఇందుకు ఆమె ఘాటుగా స్పందించింది. టీఆర్ఎస్‌ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. తమపై విమర్శలు శృతి మించితే సహించేది లేదని టీఆర్‌ఎస్‌ పార్టీని హెచ్చరించారు షర్మిల. తాను చేస్తున్న పాదయాత్ర వల్ల జనాదరణ పెరుగుతోందని గమనించిన టీఆర్‌ఎస్‌.. ఎలాగైనా పాదయాత్రను అడ్డుకోవాలని ప్రయత్నం చేస్తోందని, ఏదీ ఏమైనా ప్రజల కోసం నా పోరాటం కొనసాగుతుందని అన్నారు. తన పాదయాత్రను కట్టడి చేయాలని టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని అన్నారు.

అయితే కేసీఆర్‌, ఆయన కుటుంబ సభ్యులపై షర్మిల ఆరోపణలు చేయడంతోనే పాదయాత్రను అడ్డుకున్నాయమని టీఆర్‌ఎస్‌ నేతలు చెబుతున్నారు. దీంతో నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డిపై ఆమె తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఒకప్పుడు ట్రాక్టర్‌ డ్రైవర్‌గా ఉండి, చిన్నపాటి ఉద్యోగం చేసుకునే వ్యక్తికి ఇప్పుడు రూ.100 కోట్ల ఆస్తులు ఎలా సంపాదించారని ఆమె ప్రశ్నించారు. ఇన్ని కోట్ల ఆస్తులు ఎక్కడి నుంచి వచ్చాయని ఆయన సొంత నియోజకవర్గ ప్రజలే చెబుతున్నారని, అందుకే తాను కూడా ఈ అంశాన్ని లేవనెత్తుతున్నట్లు పేర్కొన్నారు. ఆమె

తన ఆస్తులపై విచారణ చేపట్టాలని పెద్ది సుదర్శన్‌ రెడ్డి చేస్తున్న డిమాండ్‌పై ఆమె స్పందించారు. తన పార్టీ గానీ, తన కుటుంబంపై గానీ ఆస్తులపై విచారణ చేపట్టేందుకు తాను రెడీగా ఉన్నానని, ఇందుకు తాను సవాల్ స్వీకరిస్తున్నానని అన్నారు. మీరు కూడా సవాల్‌ను స్వీకరించాలని ఆమె డిమాండ్‌ చేశారు. తలెంగాణ ప్రభుత్వానికి దమ్ముంటే సుదర్శన్‌ రెడ్డిపై, తన ఆస్తులపై సిట్టింగ్‌ జడ్జితో విచారణ జరిపించాలని ఆమె డిమాండ్‌ చేశారు. మీరు ప్రజల సొమ్మును దండుకుని అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు.

ఇవి కూడా చదవండి


మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి