YS Sharmila: వైఎస్సార్ బిడ్డను ఎవరూ బంధించలేరు.. సీఎం కేసీఆర్ పై షర్మిల సంచలన వ్యాఖ్యలు..
తన పాదయాత్రకు పోలీసులు అనుమతి ఇవ్వకపోవడంపై బీఆర్ఎస్ ప్రభుత్వ తీరుపై వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు వైఎస్.షర్మిల తీవ్రంగా ఫైర్ అయ్యారు. పాదయాత్రకు హై కోర్టు అనుమతి ఇచ్చినా.. కేసీఅర్ తన పాదయాత్ర...
తన పాదయాత్రకు పోలీసులు అనుమతి ఇవ్వకపోవడంపై బీఆర్ఎస్ ప్రభుత్వ తీరుపై వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు వైఎస్.షర్మిల తీవ్రంగా ఫైర్ అయ్యారు. పాదయాత్రకు హై కోర్టు అనుమతి ఇచ్చినా.. కేసీఅర్ తన పాదయాత్ర ను టార్గెట్ చేశారని ఆరోపించారు. కోర్టు ఆదేశాలు అన్నా కేసీఆర్ కు గౌరవం లేకుండా పోయిందని మండిపడ్డారు. ఆమరణ దీక్ష చేస్తుంటే తనను, తమ పార్టీ కార్యకర్తలను బంధించారన్న షర్మిల.. ఎక్కడికక్కడ అరెస్ట్ లు చేశారని ఫైర్ అయ్యారు. లోటస్ పాండ్ చుట్టూ అన్ని వైపులా బారికేడ్స్ పెట్టి, చెక్ పోస్ట్ లు ఏర్పాటు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అకారణంగా కర్ఫ్యూ విధించారని విమర్శించారు. తమ కార్యకర్తలను బలవంతంగా పోలీస్ వ్యాన్ లోకి ఎక్కించి.. ఠాణాలో పెట్టి దారుణంగా కొట్టారని తెలిపారు. వైఎస్సార్టీసీ కార్యకర్తలు ఇవన్నీ భరించారని, వారి సహనాన్ని పరీక్షించవద్దని కేసీఆర్ కు సూచించారు. ఈ మేరకు తన పాదయాత్రకు అనుమతి ఇవ్వాలని ఆమరణ దీక్షకు దిగిన షర్మిల.. తాజాగా ఆస్పత్రి బెడ్‌పై నుంచే మాట్లాడారు.
వైఎస్ఆర్ బిడ్డను కేసీఅర్ పంజరంలో పెట్టి బందించవచ్చు అనుకుంటున్నారు. ఉదయించే సూర్యుడిని ఎవరూ ఆపలేరు. మళ్ళీ చెప్తున్నా. వైఎస్ఆర్ సంక్షేమ పాలన కోసమే వైఎస్సార్ తెలంగాణ పార్టీ స్థాపించా. వైఎస్సార్ పాలన తిరిగి తీసుకు వచ్చేంత వరకు రెట్టింపు ఉత్సాహంతో పనిచేస్తాను. వైఎస్సార్టీపీ కార్యకర్తల త్యాగాలు ఎన్నటికీ మరవను. వారందరికీ కృతఙ్ఞతలు.
– వైఎస్ షర్మిల, వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు
మరోవైపు.. స్వల్ప అస్వస్థతకు గురై అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు వైఎస్.షర్మిల ఆరోగ్యంపై వైద్యులు హెల్త్ బులెటిన్ విడుదల చేశారు. లోబీపీ, బలహీనత వల్ల ఆమెను ఆస్పత్రిలో చేర్పించారని తెలిపారు. ఆరోగ్యం సహకరించేంత వరకు రెండు నుంచి మూడు వారాలు పూర్తిగా విశ్రాంతి తీసుకోవాలని డాక్టర్లు సూచించారు. తన పాదయాత్రకు అనుమతి ఇవ్వాలంటూ రెండు రోజులుగా షర్మిల ఆమరణ దీక్షకు దిగారు. ఈ క్రమంలో ఆమె ఆరోగ్యం విషమించింది. దీంతో పోలీసులు బలవంతంగా ఆమెను ఆస్పత్రిలో చేర్చారు..
మరిన్ని తెలంగాణ వార్తల కోసం