Hyderabad: కలికాలం గురూ.. పెళ్లైందని మొత్తుకున్నా అతడిని వదలని స్టూడెంట్.. చివరకు..

| Edited By: Srikar T

Feb 28, 2024 | 9:32 PM

ఓ యువతి తన ప్రేమను నిరాకరించాడన్న అక్కసుతో చదువు చెప్పే ఫ్యాకల్టీ కుటుంబంపైనే నీచానికి ఒడిగట్టింది. తనకు ఆల్రెడీ పెళ్లైందని, తన ప్రపోజల్ తిరస్కరించడంతో అతనిపై ద్వేషం పెంచుకుంది. దీంతో ఆ యువతి ప్రియుడి భార్యతో పాటు అతడి కూతురి అశ్లీల ఫోటోలను మార్ఫింగ్‌ చేసి సోషల్ మీడియాలో పోస్టు చేసింది. అలాగే.. నకిలీ ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ తెరిచి అసభ్యకర ఫొటోలు పోస్టు చేస్తూ ఇబ్బందులకు గురిచేసింది. ఇంతటితో ఆగకుండా వేధింపులకు, బ్లాక్ మెయిల్స్ పాల్పడింది. దీంతో ఆ వ్యక్తి పోలీసులను ఆశ్రయించారు. కథ అడ్డం తిరిగింది.

Hyderabad: కలికాలం గురూ.. పెళ్లైందని మొత్తుకున్నా అతడిని వదలని స్టూడెంట్.. చివరకు..
Hyderabad Civil Cotching
Follow us on

ఓ యువతి తన ప్రేమను నిరాకరించాడన్న అక్కసుతో చదువు చెప్పే ఫ్యాకల్టీ కుటుంబంపైనే నీచానికి ఒడిగట్టింది. తనకు ఆల్రెడీ పెళ్లైందని, తన ప్రపోజల్ తిరస్కరించడంతో అతనిపై ద్వేషం పెంచుకుంది. దీంతో ఆ యువతి ప్రియుడి భార్యతో పాటు అతడి కూతురి అశ్లీల ఫోటోలను మార్ఫింగ్‌ చేసి సోషల్ మీడియాలో పోస్టు చేసింది. అలాగే.. నకిలీ ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ తెరిచి అసభ్యకర ఫొటోలు పోస్టు చేస్తూ ఇబ్బందులకు గురిచేసింది. ఇంతటితో ఆగకుండా వేధింపులకు, బ్లాక్ మెయిల్స్ పాల్పడింది. దీంతో ఆ వ్యక్తి పోలీసులను ఆశ్రయించారు. కథ అడ్డం తిరిగింది. వేధింపులకు పాల్పడింది ఓ యువతనీ, ఆమె ఐఏఎస్ కోచింగ్ సెంటర్‌లో కోచింగ్ తీసుకుంటున్నట్లు పోలీసులు గుర్తించారు. దీంతో ఆ యువతిని పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కి తరలించారు.

ఆంధ్రప్రదేశ్ అనంతపురం జిల్లాకు చెందిన లక్ష్మీ అనే యువతి ఐఏఎస్ కోచింగ్ కోసం హైదరాబాద్ వచ్చింది. సివిల్స్ కోసం అశోక్‌ నగర్‌లో కోచింగ్ తీసుకుంటుంది. సెకండ్ హ్యాండ్‌ ఫోన్లు కొనుగోలు చేసి, యాచకుల పేరుతో యువతి ఒక సిమ్ కార్డు తీసుకుంది. ఓ ప్రముఖ ఐఏఎస్ సెంటర్‌లో జాయిన్ అయ్యింది. ఈ క్రమంలో ఆ కోచింగ్ సెంటర్‎లో ఫ్యాకల్టీపై మనసు పారేసుకుంది. అనుకున్నదే తడవుగా.. తాను ఇష్టపడిన వ్యకికి ప్రపోజ్ చేసింది. కానీ, ఆ వ్యక్తి తనకు పెళ్లైందని.. ప్రేమను తిరస్కరించాడు. దీంతో ఆ యువతి ద్వేషం పెంచుకుంది. ఈ క్రమంలో ఆ ప్రొఫెసర్ భార్య, కూతురు ఫొటోలను మార్ఫింగ్ చేసింది.

సోషల్ మీడియాలో ఓ ఫేక్ అకౌంట్స్ సృష్టించి న్యూడ్ ఫొటోలను పోస్ట్ చేసింది. దీనిపై స్పందించిన బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో కేసు నమోదు చేసుకుని నిందితురాలిని అరెస్ట్ చేశారు. తనని ప్రేమించలేదంటూ ఫ్యాకల్టీతో పాటు అతడి రెండేళ్ల కూతురి న్యూడ్‌ ఫోటోలుగా మార్ఫింగ్ చేసినట్టు యువతి ఒప్పుకుంది. ఫోటోలను అడ్డుపెట్టుకొని పెళ్లి చేసుకోవాలని బెదిరింపులు పాల్పడింది. ఇలా మనసు పడి.. ప్రేమను తిరస్కరించినందుకు ఫ్యాకల్టీ ఫ్యామిలీని యువతి టార్గెట్ చేసి న్యూడ్ ఫొటోస్‎గా మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో పోస్టింగ్ చేసింది. ఇలా పోలీసుల విచారణలో అడ్డంగా దొరికిపోయింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..