Telangana: యువతిని వెంటాడిన పాము.. ఏడు నెలల్లో మూడు సార్లు కాటు.. అసలేమైందంటే..?

|

Mar 20, 2022 | 2:04 PM

Girl killed by snake bite: పాము రూపంలో వచ్చిన మృత్యువు ఆమెను మూడు సార్లు వెంటాడింది. ఏడునెలల వ్యవధిలో పాము మూడు సార్లు ఆమెను కాటేసింది. అయితే.. పాము కాటుకు

Telangana: యువతిని వెంటాడిన పాము.. ఏడు నెలల్లో మూడు సార్లు కాటు.. అసలేమైందంటే..?
Crime News
Follow us on

Girl killed by snake bite: పాము రూపంలో వచ్చిన మృత్యువు ఆమెను మూడు సార్లు వెంటాడింది. ఏడునెలల వ్యవధిలో పాము మూడు సార్లు ఆమెను కాటేసింది. అయితే.. పాము కాటుకు గురైన ఆమె రెండు సార్లు కోలుకున్నా.. మూడో సారి ఆమె విధికి తలొంచాల్సి వచ్చింది. పాము కాటుతో యువతి మృతిచెందిన విషాద ఘటన ఆదిలాబాద్‌ (Adilabad) జిల్లా బేల మండలం బెదోడ గ్రామంలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన భలేరావు సుభాష్‌ దంపతుల ఏకైక కుమార్తె ప్రణాళి (18). ఆమె ఆదిలాబాద్‌లోని ఓ ప్రైవేటు కళాశాలలో డిగ్రీ చదువుతోంది. అయితే.. గతేడాది సెప్టెంబరులో ఇంట్లో నిద్రిస్తుండగా చేతిపై పాము కాటు వేసింది. అప్పుడు దాదాపు రూ.4 లక్షల వరకు ఖర్చు చేసి ఆమెను తల్లిండ్రులు బతికించుకున్నారు. రెండోసారి ఈ ఏడాది జనవరిలో ఇంటి ఆవరణలో కూర్చొని ఉండగా పాము కాటువేసింది. సకాలంలో చికిత్స అందించడంతో తిరిగి కోలుకుంది.

ఈ క్రమంలో శుక్రవారం హోలీ పండగ రోజు స్నేహితులతో హోలీ ఆడుకునేందుకు సిద్ధమైంది. ఈ క్రమంలో ఇంట్లో బ్యాగులోని రంగులను తియబోతుండగా అందులో నక్కి ఉన్న పాము ఒక్కసారిగా ఆమెను కాటు వేసింది. వెంటనే అప్రమత్తమైన కుటుంబసభ్యులు ఆమెను హుటాహుటిన రిమ్స్‌కు తరలించారు. ఈ క్రమంలో చికిత్స పొందుతూ మరణించింది. ఒక్కగానొక కుమార్తె మృతితో కుటుంబీకుల కన్నీరుమున్నీరవుతున్నారు. అయితే.. ప్రణాళిని రెండుసార్లు పౌర్ణమి రోజున, ఒకసారి అమావాస్య రోజున పాము కాటేసిందంటూ కుటుంబసభ్యులు పేర్కొంటున్నారు. దీంతో గ్రామంలో విషాదం అలుముకుంది.

Also Read:

AP Crime News: చిత్తూరు టు భీమిలి.. వయా గుంటూరు.. పసిబిడ్డ కిడ్నాప్ కథ సుఖాంతం..

Chicken: భార్య చికెన్ వండలేదని డయల్ 100కు ఫోన్.. పోలీసులు ఏం చేశారో తెలిస్తే షాకవ్వాల్సిందే..