కన్నీటి వరద.. ఎయిర్‌పోర్టుకు బయల్దేరిన తండ్రీ, కూతురు ఇలా తిరిగిరాని లోకాలకు..

చివరకు ఆమె ఓ పొలంలో విగతజీవిగా కనిపించింది. కారు గల్లంతైన ప్రాంతానికి సమీపంలోని పామాయిల్ తోటలో అశ్విని మృతదేహం లభించింది. తండ్రి మోతీలాల్ కోసం ముమ్మర గాలింపు చర్యలు చేపట్టగా తండ్రి మోతీలాల్‌ ఆచూకీ సోమవారం లభించింది.

కన్నీటి వరద.. ఎయిర్‌పోర్టుకు బయల్దేరిన తండ్రీ, కూతురు ఇలా తిరిగిరాని లోకాలకు..
Young lady ecientits along with father washed away
Follow us

|

Updated on: Sep 02, 2024 | 12:52 PM

తెలుగు రాష్ట్రాల్లో కుండపోత వర్షాలు కుమ్మరించారు. రెండ్రోజుల పాటు ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షానికి జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. ఆదివారం కురిసిన వర్షానికి పలు ప్రాంతాల్లో ప్రజలు వరదలో కొట్టుకుపోయారు. ఈ క్రమంలోనే మహబూబాబాద్ జిల్లా వాగు ప్రవాహంలో తండ్రితో సహా ఓ యంగ్‌ సైంటిస్ట్‌ కూడా కొట్టుకుపోయింది. చివరకు ఆమె ఓ పొలంలో విగతజీవిగా కనిపించింది. కారు గల్లంతైన ప్రాంతానికి సమీపంలోని పామాయిల్ తోటలో అశ్విని మృతదేహం లభించింది. తండ్రి మోతీలాల్ కోసం ముమ్మర గాలింపు చర్యలు చేపట్టగా తండ్రి మోతీలాల్‌ ఆచూకీ సోమవారం లభించింది.

ఖమ్మం జిల్లా సింగరేణి మండలం గేట్‌ కారేపల్లి గంగారానికి చెందిన అశ్విని ఢిల్లీలోని విత్తన పరిశోధన సంస్థలో శాస్త్రవేత్తగా విధులు నిర్వహిస్తున్నారు. ఇటీవల సెలవుపై ఇంటికి వచ్చిన కుమార్తె ఢిల్లీకి వెళ్లాల్సి ఉండగా, హైదరాబాద్ ఎయిర్‌పోర్టులో దిగబెట్టేందుకు తండ్రి మోతీలాల్‌ అశ్వినిని తీసుకుని కారులో బయల్దేరారు. మహబూబాబాద్‌ జిల్లా పురుషోత్తమాయగూడెం వద్ద ఆకేరు వాగు ప్రవాహంలో వారు ప్రయాణిస్తున్న కారు కొట్టుకుపోయింది.

ఈ ఘటనలో ఇద్దరూ గల్లంతయ్యారు. అశ్విని మృతదేహం ఆదివారమే లభ్యం కాగా, తండ్రి మోతీలాల్‌ ఆచూకీ సోమవారం లభించింది. కుమ్మరికుంట తండా సమీపంలో మోతీలాల్‌ మృతదేహాన్ని గుర్తించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం క్లిక్ చేయండి..