Medaram Jathara: శభాష్ ఎస్పీ శబరీష్.. మేడారం జాతరలో రికార్డ్ సృష్టించిన యువ ఐపీఎస్

మేడారం మహా జాతర విజయవంతంగా ముగిసింది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు లేకుండా కోటిన్నర మంది భక్తులు వనదేవతలు సమ్మక్క, సారక్కలను దర్శనం చేసుకున్నారు. అయితే ఈ మహా జాతర మొత్తంలో హైలెట్‌గా నిలిచాడు ఒక ఐపీఎస్ ఆఫీసర్. ఆయనే ములుగు పోలీస్ సూపరిండెంట్ శబరీష్. కట్టుదిట్టమైన భద్రతా చర్యలతోపాటు ట్రాఫిక్ నుండి భక్తుల కంట్రోలింగ్ వరకు అన్ని తానై నిలిచి జాతర సక్సెస్‌లో కీలకంగా వ్యవహరించారు.

Medaram Jathara: శభాష్ ఎస్పీ శబరీష్.. మేడారం జాతరలో రికార్డ్ సృష్టించిన యువ ఐపీఎస్
Ips Officer Mulugu Sp Shabarish
Follow us

| Edited By: Balaraju Goud

Updated on: Feb 26, 2024 | 3:56 PM

మేడారం మహా జాతర విజయవంతంగా ముగిసింది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు లేకుండా కోటిన్నర మంది భక్తులు వనదేవతలు సమ్మక్క, సారక్కలను దర్శనం చేసుకున్నారు. అయితే ఈ మహా జాతర మొత్తంలో హైలెట్‌గా నిలిచాడు ఒక ఐపీఎస్ ఆఫీసర్. ఆయనే ములుగు పోలీస్ సూపరిండెంట్ శబరీష్. కట్టుదిట్టమైన భద్రతా చర్యలతోపాటు ట్రాఫిక్ నుండి భక్తుల కంట్రోలింగ్ వరకు అన్ని తానై నిలిచి జాతర సక్సెస్‌లో కీలకంగా వ్యవహరించారు.

మేడారం జాతరలో ప్రతి ఒక్కరి శభాష్ షబరీష్ అంటునారు. ములుగు ఎస్పీగా ఉన్న శబరిష్ అందరి ప్రశంసలు అందుకుంటున్నాడు. జిల్లా ఎస్పీగా పని చేయడం మొదటిసారి అయినప్పటికీ, మేడారం జాతరలో ఎక్కడ ఎలాంటి లోటు లేకుండా జాతర సక్సెస్ చేశారు. మేడారం జాతర అంటేనే పోలీసులకు కంటిమీద కునుకు ఉండదు. కొన్ని నెలలపాటు వేసుకున్న ప్లానింగ్ జాతర సక్సెస్‌లో కీలక పాత్ర పోషించింది. ఇందుకు ప్రధాన కారణం ములుగు ఎస్పీ శబరిష్. గతంలో పలువురు సీనియర్ ఐపీఎస్ అధికారులు సజ్జనార్, స్టీఫెన్ రవీంద్ర, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, రాజేష్ కుమార్ లాంటి ఆఫీసర్ల బాటలోనే యంగ్ ఐపీఎస్ శబరిష్ నిలిచాడు..

ములుగు జిల్లా ఎస్పీగా బాధ్యతలు చేపట్టిన కొన్ని రోజుల్లోనే మేడారం జాతర బాధ్యతలు చూసుకున్నాడు. ఎస్పీగా ఉన్న అధికారే మహాదేవతల ప్రవేశం సందర్భంగా ఏకే 47 తో ఆహ్వానించాల్సి ఉంటుంది. ఆ బాధ్యతను సక్రమంగా నిర్వర్తించాడు ఎస్పీ శబరిష్. ప్రజల్లో కలిసిపోయి ప్రజలతో మమేకమై సాధారణ సామాన్యుడిలా వనదేవతలను ఆహ్వానించిన సందర్భంలో తన ఆనందాన్ని అక్కడ ఉన్న ప్రతి ఒక్కరు ఆస్వాదించారు..

శబరిష్ ఆధ్వర్యంలో మొత్తం మేడారం జాతరకు 15,000 మంది పోలీసులు సమగ్రంగా నిర్వహించడంతో జాతర సక్సెస్ అయింది. జాతర మొదలైన నాటి నుండి జాతర ముగిసే వరకు పోలీసుల పాత్ర చాలా కీలకం. పోలీసులు లేని మేడారం జాతరను ఊహించడానికి కష్టంగా ఉంటుంది. ఎందుకంటే సుమారు కోటిన్నరకు పైగా భక్తులు వనదేవతలను దర్శించుకునేందుకు బారులు తీరుతారు. ఇలాంటి సందర్భాల్లో ట్రాఫిక్ నుండి మొదలుపెట్టి పార్కింగ్‌తోపాటు క్రౌడ్ మేనేజ్‌మెంట్ వంటి సమస్యలు పోలీసులకు సవాలుగా మారతాయి. మొదటిసారి జిల్లా ఎస్పీగా పనిచేస్తున్న శబరీష్‌లో ఎక్కడ అనుభవం లోటు కనిపించలేదు. అన్ని శాఖల అధికారులతో సమన్వయం చేసుకుని జాతర సక్సెస్ లో కీలక పాత్ర పోషించాడు.

ఐజీలు ఎస్పీలు కమిషనర్లు అందరినీ కోఆర్డినేట్ చేయాల్సిన బాధ్యత జిల్లా ఎస్పీ పైనే ఉంటుంది. ఎక్కడ ప్రజలకు ఎలాంటి అసౌకర్యం వాటిల్లకుండా 15,000 మంది పోలీసులను సమన్వయం చేసుకుంటూ అడుగడుగున సీసీ కెమెరాల నిఘాలో పర్యవేక్షణ చేస్తూ జాతరను విజయవంతం చేశాడు. మొత్తం 500 సీసీ కెమెరాలతో పాటు ప్రత్యేక డ్రోన్ కెమెరాలను ఏర్పాటు చేసి ప్రతి దృశ్యాన్ని కమ్యాండ్ కంట్రోల్ సెంటర్‌కు అనుసంధానం చేస్తూ జాతరను సక్సెస్ చేశారు. ఎప్పటికప్పుడు స్పాట్ లో ఉన్న ఆఫీసర్స్ కు సూచనలు చేయడం… ఎక్కడ ఇబ్బంది కలిగినా… వెంటనే అక్కడున్న పెట్రోలింగ్ టీంకు ఆదేశాలు జారీ చేయడం ద్వారా ఈసారి జాతరలో ఇబ్బందులు పెద్దగా తలెత్తలేదు.

ఎప్పుడు జాతరకు వచ్చిన పార్కింగ్ తో పాటు ట్రాఫిక్ సమస్యలు ప్రధానంగా పోలీసులను కలవరపెడతాయి. కానీ ఈసారి పోలీసులు వేసుకున్న ప్రణాళికను అమలు చేసి ఆ సమస్యను సైతం అధిగమించారు. ఎంట్రీ ఎగ్జిట్ పాయింట్ లో స్పెషల్ అరేంజ్‌మెంట్స్ ద్వారా ట్రాఫిక్ సమస్యను అధిగమించారు. దీంతో పాటు పార్కింగ్ కోసం ఈసారి అదనంగా మరో 50 ఎకరాల ప్లేసును కేటాయించారు. వీవీఊపీల దగ్గర నుండి మొదలుకుని సామాన్య భక్తుల వరకు ప్రతి ఒక్కరి మూమెంట్ ను పోలీసులు విజయవంతంగా పూర్తి చేశారు. రోజుకి 20 లక్షల మంది భక్తులు మేడారం జాతరలో పాల్గొన్నారు. ఇంతమంది క్రౌడ్ ను కంట్రోల్ చేయడం అంటే ఆషామాషీ విషయం కాదు. ప్రతి నాలుగు కిలోమీటర్లకు ఓ పోలీస్ అవుట్ పోస్ట్ తో పాటు ప్రతి రెండు కిలోమీటర్లు వాహనం వంటి ఏర్పాట్లు చేసుకుని పోలీస్ శాఖ ఈసారి జాతరను విజయవంతంగా పూర్తి చేసింది.

అయితే ప్రతిసారి పోలీసులకు ఆర్టీసీ బస్సుల విషయంలో కాస్త ఇబ్బంది ఎదురవుతూ ఉండేది. కానీ ఈసారి ఆ సమస్యను సైతం పోలీసులు అధిగమించారు. ఆర్టీసీ అధికారులతో ఎప్పటికప్పుడు జిల్లా ఎస్పీ సమన్వయం చేసుకుంటూ వచ్చారు. కమాండ్ కంట్రోల్ సెంటర్ ద్వారా నేరుగా ఆర్టీసీ బస్సుల కోసం ఏర్పాటు చేసిన పార్కింగ్ ను తానే పర్యవేక్షించాడు. ఏదైనా ఇబ్బంది కలిగిన తరుణంలో జిల్లా ఎస్పీ శబరిష్ నేరుగా స్పాట్ కి చేరుకొని ఆ ట్రాఫిక్ క్లియర్ చేయించాడు. ఈ విధంగా మొదటిసారి జిల్లా ఎస్పీ గా బాధ్యతలు చేపట్టినప్పటికీ ఎంతో అనుభవం గల అధికారిగా జాతరను సక్సెస్ చేసి అందరి మన్నలు పొందాడు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి… 

ట్రంప్‌ vs కమలా హారిస్.. భవిష్యత్తును నిర్ణయించేది ఆ 7 స్టేట్సే..
ట్రంప్‌ vs కమలా హారిస్.. భవిష్యత్తును నిర్ణయించేది ఆ 7 స్టేట్సే..
అమెరికా ఎన్నికల వేళ..గూగుల్‌ ఉద్యోగులకు సుందర్‌ పిచాయ్‌ వార్నింగ్
అమెరికా ఎన్నికల వేళ..గూగుల్‌ ఉద్యోగులకు సుందర్‌ పిచాయ్‌ వార్నింగ్
మళ్లీ రంగంలోకి.. ఆ ప్రాంతంలోని భూ ఆక్రమణలపై హైడ్రా ఫోకస్..
మళ్లీ రంగంలోకి.. ఆ ప్రాంతంలోని భూ ఆక్రమణలపై హైడ్రా ఫోకస్..
ఇన్‌స్టాగ్రమ్‌లో పరిచయం చేసుకున్నాడు.. చాటింగ్ చేశాడు.. చివరికి
ఇన్‌స్టాగ్రమ్‌లో పరిచయం చేసుకున్నాడు.. చాటింగ్ చేశాడు.. చివరికి
యూపీ యోధాస్‌పై జైపూర్‌‌ ఉత్కంఠ విజయం..
యూపీ యోధాస్‌పై జైపూర్‌‌ ఉత్కంఠ విజయం..
సామ్‌సంగ్‌ నుంచి అద్భుతం.. 280 ఎంపీ కెమెరాతో వస్తోన్న కొత్త ఫోన్‌
సామ్‌సంగ్‌ నుంచి అద్భుతం.. 280 ఎంపీ కెమెరాతో వస్తోన్న కొత్త ఫోన్‌
యుద్ధాలపై అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు ఎలాంటి ప్రభావం చూపుతాయి
యుద్ధాలపై అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు ఎలాంటి ప్రభావం చూపుతాయి
శ్రేయాస్ అయ్యర్ ఏ జట్టు తరపున బరిలోకి దిగనున్నాడంటే?
శ్రేయాస్ అయ్యర్ ఏ జట్టు తరపున బరిలోకి దిగనున్నాడంటే?
పంట భలే ఏపుగా పెరిగింది అనుకునేరు.. లోపలకెళ్లి చూస్తే
పంట భలే ఏపుగా పెరిగింది అనుకునేరు.. లోపలకెళ్లి చూస్తే
మన దేశంలో కులవ్యవస్థ బలంగా ఉంది: రాహుల్‌ గాంధీ
మన దేశంలో కులవ్యవస్థ బలంగా ఉంది: రాహుల్‌ గాంధీ