కోపం వస్తే బంధాలు, బంధుత్వాలు కూడా చూడటం లేదు. ఎదుటి వ్యక్తి ప్రాణాల గురించి కూడా ఆలోచించడం లేదు. తాజాగా తెలంగాణలో ఓ యువతి విచక్షణ లేకుండా ప్రవర్తించిన తీరు.. తీవ్ర చర్చనీయాంశమైంది. అక్క ముఖంపై సలాసలా కాగే వేడి నూనె పోసింది చెల్లి. తాను సన్నిహితంగా ఉంటున్న వ్యక్తితో అక్క కూడా క్లోజ్‌గా ఉంటుందన్న కోపంతోనే ఈ దాడికి పాల్పడ్డట్టు తెలుస్తోంది. కామారెడ్డి జిల్లా( Kamareddy district) కేంద్రంలోని అశోక్ నగర్ కాలనీ(Ashok Nagar Colony)లో జరిగింది ఈ ఘటన. అర్దరాత్రి నిద్రిస్తున్న అక్క చాందినిపై చెల్లెలు వేడి నూనె పోసేసింది. వేడి నూనె పోయడంతో ఆమె ముఖం సగభాగం కాలిపోయింది. చాందినీ అరుపులు కేకలతో నిద్రలేచిన కుటుంబసభ్యులు..వెంటనే ఆమెను ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉంది. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అక్క పట్ల కనీస మానవత్వం లేకుండా ప్రవర్తించిన చెల్లెలు తీరుపై కుటుంబ సభ్యులు భగ్గుమంటున్నారు. పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
Also Read: నిఖా జరుగుతుండగా చివరి నిమిషంలో వధువు ట్విస్ట్.. పోలీస్ స్టేషన్‌లో మరో టర్న్