AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ముచ్చింతల్‌లో వైభవంగా యతీంద్ర సప్తతి.. చిన్న జీయర్ స్వామి కీలక వ్యాఖ్యలు

Chinna Jeeyar Swamy 70th Tirunakshatra Mahotsavam: ముచ్చింతల్‌లో చిన్న జీయర్ స్వామి 70వ తిరునక్షత్ర మహోత్సవాల్లో భాగంగా యతీంద్ర సప్తతి రెండో రోజు వేడుకలు వైభవంగా జరిగాయి. ఈ సందర్భంగా జీయర్ అనుబంధ సంస్థల సేవా కార్యక్రమాలను వివరించడంతో పాటు ‘ఆచార్య వైభవం’ కార్యక్రమాన్ని నిర్వహించారు.

ముచ్చింతల్‌లో వైభవంగా యతీంద్ర సప్తతి.. చిన్న జీయర్ స్వామి కీలక వ్యాఖ్యలు
Chinna Jeeyar Swamy
Rajashekher G
|

Updated on: Nov 09, 2026 | 5:04 PM

Share

Chinna Jeeyar Swamy 70th Tirunakshatra Mahotsavam: ముచ్చింతల్‌లో జరుగుతున్న చిన్న జీయర్ స్వామి 70వ తిరునక్షత్ర మహోత్సవాల్లో భాగంగా యతీంద్ర సప్తతి రెండో రోజు కార్యక్రమాలు వైభవంగా కొనసాగాయి. జీయర్ అనుబంధ సంస్థల కార్యకలాపాల నివేదికను సమర్పించడంతో పాటు ఉభయదారులకు ఆచార్యుల మంగళాశాసనాలు అందించారు. రెండో రోజు ప్రత్యేక ఆకర్షణగా ఆచార్య వైభవం కార్యక్రమం నిర్వహించారు.

ఈ సందర్భంగా జీయర్ స్వామి మాట్లాడుతూ.. జీయర్ అనుబంధ సంస్థలు ఉన్నతమైన సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయని తెలిపారు. ఎలాంటి లాభాపేక్ష లేకుండా ప్రజలకు ఉచితంగా సేవలు అందిస్తున్నామని చెప్పారు. భవిష్యత్ తరాలకు కూడా ఈ సేవలు నిరంతరాయంగా అందించాలనే లక్ష్యంతోనే ప్రాజెక్ట్ సహస్రను ఏర్పాటు చేసినట్లు వివరించారు.

పెద్ద జీయర్ స్వామి ప్రారంభించిన సేవలను కొనసాగిస్తూ సామాజిక, సాంస్కృతిక, ఆరోగ్య రంగాల్లో అనేక కార్యక్రమాలు చేపడుతున్నామని శ్రీ శ్రీ శ్రీ త్రిదండి చిన్న జీయర్ స్వామి తెలిపారు. యతీంద్ర సప్తతి ఉత్సవాలు కేవలం తిరునక్షత్ర వేడుకలకే పరిమితం కాకుండా.. సమాజానికి సేవలందించిన వారిని గుర్తించి పురస్కారాలతో గౌరవించే వేదికగా రూపొందించామని పేర్కొన్నారు.

టీవీ9 సంస్థ నిజాయితీ, నిబద్ధతతో కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రజల ఆదరణ పొందుతోందని జీయర్ స్వామి ప్రశంసించారు. టీవీ9 చైర్మన్ జూపల్లి రామేశ్వరరావుతో పాటు సంస్థ సిబ్బందికి శుభాకాంక్షలు తెలిపారు.

12వ తేదీ వరకు ఉత్సవాలు

నవంబర్ నెల 12వ తేదీ వరకు సమతామూర్తి స్ఫూర్తి కేంద్రంలో యతీంద్ర సప్తతి ఉత్సవాలు జరుగుతాయి. 9న శ్రీమత్ సుందరకాండ పారాయణం 10న మంగళ తరంగిణి కార్యక్రమం… 11న సమతా పురస్కారాల ప్రదానం జరగనున్నాయి. నేటి సాయంత్రం ఐదున్నర గంటలకు ఆచార్య వైభవం కార్యక్రమం నిర్వహిస్తారు. ఈనెల 11వ తేదీన దేశ సేవలో విశేష త్యాగాలు చేసిన 70 మందికి సమతా పురస్కారాలు.. సమాజ సేవకు అంకితమైన 70 మంది మాతృమూర్తులకు సన్మానం కార్యక్రమాలు జరుగుతాయి. ఇక చివరి రోజు అంటే, ఈనెల 12న శ్రీరామచంద్రుడికి సహస్ర కలశాభిషేకం నిర్వహించనున్నారు.

వీడియో చూడండి..

Follow Us