Yadadri: అంగరంగవైభవంగా యాదాద్రి లక్ష్మీనర్సింహస్వామి బ్రహ్మోత్సవాలు.. నేడు అలంకార, వాహన సేవలు..

|

Feb 23, 2023 | 5:45 AM

Yadadri Lakshmi Narasimha Swamy Brahmotsavalu: ప్రముఖ పుణ్యక్షేత్రం యాదాద్రి లక్ష్మీనర్సింహస్వామి బ్రహ్మోత్సవాలు కన్నుల పండుగగా సాగుతున్నాయి. లక్షలాది భక్తులు స్వామివారిని దర్శించుకుని తరిస్తున్నారు. బ్రహ్మోత్సవాల్లో ఇవాళ ఏం జరగనుందో ఇప్పుడు చూద్దాం.

Yadadri: అంగరంగవైభవంగా యాదాద్రి లక్ష్మీనర్సింహస్వామి బ్రహ్మోత్సవాలు.. నేడు అలంకార, వాహన సేవలు..
Yadadri Brahmotsavalu
Follow us on

Yadadri Brahmotsavalu: యాదగిరిగుట్ట లక్ష్మీనర్సింహస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగవైభవంగా జరుగుతున్నాయి. విద్యుత్‌ దీపాల వెలుగుల్లో దేదీప్యమానంగా వెలిగిపోతోంది యాదాద్రి పుణ్యక్షేత్రం. వేదమంత్రాలు, మంగళవాయిద్యాల నడుమ రెండోరోజు ధ్వజారోహణ పూజలు జరిగాయి. నయన మనోహరంగా రాగతాళ ధ్వనులతో కార్యక్రమాలు సాగాయి. స్వామివారి ఆస్థానం నుంచి ధ్వజ పటాన్ని ఊరేగిస్తూ ధ్వజారోహణం నిర్వహించారు.

దేవతామూర్తులను ఆహ్వానిస్తూ ధ్వజపటంపై ప్రత్యేక పూజలు నిర్వహించి గరుడ ముద్దలు ఎగురవేశారు. ఆ గరుడ ముద్దలను అందుకోవడానికి పోటీపడ్డారు భక్తులు. అనంతరం రాత్రికి భేరిపూజ, దేవతాహ్వానం నిర్వహించారు. స్వామివారి కల్యాణం వీక్షించాలంటూ 33 కోట్ల దేవతలకు ఆహ్వానం పలికారు.

పదకొండు రోజులపాటు సాగే బ్రహ్మోత్సవాలు మూడోరోజు అంటే ఇవాళ స్వామివారికి అలంకార, వాహన సేవలు నిర్వహిస్తారు. ఆ తర్వాత మత్సాయవతార సేవ, వేద పారాయణం జరుగుతాయి. రాత్రికి శేష వాహనంపై విహరిస్తారు లక్ష్మీనర్సింహస్వామి. మార్చి మూడో తేదీన జరిగే అష్టోత్తర శతఘటాభిషేకం, శృంగార డోలోత్సవంతో బ్రహ్మాత్సవాలతో పరిసమాప్తమవుతాయి.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..