Hyderabad: తలకు కవర్ చుట్టుకుని – చిన్న రంధ్రం ద్వారా హీలియం గ్యాస్ పీల్చి – CA సురేష్ రెడ్డి విషాధ కథ

పని ఒత్తిడి భరించలేకపోయాడు. చనిపోదామనుకున్నాడు. ఆ చావు కూడా నొప్పి లేకుండా ఉండాలనుకున్నాడు..! సూసైడ్‌ టెండెన్సీ బుర్రలోకి ఎప్పుడైతే వచ్చిందో ఆ ఆలోచనల్ని అదుపుచేసుకోలేకపోయాడు. చివరికి హీలియం గ్యాస్ పీల్చి ప్రాణాలు వదిలాడు.. ఇది ఓ 28 ఏళ్ల చార్టర్డ్‌ అకౌంటెంట్‌ విషాద కథ..!

Hyderabad: తలకు కవర్ చుట్టుకుని - చిన్న రంధ్రం ద్వారా హీలియం గ్యాస్ పీల్చి - CA సురేష్ రెడ్డి విషాధ కథ
CA Suresh Reddy

Updated on: Jun 19, 2025 | 6:06 PM

పని ఒత్తిడి తట్టుకోలేక చార్టర్డ్ అకౌంటెంట్ ఆత్మహత్య చేసుకున్నాడు. హీలియం గ్యాస్ పీల్చుకొని సూసైడ్ చేసుకున్న ఘటన గచ్చిబౌలి పోలిస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. మణికొండలోని ఓ ప్రైవేట్ కంపెనీలో చార్టర్డ్‌ అకౌంటెంట్‌గా పని చేస్తున్న సురేష్ రెడ్డి.. కొండాపూర్ రాజేశ్వరి కాలనీలో సర్వీస్ అపార్టుమెంట్‌లో ఆత్మహత్య చేసుకున్నాడు. జూన్ 16న తన చెల్లెలి ఇంటికి పోతున్నట్లు ఇంట్లో చెప్పి వెళ్లిన సురేష్ రెడ్డి.. రాజేశ్వరి కాలనీలోని తన రూమ్‌లో ఆత్మహత్య చేసుకున్నాడు. ఊపిరాడకుండా తలకు కవర్ కట్టుకుని.. చిన్న రంధ్రం పెట్టుకుని అందులో నుంచి హీలియం గ్యాస్ పీల్చి బలవన్మరణానికి పాల్పడ్డాడు సురేష్ రెడ్డి. రూంలో హీలియం గ్యాస్ సిలిండర్, సూసైడ్‌ నోట్‌ను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. పనిఒత్తిడి తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుంటున్నట్లు సూసైడ్ నోట్‌లో సురేష్ రెడ్డి రాసినట్లు పోలీసులు తెలిపారు. సురేష్‌ రెడ్డిది నిజామాబాద్‌ జిల్లా పాల్వంచ మండలం వాడి గ్రామం.

కాగా నొప్పి లేకుండా చనిపోయేందుకు అతను హీలియం గ్యాస్ వినియోగించాడు సురేష్ రెడ్డి. ఈ గ్యాస్‌ను బెలూన్లలో నింపేందుకు వినియోగిస్తారు. దీనికి ఎలాంటి వాసన ఉండదు. మామూలుగా అయితే హీలియం గ్యాస్‌ ప్రమాదకరం కాదు.  కానీ ఆక్సిజన్ ప్లేస్‌ను హీలియంతో రీప్లేస్‌ చేస్తే ప్రాణాంతకంగా మారుతుంది. బ్రెయిన్‌ మొద్దుబారి స్పృహ కోల్పోతారు. ఫిట్స్ వస్తాయి. ఆపై మరణం సంభవిస్తుంది.

హీలియం గ్యాస్‌ పీల్చడం వల్ల నొప్పి లేకుండా చనిపోవచ్చని ఆలోచనతో, దాన్ని పీల్చి కొందరు సూసైడ్‌ చేసుకుంటారు. ఇది పీల్చిన తర్వాత తొలుత సృహ కోల్పోవడం వల్ల తర్వాత ఏం జరుగుతుందో తెలియదని హైదరాబాద్‌కు చెందిన డాక్టర్‌ ఉదయశ్రీ చెబుతున్నారు.

బెలూన్‌ నుంచి హీలియం గ్యాస్‌ పీల్చి, మాట్లాడితే గొంతు మారిపోతుంది. తమాషాగా ఉంటుంది. అమెరికాలో మొదలైన ఈ ట్రెండ్‌.. ఇండియాకు కూడా పాకింది. మన దేశంలో కూడా సెలబ్రిటీలు హీలియం గ్యాస్‌ పీల్చి, మాట్లాడుతూ ఫన్‌ క్రియేట్‌ చేస్తున్నారు. అయితే ఇప్పుడు ఈ సరదా కాస్తా…చివరకు ప్రాణాల మీదకు తెచ్చేదాకా పోతోంది. హీలియం గ్యాస్‌ పీల్చి సూసైడ్‌ చేసుకునేదాకా వెళ్తున్నారు.

మీరు ఆత్మహత్య ఆలోచనలతో సతమతం అవుతుంటే లేదా మీకు తెలిసిన వ్యక్తి ఆ తరహా ఆలోచనల్లో ఉంటే దయచేసి మీ సమీప మానసిక ఆరోగ్య నిపుణుడిని సంప్రదించండి. లేదా ఆత్మహత్య నివారణ హెల్ప్‌లైన్ అయిన రోష్నిని 040–66202000 సంప్రదించండి )

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..