Liquor Tenders: మద్యం టెండర్లలో వింతలు.. విడ్డూరాలు.. లక్కీ డ్రాలో పాల్గొన్న మహిళలు, చిన్నారులు..

తెలంగాణ లిక్కర్‌ షాపులకు యమా డిమాండ్‌ ఏర్పడింది. లిక్కర్‌ షాపు ఉంటే చాలు.. కోటీశ్వరుడై పోవాల్సిందే. అందుకేనేమో.. సరిహద్దులో వైన్‌షాపులకు ఎక్కడాలేని డిమాండ్‌..

Liquor Tenders: మద్యం టెండర్లలో వింతలు.. విడ్డూరాలు.. లక్కీ డ్రాలో పాల్గొన్న మహిళలు, చిన్నారులు..
Liquor Tenders
Follow us

|

Updated on: Nov 21, 2021 | 8:09 PM

Liquor Tenders: తెలంగాణ లిక్కర్‌ షాపులకు యమా డిమాండ్‌ ఏర్పడింది. లిక్కర్‌ షాపు ఉంటే చాలు.. కోటీశ్వరుడై పోవాల్సిందే. అందుకేనేమో.. సరిహద్దులో వైన్‌షాపులకు ఎక్కడాలేని డిమాండ్‌ ఉంది. ఒక్కో షాపుకు వందల సంఖ్యలో అప్లికేషన్లు వచ్చాయి. మద్యం షాపులు దక్కించుకునేందుకు వ్యాపారులు పోటీపడ్డారు. అయితే ఈ పోటీలో వారు వీరు అని తేడాలేకుండా పోటీ పడ్డారు. ఇక కామారెడ్డి జిల్లా కేంద్రంలో నిర్వహించిన 48 మద్యం దుకాణాల లక్కీ డ్రా టెండర్‌లలో మహిళలు సైతం పోటీలో కనిపించారు. దరఖాస్తు దారుల తో పాటు ఇద్దరు చిన్నారులు కూడా లక్కీ డ్రా లోపాల్గొనడం జరిగింది. చిన్నారులు దరఖాస్తు ఫారం ను చేతిలో పట్టుకొని లక్కీ డ్రా వేలంలో పాల్గొనడం జరిగింది. చిన్నారులు మద్యం టెండర్లు లక్కీ డ్రా లో పాల్గొనడం చూసి అక్కడికి వచ్చినవారు ఆశ్చర్యానికి గురయ్యారు. ఈ చిన్నారుల చేతిలో టెండర్ పేపర్లు కనిపించడంతో ఇందేంటని ప్రశ్నించుకున్నారు. వారి తల్లిదండ్రులు ఇలా తమకు బదులుగా వీరిని నిలిపినట్లుగా భావిస్తున్నారు. అయితే చిన్నారులను నిలపడంపై కొంత ఆందోళనను వ్యక్తం చేశారు. వైన్ షాప్‌లో మద్యం అమ్మవద్దనే రూల్ ఉంది కాని.. ఇలా మద్యం టెండర్ల వద్దకు రావడంలో తప్పులేదని కొందరు వెనుకేసుకొస్తే.. మరికొందరు మాత్రం ఇది సరికాదని నొసలు చిట్లించారు.

ఇక బాన్స్‌వాడ పరిధిలోని 9 మద్యం దుకాణాలకు లక్కీ డ్రా ద్వారా అభ్యర్థులను ఎంపిక చేయగా.. స్వప్న మోరల్ అనే మహిళ రెండు దుకాణాలను దక్కించుకున్నారు.

ఎల్లారెడ్డి పరిధిలోని 7 మద్యం దుకాణాలకు రెండు మద్యం దుకాణాలను కైర సిద్దమ్మ అనే మహిళ కైవసం చేసుకోగా.. బిచ్కుంద పరిధిలోని 9 మద్యం దుకాణాలకు లక్కీ డ్రా నిర్వహించగా రెండు మద్యం దుకాణాలను గడ్డమీది సావిత్రి అనే మహిళ దక్కించుకున్నారు. నీరజ, సాదుపల్లి భారతి, అనిత, పద్మ అనే మహిళలు ఒక్కో మద్యం దుకాణాలను దక్కించుకున్నారు.

తెలంగాణ-ఏపీని ఆనుకొని ఉన్న సరిహద్దు మండలాల్లో..

తెలంగాణ-ఏపీని ఆనుకొని ఉన్న సరిహద్దు మండలాల్లోని వైన్‌షాపులకు టెండర్లు భారీగా వచ్చాయి. ఉమ్మడి ఖమ్మం, మహబూబ్ నగర్, నల్గొండ జిల్లాల్లో అత్యధిక అప్లికేషన్లు వచ్చాయి. ఏపీలో మద్యం రేట్లు ఎక్కువగా ఉండటం, బ్రాండెడ్‌ మద్యం లభించకపోవడంతో రెండేళ్లుగా ఆ రాష్ట్ర బోర్డర్​ వెంట ఉన్న వైన్ షాపుల పంట పండుతోంది. ఇక్కడి నుంచి సీక్రెట్‌గా లిక్కర్‌ను తీసుకెళ్లి ఏపీలో అమ్మేవాళ్లు ఎక్కవయ్యారు. చుట్టుపక్కల గ్రామాల్లో బెల్టుషాపులకు వెళ్లి తాగేవాళ్ల సంఖ్య భారీగా పెరిగింది.దీంతో బోర్డర్‌ షాపుల్లో ఎక్సైజ్ ఆఫీసర్ల టార్గెట్‌కు మించి బిజినెస్​జరుగుతోంది.

ఇవి కూడా చదవండి: CM KCR -Samyukta Kisan Morcha: సీఎం కేసీఆర్ నిర్ణయంపై పెద్ద ఎత్తున ప్రశంసలు.. ఉదారతను అభినందించిన రైతు సంఘాలు..

SBI Alerts: ఇలాంటి కాల్స్ మీకు వస్తున్నాయా.. అయితే జాగ్రత్త.. హెచ్చరించిన బ్యాంక్..

Beware: ఫ్రీజ్‌లో ఆ 8 ఆహార పదార్థాలను ఎప్పుడూ ఉంచవద్దు.. ఎందుకో తెలిస్తే షాకే..