Telangana: హైదరాబాద్‌లో దారుణం.. దొంగతనానికి వచ్చి ఆ తర్వాత

హైదరాబాద్ హయత్‌నగర్‌ పోలీస్ స్టోషన్ పరిధిలో దారుణం చోటుచేసుకుంది. అర్థరాత్రిపూట దోపిడి దొంగలు ఓ మహిళ ఇంట్లో చొరబడి హత్య చేయడం కలకలం రేపుతోంది. వివరాల్లోకి తొర్రూరు గ్రామంలో సత్తమ్మ అనే మహిళ ఇంట్లోకి ఆదివారం రాత్రి దుండగులు ప్రవేశించారు.

Telangana: హైదరాబాద్‌లో దారుణం.. దొంగతనానికి వచ్చి ఆ తర్వాత
Death

Updated on: Jun 05, 2023 | 12:47 PM

హైదరాబాద్ హయత్‌నగర్‌ పోలీస్ స్టోషన్ పరిధిలో దారుణం చోటుచేసుకుంది. అర్థరాత్రిపూట దోపిడి దొంగలు ఓ మహిళ ఇంట్లో చొరబడి హత్య చేయడం కలకలం రేపుతోంది. వివరాల్లోకి తొర్రూరు గ్రామంలో సత్తమ్మ అనే మహిళ ఇంట్లోకి ఆదివారం రాత్రి దుండగులు ప్రవేశించారు. ఆమెను విచక్షణా రహితంగా కొట్టి హత్య చేశారు. అనంతరం ఆమె వద్ద ఉన్న 20 తులాల బంగారు ఆభరణాలు, రూ.5 లక్షల నగదును ఎత్తుకెళ్లారు. ఆదివారం మధ్యాహ్నం వనస్థలిపురం ప్రశాంత్ నగర్ నుంచి తన కొడుకు ఆమె ఇంటికి వచ్చాడని.. రాత్రి 11 గంటల వరకు కూడా తన కొడుకుతో మాట్లాడినట్లు సమాచారం.

అయితే సోమవారం ఉదయం ఇంటి తలుపులు తీసి ఉన్నప్పటికీ సత్తమ్మ కనిపించకపోవడంతో స్థానికులు ఆమె ఇంట్లోకి వెళ్లారు. సత్తమ్మ తలకి గాయమై రక్తపు మడుగులో ఉండటాన్ని చూసి ఒక్కసారిగా షాకయ్యారు. ఆమె అప్పటికే మృతి చెందిందని గుర్తించి పోలీసులకు సమాచారమిచ్చారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని విచారణ చేపట్టారు. దోపిడి చేసి ఈ దారుణానికి ఒక్కరే పాల్పడ్డారా లేదా ముఠా ఏదైన ఉందా అనే కోణంలో దర్యా్ప్తు చేస్తున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..

ఇవి కూడా చదవండి