Hyderabad: డబ్బుల విషయమై తలెత్తిన వివాదంలో భర్తను ఇంట్లో బంధించి భార్య అనుమానస్పద స్థితిలో అదృశ్యం అయిన ఘటన చాంద్రాయణగుట్ట పోలీస్ స్టేషన్‌పరిధిలో చోటుచేసుకుంది. బుధవారం నాడు వెలుగు చూసిన ఈ ఘటనకు సంబంధించి చాంద్రాయణగుట్ట ఎఎస్‌ఐ కె.సుధాకర్‌బాబు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. చాంద్రాయణగుట్ట దస్తగిరినగర్కు చెందిన మహ్మద్ ఆదిల్.. వృత్తి రిత్యా టైలర్. మహ్మద్ఆదిల్ తన మొదటి భార్యతో విడిపోయాక మూడేళ్ల క్రితం ముంబైకి చెందిన నజ్మీన్అన్సారీ(34)ని వివాహం చేసుకున్నాడు. అయితే నజ్మీన్అన్సారీ మానసిక స్థితి బాగలేదు. ఇద్దరి మధ్య తరచుగా డబ్బుల విషయంలో వివాదం తలెత్తేది.
ఈ గొడవ జరిగిన ప్రతీసారి ఆమె తన భర్తకు చెప్పకుండా ఇంట్లో నుంచి వెళ్లిపోయేది. కాసేపటికే తిరిగి వచ్చేది. ఈ నేపథ్యంలోనే ఈ నెల 22వ తేదీన రాత్రి మరో సారి భార్యభర్తల మధ్య గొడవ జరిగింది. 23వ తేదీన ఉదయం వేళలో తన భర్త మహ్మద్ఆదిల్ ఇంట్లో ఉండగా.. బయటి నుంచి తాళాలు వేసి వెళ్లిపోయింది. తలుపులు పగులగొట్టి బయటకు వచ్చిన ఆదిల్.. తన భార్య అచూకి కోసం చుట్టుపక్కల బంధువుల ఇళ్లలో వెతికాడు. అయినప్పటికీ ప్రయోజనం కనిపించకపోవడంతో 24వ తేదీన చాంద్రాయణగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేశాడు. మహిళ మిస్సింగ్‌పై కేసు నమోదు చేసుకున్న చాంద్రాయణగుట్ట పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
(రిపోర్టర్ నూర్ మహమ్మద్, టీవీ9 తెలుగు, హైదరాబాద్)
Also read:
Aliens: ఏరియా 51 ఏలియన్స్ అడ్డానా? అమెరికా రక్షణ దళం ఆధీనంలో ఉన్న ఆ ప్రాంతంలో ఏం జరుగుతుంది?
Big News Big Debate: ప్రైవేటీకరణ పేరుతో అన్ని రంగాల్లోకి ప్రభుత్వేతర సంస్థలు..!