AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Aliens: ఏరియా 51 ఏలియన్స్‌ అడ్డానా? అమెరికా రక్షణ దళం ఆధీనంలో ఉన్న ఆ ప్రాంతంలో ఏం జరుగుతుంది?

Aliens: ఏరియా 51.. ఏలియన్స్‌ గురించి ఎక్కడ, ఎప్పుడు టాపిక్‌ వచ్చినా.. ఈ ఏరియా 51 పేరు వినిపిస్తుంటుంది. కొన్ని దశాబ్దాలుగా అమెరికా రక్షణ దళం ఆధీనంలో..

Aliens: ఏరియా 51 ఏలియన్స్‌ అడ్డానా? అమెరికా రక్షణ దళం ఆధీనంలో ఉన్న ఆ ప్రాంతంలో ఏం జరుగుతుంది?
Area 51
Shiva Prajapati
|

Updated on: Aug 25, 2021 | 10:06 PM

Share

Aliens: ఏరియా 51.. ఏలియన్స్‌ గురించి ఎక్కడ, ఎప్పుడు టాపిక్‌ వచ్చినా.. ఈ ఏరియా 51 పేరు వినిపిస్తుంటుంది. కొన్ని దశాబ్దాలుగా అమెరికా రక్షణ దళం ఆధీనంలో ఉన్న ఈ ప్రాంతంలో ఏం జరుగుతుందో తెలుసుకునేందుకు ఇప్పటివరకు ఎంతోమంది ఎన్నో ప్రయత్నాలు చేశారు. కానీ ఇప్పుటి వరకు ఆ ప్రాంతంలో ఏం జరుగుతుందో తెలుసుకోలేకపోయారు. అంతేందుకు మొన్నటి మొన్న.. ట్విట్టర్‌ వేదికగా చలో ఏరియా 51 హ్యాష్‌ట్యాగ్‌లతో నానా రచ్చ చేశారు. అయినా ఫలితం శూన్యం.

చలో ఏరియా 51 పేరుతో రన్‌ చేసిన హ్యాష్‌ట్యాగ్‌ క్యాంపైయిన్‌పై.. అమెరికా వైమానిక దళం సీరియస్‌ అయింది. ఆ ప్రాంతంలో అడుగు పెడితే కాలు విరగ్గొడుతాం.. అంటూ చెప్పకనే చెప్పుకొచ్చింది. దీంతో ఒక్కసారిగా ఆ ట్రయల్‌ కాస్తా మధ్యలోనే ఆగిపోయింది. అయితే.. ఈ ఏరియా 51లో ఓ ఏలియన్‌పై పరిశోధనలు చేస్తున్నారని, అందుకే ఆ ప్రాంతం.. నిషేధిత ప్రాంతంగా అమెరికా భావిస్తుందన్న టాక్‌ ఉంది.

నిజంగానే ఆ ఏరియా 51లో ఏలియన్స్‌ ఉన్నాయా..? అమెరికాలోని నెవడా రాష్ట్రంలో లాస్ వెగాస్‌‌కు సుమారు 120 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఏడారిలో ఉన్న మిలటరీ బేస్‌నే ఏరియా 51 అని అంటారు. నెవడా టెస్ట్ అండ్ ట్రైనింగ్ రేంజ్ పేరుతో చెలామణి అవుతున్న ఈ ప్రాంతంలోకి సాధారణ ప్రజలకు అనుమతి లేదు. ఆ ప్రాంతం నిత్యం సైన్యం నిఘాలో ఉంటుంది. ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ అనుమతి లేకుండా అక్కడ ఎలాంటి హెలికాప్టర్లు, విమానాలు, డ్రోన్లు ఎగరలేవు. ఒకవేళ అక్కడ పొరపాటున అడుగుపెడితే సైన్యం కఠిన చర్యలు తీసుకుంటుంది.

1950లో నెవడా మిలటరీ బేస్‌లో గుర్తుతెలియని యూఎఫ్‌వో గాల్లో ఎగురుతూ కనిపించాయి. అప్పటి నుంచి అమెరికా ప్రజలు ఆ ప్రాంతంలో ఎలియన్స్‌ దిగి ఉంటారని భావిస్తున్నారు. అమెరికా సైన్యం 1955లో ఆ ప్రాంతం మీదుగా రహస్య నిఘా విమానాలను ప్రయోగించేది. వాటిని చూసి ప్రజలు అక్కడ నిజంగానే గ్రహాంతరవాసులు సంచరిస్తున్నాయని అనుమానించేవారు. అప్పటి నుంచి ఆ ప్రాంతంలో ఎలియన్స్ ఉన్నాయని నమ్ముతున్నారు.

వైమానిక దళం ప్రత్యేకంగా బేస్ ఏర్పాటు చేసి ప్రయోగాలు చేపట్టడంతో అక్కడ ఎలియన్స్‌పై పరిశోధనలు జరుగుతున్నాయనే వదంతులు వ్యాపించాయి. వీటిని ఆధారంగా చేసుకుని అనేక సినిమాలు, కథలు పుట్టుకొచ్చాయి. అంతేకాదు.. ఈ ప్రాంతం పై నుంచి ఎలాంటి విమానాలు కానీ, డ్రోన్‌ కెమెరాలు కానీ ఎగరడం నిషేధం. ఇప్పటికే ఆ ప్రాంతంలో ఏలియన్స్‌ ఉన్నాయని, అమెరికా శాస్త్రవేత్తలు ఏలియన్స్‌పై పరిశోధనలు జరుపుతున్నారనే వార్తలు వైరల్‌ అవుతున్నాయి. ఓ ఏలియన్‌ను బంధించిన అమెరికా.. ఆ ప్రాంతంలో ఉంచిదని, వాటిపైనే ఓ పరిశోధనలు జరుపుతుందన్న టాక్‌ కూడా ఉంది. అందుకే.. ఆ ప్రాంతంలో అమెరికా వైమానిక దళం ప్రత్యేక నజర్‌ ఉంచిన్నట్లు తెలుస్తోంది.

Also read:

Big News Big Debate: ప్రైవేటీకరణ పేరుతో అన్ని రంగాల్లోకి ప్రభుత్వేతర సంస్థలు..!

Virat Kohli Wins Toss: విరాట్ కోహ్లీ టాస్ కొరత తీరింది.. కానీ, మ్యాచ్ ఫలితంపై వెంటాడుతున్న భయం

Viral Video: ట్రాఫిక్ పోలీస్‌కి లంచం.. నడిరోడ్డుపై ముద్దుపెట్టిన యువతి.. ఆ తరువాత ఏం జరిగిందంటే..