జనగామలో దారుణం..ఓ మహిళపై గ్యాంగ్ రేప్.. ఆపై..
జనగామలో దారుణం చోటుచేసుకుంది. చిత్తుకాగితాలు ఏరుకుని జీవనం సాగిస్తున్న మహిళపై కొంతమంది దుండగులు అత్యాచారానికి పాల్పడి.. ఆపై హత్యచేశారు. ఆ తర్వాత మృతదేహాన్ని జనగామ మండలం శామీర్ పేట గ్రామంలోని జాతీయ రహదారి సమీపంలో పడేశారు. మృతదేహాన్ని చూసిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించడంతో విషయం వెలుగులోకి వచ్చింది. మహిళ శరీరంపై గాయాలు ఉండడంతో అత్యాచారం జరిగి ఉంటుందని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. మృతురాలికి 14 ఏళ్ల క్రితం వివాహమైందని, ఆమెకు ఓ కుమార్తె కూడా ఉందని […]
జనగామలో దారుణం చోటుచేసుకుంది. చిత్తుకాగితాలు ఏరుకుని జీవనం సాగిస్తున్న మహిళపై కొంతమంది దుండగులు అత్యాచారానికి పాల్పడి.. ఆపై హత్యచేశారు. ఆ తర్వాత మృతదేహాన్ని జనగామ మండలం శామీర్ పేట గ్రామంలోని జాతీయ రహదారి సమీపంలో పడేశారు. మృతదేహాన్ని చూసిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించడంతో విషయం వెలుగులోకి వచ్చింది. మహిళ శరీరంపై గాయాలు ఉండడంతో అత్యాచారం జరిగి ఉంటుందని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు.
మృతురాలికి 14 ఏళ్ల క్రితం వివాహమైందని, ఆమెకు ఓ కుమార్తె కూడా ఉందని బంధువులు తెలిపారు. ప్రస్తుతం ఆమె భర్త మరో మహిళతో హైదరాబాద్‌లో ఉంటున్నట్టు పేర్కొన్నారు. సోమవారం అర్ధరాత్రి తన తల్లిదండ్రులు ఉండే నెల్లుట్ల నుంచి జనగామ బయలుదేరిన ఆమె… తెల్లవారుజామున శవమై తేలింది. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.