గర్భిణీ కష్టాలు… బైకులు దుప్పట్లు అడ్డుపెట్టి రోడ్డుపైనే ప్రసవం..!

| Edited By:

Sep 08, 2019 | 4:01 PM

ఓ తల్లికి పుట్టెడు కష్టం వచ్చింది.. ఈ బాధ పగోళ్లకు కూడా రాకూడాదంటూ.. కంటతడి పెట్టిన ఓ హృదయ విదారక ఘటన ములుగు జిల్లాలో చోటుచేసుకుంది. గోదావరి ఉగ్రరూపం దాల్చడంతో.. చాలా గ్రామాలు.. జలదిగ్భందంలో చిక్కుకున్నాయి. దీంతో.. రాకపోకలు నిలిచిపోయాయి. ఇదే సమయంలో వెంకటాపురం మండలం.. వెంగవాగు గ్రామానికి చెందిన కురసం కాంతమ్మకు పురిటి నొప్పులు వచ్చాయి. దీంతో గ్రామస్తులు ఆమెను ఆస్పత్రికి తరలించేందుకు ప్రయత్నించారు. అయితే.. వరద నీరు పోటెత్తడంతో.. వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. ట్రాక్టర్‌లో […]

గర్భిణీ కష్టాలు... బైకులు దుప్పట్లు అడ్డుపెట్టి రోడ్డుపైనే ప్రసవం..!
Follow us on

ఓ తల్లికి పుట్టెడు కష్టం వచ్చింది.. ఈ బాధ పగోళ్లకు కూడా రాకూడాదంటూ.. కంటతడి పెట్టిన ఓ హృదయ విదారక ఘటన ములుగు జిల్లాలో చోటుచేసుకుంది. గోదావరి ఉగ్రరూపం దాల్చడంతో.. చాలా గ్రామాలు.. జలదిగ్భందంలో చిక్కుకున్నాయి. దీంతో.. రాకపోకలు నిలిచిపోయాయి. ఇదే సమయంలో వెంకటాపురం మండలం.. వెంగవాగు గ్రామానికి చెందిన కురసం కాంతమ్మకు పురిటి నొప్పులు వచ్చాయి. దీంతో గ్రామస్తులు ఆమెను ఆస్పత్రికి తరలించేందుకు ప్రయత్నించారు. అయితే.. వరద నీరు పోటెత్తడంతో.. వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. ట్రాక్టర్‌లో కాంతమ్మను వాగు దాటించేందుకు బంధువులు భయపడ్డారు. వాగు దాటలేని పరిస్థితి ఉండటంతో.. ఏం చేయాలో తెలియక.. కాంతమ్మ కుటుంబ సభ్యులు అయోమయం అయిపోయారు. దీంతో.. చేసేదేమీ లేక వాగు దగ్గరే ప్రసవానికి ఏర్పాట్లు చేశారు. బైక్లు, దుప్పట్లు అడ్డుపెట్టి.. ప్రసవం చేశారు. కాగా.. కాంతమ్మ ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ఇద్దరూ క్షేమంగా ఉన్నారు.