AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

తెలంగాణ కేబినెట్‌లో కరీంనగర్‌ హవా!

తెలంగాణ కేబినెట్‌ను పూర్తిస్థాయిలో విస్తరించిన సీఎం కేసీఆర్… కొత్తగా మరో ఆరుగురిని కేబినెట్‌లోకి తీసుకున్నారు. కేటీఆర్, హరీశ్ రావు, సత్యవతి రాథోడ్, సబితా ఇంద్రారెడ్డి, పువ్వాడ అజయ్, గంగుల కమలాకర్‌ను మంత్రివర్గంలోకి తీసుకున్న కేసీఆర్… వారికి శాఖలు కూడా కేటాయించారు. అయితే కేబినెట్ విస్తరణతో ఉమ్మడి కరీంనగర్ జిల్లా కొత్త రికార్డ్‌ను సృష్టించింది. ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుంచి ఇప్పటివరకు కొప్పుల ఈశ్వర్, ఈటల రాజేందర్ మంత్రులుగా ఉన్నారు. అయితే ఇటీవల ఈటల రాజేందర్ చేసిన వ్యాఖ్యల […]

తెలంగాణ కేబినెట్‌లో కరీంనగర్‌ హవా!
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Sep 08, 2019 | 8:55 PM

Share

తెలంగాణ కేబినెట్‌ను పూర్తిస్థాయిలో విస్తరించిన సీఎం కేసీఆర్… కొత్తగా మరో ఆరుగురిని కేబినెట్‌లోకి తీసుకున్నారు. కేటీఆర్, హరీశ్ రావు, సత్యవతి రాథోడ్, సబితా ఇంద్రారెడ్డి, పువ్వాడ అజయ్, గంగుల కమలాకర్‌ను మంత్రివర్గంలోకి తీసుకున్న కేసీఆర్… వారికి శాఖలు కూడా కేటాయించారు. అయితే కేబినెట్ విస్తరణతో ఉమ్మడి కరీంనగర్ జిల్లా కొత్త రికార్డ్‌ను సృష్టించింది. ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుంచి ఇప్పటివరకు కొప్పుల ఈశ్వర్, ఈటల రాజేందర్ మంత్రులుగా ఉన్నారు. అయితే ఇటీవల ఈటల రాజేందర్ చేసిన వ్యాఖ్యల కారణంగా ఆయనను కేబినెట్ నుంచి తప్పిస్తారనే ప్రచారం జరిగింది.

ఉమ్మడి కరీంనగర్ జిల్లాకే చెందిన కేటీఆర్‌ను కేబినెట్‌లోకి తీసుకోవడానికి ఈటల, కొప్పుల ఈశ్వర్‌లలో ఎవరో ఒకరిని తప్పించే అవకాశం ఉందని వార్తలు వచ్చాయి. అయితే కేసీఆర్ మాత్రం మంత్రివర్గ విస్తరణ సందర్భంగా ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు మంత్రి ప్రాధాన్యత ఇచ్చారు. జిల్లాకు చెందిన కేటీఆర్‌తో గంగుల కమలాకర్‌ను కేబినెట్‌లోకి తీసుకున్నారు. దీంతో ప్రస్తుతం తెలంగాణ కేబినెట్‌లో ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుంచే ఎక్కువమంది ఉన్నట్టయ్యింది. గత లోక్ సభ ఎన్నికల సందర్భంగా కరీంనగర్ పరిధిలో టీఆర్ఎస్‌కు ఎదురుగాలి వీయడం కూడా సీఎం కేసీఆర్ ఈ రకమైన నిర్ణయం తీసుకోవడానికి కారణమైందనే ప్రచారం జరుగుతోంది.

Follow Us
పెళ్లిళ్ల సీజన్ వేళ బిగ్ షాక్.. మళ్లీ పెరిగిన బంగారం ధరలు
పెళ్లిళ్ల సీజన్ వేళ బిగ్ షాక్.. మళ్లీ పెరిగిన బంగారం ధరలు
ఉదయాన్నే ఖాళీ కడుపుతో గుమ్మడి జ్యూస్‌ తాగితే ఎన్ని ప్రయోజనాలో..
ఉదయాన్నే ఖాళీ కడుపుతో గుమ్మడి జ్యూస్‌ తాగితే ఎన్ని ప్రయోజనాలో..
Video: తెలుగబ్బాయ్‌కి దిమ్మతిరిగే షాకిచ్చిన 41 ఏళ్ల ప్లేయర్
Video: తెలుగబ్బాయ్‌కి దిమ్మతిరిగే షాకిచ్చిన 41 ఏళ్ల ప్లేయర్
గుండె జబ్బులకు సంకేతాలా..? పిల్లలలో ఈ లక్షణాలను విస్మరించవద్దు..
గుండె జబ్బులకు సంకేతాలా..? పిల్లలలో ఈ లక్షణాలను విస్మరించవద్దు..
చికెన్ కుర్మా ఇలా చేస్తే.. పక్కింటోళ్ళు కూడా మీ ఇంట్లో వాలిపోతారు
చికెన్ కుర్మా ఇలా చేస్తే.. పక్కింటోళ్ళు కూడా మీ ఇంట్లో వాలిపోతారు
కుర్రాళ్ల కలల రాణి.. ఇప్పుడు ఇండస్ట్రీకి దూరంగా..
కుర్రాళ్ల కలల రాణి.. ఇప్పుడు ఇండస్ట్రీకి దూరంగా..
విద్యార్థులకు అలర్ట్.. సిలబస్‌లో భారీ మార్పులు.. కేంద్రమంత్రి..
విద్యార్థులకు అలర్ట్.. సిలబస్‌లో భారీ మార్పులు.. కేంద్రమంత్రి..
రత్నగిరి రాళ్లలో 12,000ఏళ్ల రహస్యం!చరిత్రనే మార్చే సంచలన తవ్వకాలు
రత్నగిరి రాళ్లలో 12,000ఏళ్ల రహస్యం!చరిత్రనే మార్చే సంచలన తవ్వకాలు
మేం చనిపోయాక మా డెడ్ బాడీస్‌ వారికే సొంతం: బిగ్ బాస్ సోనియా
మేం చనిపోయాక మా డెడ్ బాడీస్‌ వారికే సొంతం: బిగ్ బాస్ సోనియా
ఇండియా AI ఇంపాక్ట్‌ సమ్మిట్‌‌.. ప్రధాని మోదీ కీలక ప్రసంగం..
ఇండియా AI ఇంపాక్ట్‌ సమ్మిట్‌‌.. ప్రధాని మోదీ కీలక ప్రసంగం..