Khammam: పెళ్లిలో ఉత్సాహంగా డ్యాన్స్ చేస్తూ కుప్పకూలిన మహిళ.. క్షణకాలంలో విగతజీవిగా

|

Mar 18, 2023 | 10:13 AM

అసలు ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు. అప్పటిదాకా ఎంతో యాక్టివ్‌గా.. చాలా హెల్తీగా కనిపిస్తున్నారు. అంతలోనే ఉన్నఫలంగా కుప్పుకూలిపోతున్నారు.

Khammam: పెళ్లిలో ఉత్సాహంగా డ్యాన్స్ చేస్తూ కుప్పకూలిన మహిళ.. క్షణకాలంలో విగతజీవిగా
Women Died
Follow us on

ఈ మధ్యకాలంలో హార్ట్ అటాక్స్ గురించి తరుచుగా వింటున్నాం. అప్పుటిదాకా బానే ఉన్నవారు ఒక్కసారిగా గుండెపోటుకు గురై ప్రాణాలు వదులుతున్నారు. నడుస్తూ నడుస్తూనే పడిపోతున్నారు. టీనేజర్స్ సైతం ఎక్కువ హార్ట్ అటాక్స్, స్ట్రోక్స్‌కు గురవ్వడం కలవరం రేపింది. ఎందుకు ఈ రకంగా గుండెపోట్లు పెరిగాయి.. లైఫ్ స్టైల్ కారణమా, లేదా పోస్ట్ కోవిడ్ ఎఫెక్టా లేక వ్యాక్సిన్ ప్రభావమా అన్నది తేలాలి అంటే అధ్యయనాలు జరగాల్సిందే. కాగా తాజాగా మరోసారి అలాంటి ఘటన ఖమ్మం జిల్లాలో వెలుగుచూసింది.

డీజే సౌండ్‌ కారణంగా ఓ మహిళ ప్రాణాలు విడిచింది. ఖమ్మం జిల్లా అల్లీపురంలో బంధువుల పెళ్లి ఊరేగింపులో డాన్స్ వేస్తూ ఒక్కసారిగా కుప్పకూలిపోయింది రాణి అనే మహిళ. పెళ్ళి ఊరేగింపులో డీజే శబ్దాల దాటికి బ్రెయిన్ స్ట్రోక్ వచ్చి రాణీ చనిపోయినట్లు వైద్యులు నిర్ధారించారు. మృతురాలి స్వస్థలం రఘునాథపాలెం మండలం వి.వెంకటాయపాలెంగా తెలిసింది.

నేడు ఏ వేడుక చేసుకున్నా డీజే పెట్టడం పరిపాటిగా మారింది.పెళ్లి బారాత్‌లో మాత్రం డీజే తప్పనిసరి అనేలా మార్పు వచ్చింది. చాలా మంది జోష్ ఉన్న మ్యూజిక్‌ హై వాల్యూమ్‌లో పెట్టుకుని డీజే బాక్సుల ముందు సంబురాల్లో మునిగిపోతారు.ఎంత మంచి మ్యూజిక్ అయినా.. అవధులు దాటి వాల్యూమ్‌ పెంచితే మాత్రం ప్రాణాలకు చేటే.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..