Telangana: పగతో రగిలిపోతున్న గ్రామం.. జైలు నుంచి బయటకు రాగానే మరణం తప్పదంటూ పోస్టర్ల కలకలం..

|

Feb 09, 2023 | 8:00 AM

తెలంగాణలోని వికారాబాద్ జిల్లాలో పగాప్రతీకారాలు పెట్రేగిపోతున్నాయి. దారూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని నాగ సముందర్‌గేట్ లో పోస్టర్లు కలకలం రేపాయి.

Telangana: పగతో రగిలిపోతున్న గ్రామం.. జైలు నుంచి బయటకు రాగానే మరణం తప్పదంటూ పోస్టర్ల కలకలం..
Murder Poster
Follow us on

తెలంగాణలోని వికారాబాద్ జిల్లాలో పగాప్రతీకారాలు పెట్రేగిపోతున్నాయి. దారూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని నాగ సముందర్‌గేట్ లో పోస్టర్లు కలకలం రేపాయి. దీంతో ఈ ఘటనపై పోలీసులు అలర్ట్ అయ్యారు. పోస్టర్ కలకలంపై ఎవరు, ఎందుకిలా చేస్తున్నారు.. అనే విషయంపై విచారణ ప్రారంభించారు. గత నెలలో వికారాబాద్ జిల్లాలోని నాగసముందర్ కు చెందిన కర్వ మల్లప్పను ఇంటి స్థలం విషయంలో అదే గ్రామానికి చెందిన శ్రీనివాస్, సంతోష్, వెంకటేష్ అనే ముగ్గురు వ్యక్తులు దారుణంగా నరికి చంపారు. దీంతో ముగ్గురు నిందితులను అరెస్టు చేసిన పోలీసులు కోర్టులో హాజరుపరిచి జైలుకు తరలించారు. ఈ క్రమంలో ముగ్గురు నిందితులు బెయిల్ పై బయటకు వచ్చేందుకు అప్లై చేసుకున్నారు.

ఈనెల 18న నిందితులు ముగ్గురు బెయిల్ పై తిరిగి వస్తున్నారని తెలుసుకున్న మృతుడు మల్లప్ప బంధువులు.. బైయిల్ పై బయటకు వచ్చిన మరుక్షణమే నిందితులను దారుణంగా హత్య చేస్తామంటూ సొంతూరు నాగ సముందర్ గేట్ లోని పలు చోట్ల పోస్టర్లు అంటించారు. ముగ్గురు నిందితుల ఫోటోలపై రెడ్ మార్క్ వేసి శ్రద్ధాంజలి ఘటిస్తూ పోస్టర్లు ఏర్పాటు చేశారు.

దీంతో దారూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో భయాందోళనలు నెలకొన్నాయి. విషయం తెలుసుకున్న పోలీసులు పోస్టర్ల కలకలంపై దృష్టిపెట్టారు. ఈ ఘటనపై విచారణ చేస్తున్నారు దారూర్ పోలీసులు. ఘటనకు బాధ్యులైన వారిపై చర్యలు తీసుకుంటామని చెప్పారు. లా అండ్ ఆర్డర్ ని ఎవరైనా చేతిలోకి తీసుకుంటే శిక్షలు తప్పవంటూ హెచ్చరిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

కాగా.. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. హత్య నాటినుంచి గ్రామంలో భయాందోళన పరిస్థితులు నెలకొన్నాయి.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం..