Hyderabad: 17 మంది మృతికి కారణలేంటీ? TV9 చేతిలో గుల్జార్ హౌస్ అగ్ని ప్రమాదం సీసీటీవీ ఫుటేజ్‌!

హైదరాబాద్ మహానగరంలోని చార్‌మినార్ ప్రాంతం గుల్జార్‌ హౌస్‌ ప్రమాదంలో 17 మంది మృతికి గల కారణలేంటీ? ఎగ్జాట్‌గా ఎన్ని గంటలకు ఫైర్ యాక్సిడెంట్ చోటు చేసుకుంది. TV9 చేతిలో ఉన్న గుల్జార్ హౌస్ అగ్ని ప్రమాదం సీసీటీవీ ఫుటేజ్‌ ఏం చెబుతోంది. దర్యాప్తు కమిటీ నివేదికలో ఏముందో తెలుసుకుందాం.

Hyderabad: 17 మంది మృతికి కారణలేంటీ? TV9 చేతిలో గుల్జార్ హౌస్ అగ్ని ప్రమాదం సీసీటీవీ ఫుటేజ్‌!
Gulzar House Fire In Hyderabad

Updated on: May 23, 2025 | 8:12 AM

హైదరాబాద్ మహానగరంలోని చార్‌మినార్ ప్రాంతం గుల్జార్‌ హౌస్‌ ప్రమాదంలో 17 మంది మృతికి గల కారణలేంటీ? ఎగ్జాట్‌గా ఎన్ని గంటలకు ఫైర్ యాక్సిడెంట్ చోటు చేసుకుంది. TV9 చేతిలో ఉన్న గుల్జార్ హౌస్ అగ్ని ప్రమాదం సీసీటీవీ ఫుటేజ్‌ ఏం చెబుతోంది. దర్యాప్తు కమిటీ నివేదికలో ఏముందో తెలుసుకుందాం.

హైదరాబాద్ పాతబస్తీ గుల్జార్ హౌజ్ అగ్ని ప్రమాద ఘటనకు సంబంధించిన సీసీ ఫుటేజ్ TV9 చేతికి అందింది. ఎన్ని గంటలకు ప్రమాదం జరిగింది. ప్రమాదం జరిగిన ఎన్ని నిమిషాల తర్వాత ఫైర్ ఇంజన్‌ వచ్చి చర్యలు చేపట్టిందో సీసీటీవీ ఫుటేజ్‌లో అంతా స్పష్టంగా రికార్డు అయ్యాయి. మే18వ తేదీన ఉదయం అగ్నిప్రమాదం జరగగా.. వెంటనే గమనించిన నలుగురు కుటుంబ సభ్యులు ఉదయం 6గంటల 3 నిమిషాల 35 సెకన్లకి ఇంట్లో నుంచి బయటికి పరుగులు తీశారు. కాపాడాలంటూ కేకలు వేశారు. చుట్టుపక్కల వారిని అప్రమత్తం చేశారు. అంతవరకూ లోపల అగ్ని ప్రమాదం జరిగినట్టు ఎవరికీ తెలీదు.

షట్టర్‌ క్లోజ్‌ చేసి ఉండడంతో అగ్నిప్రమాదం జరిగిన విషయం ఎవరకూ తెలియలేదు. ఉదయం 6గంటల 5నిమిషాల 43 సెకన్ల నుండి 6 గంటల 12 నిమిషాల వరకూ లోపల నుండి భారీగా పేలిన శబ్దాలు.. దట్టమైన పొగ కమ్ముకుంది. ప్రమాదం జరిగిన విషయం తెలియగానే. 6గంటల 14నిమిషాలకు మొదటి ఫైర్‌ ఇంజన్‌ స్పాట్‌కి చేరుకుంది. బయటకు వచ్చిన నలుగురు తప్పా, మిగతా 17మంది చనిపోయారు. అగ్ని ప్రమాద ఘటనపై కేసు నమోదు చేసిన అధికారులు దర్యాప్తును ముమ్మరం చేశారు.

వీడియో చూడండి.. 

అయితే, గుల్జార్ హౌస్ ఘోర అగ్నిప్రమాద ఘటనకు కారణాలపై దర్యాప్తు బృందాలు ఓ నిర్ధారణకు వచ్చాయి. ఇరుకైన ప్రదేశంలో ఏడు ఏసీల నిరంతర వాడకం వల్లనే ప్రమాదం జరిగినట్లు గుర్తించారు. ఏసీ ఎగ్జాస్ట్ కు సరైన సౌకర్యం లేకపోవడంతో కంప్రెషర్ పేలినట్లు తేల్చారు. ఏసీ కంప్రెషర్ పై హెవీ లోడ్ కారణంగా ప్రమాదం జరిగినట్టు దర్యాఫ్తు బృందాలు నిర్ధారణకు వచ్చాయి. కంప్రెషర్ పక్కనే విద్యుత్ మీటర్లు ఉండటం, చెక్కతో చేసిన మెట్లు కావటం, పార్కింగ్‌లో నిలిపి ఉంచిన వాహనం పెట్రోల్ ట్యాంక్ బ్లాస్ట్.. ఇలా అన్నీ భారీ అగ్నిప్రమాదానికి కారణం అయ్యాయని కమిటీకి తుది నివేదిక ఇచ్చింది ఎఫ్ఎస్ఎల్ క్లూస్ టీమ్. గుల్జార్ హౌస్ ఘోర అగ్నిప్రమాదం అనేక విషయాలను రిపోర్ట్‌లో పొందుపరిచింది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..