Wedding Invitation Scams: ఓరి.. దుర్మార్గుల్లారా! పెళ్లిళ్ల సీజన్‌ను ఇలా వాడేస్తున్నారా..? సైబర్‌ నేరగాళ్ల కొత్త దందా

| Edited By: Srilakshmi C

Nov 13, 2024 | 7:04 PM

సైబర్ నేరగాళ్లు ఎప్పటికప్పుడు తమ పంథా మర్చుకుని కొత్త కొత్త మార్గాల్లో దాడి చేస్తున్నారు. అమాయక ప్రజలకు ఫోన్ కాల్స్ చేసి, మెసేజ్ లు పంపి వారి నుంచి కోట్లాది డబ్బు క్యాష్ చేసుకుంటున్నారు. అయితే ప్రస్తుతం పెళ్లిళ్ల సీజన్ కావడంతో కనీవినని రీతిలో కొత్త స్టైల్ లో దోపిడీకి తెర తీశారు..

Wedding Invitation Scams: ఓరి.. దుర్మార్గుల్లారా! పెళ్లిళ్ల సీజన్‌ను ఇలా వాడేస్తున్నారా..? సైబర్‌ నేరగాళ్ల కొత్త దందా
Wedding Invitation Scam
Follow us on

హైదరాబాద్‌, నవంబర్ 13: పెళ్లిళ్ల సీజన్‌ను సైతం వదలకుండా నేరాలకు ప్లాన్ చేస్తున్నారు సైబర్ నేరగాళ్లు. సాధారణంగా పెళ్లి కార్డును ఇంటికి తెచ్చి ఇవ్వడం లేదా వాట్సాప్ లో పంపించడమో చేస్తుంటాం. అయితే ఈ మధ్య కాలంలో వాట్సాప్ లో కూడా కొందరు పెళ్లి కార్డును పంపిస్తున్నారు. ఇలా పంపించే పెళ్లి కార్డులు సైబర్ నెరగాలని అట్రాక్ట్ చేసింది. పెళ్లి ఇన్విటేషన్ కార్డ్ ద్వారా సైబర్ మోసాలకు పాల్పడేందుకు ప్లాన్ చేశారు. దీంతో ‘వెడ్డింగ్ ఇన్విటేషన్ అంటూ వాట్సాప్ లో వచ్చే ప్రతి లింకును క్లిక్ చేయవద్దు’ అంటూ పోలీసులు హెచ్చరిస్తున్నారు. ఇప్పటికే హిమాచల్ ప్రదేశ్ పోలీసులు ఫేక్ ఇన్విటేషన్‌లపై ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. అసలే పెళ్లిళ్ల సీజన్ కావటంతో దూరపు చుట్టాల నుంచి మొదలుకొని స్నేహితుల వరకు అందరికీ వాట్సాప్ లో వెడ్డింగ్ ఇన్విటేషన్ పంపించడం సాధారణమైపోయింది. ఇప్పుడు సైబర్ నేరగాళ్లు ఈ వెడ్డింగ్ ఇన్విటేషన్ను ఆసరాగా చేసుకొని సైబర్ నేరాలకు పాల్పడుతున్నారు. గుర్తుతెలియని నెంబర్ నుంచి వచ్చే వెడ్డింగ్ ఇన్విటేషన్ లింకులను ఎట్టి పరిస్థితుల్లో క్లిక్ చేయవద్దని పోలీసులు సూచిస్తున్నారు.

వెడ్డింగ్ ఇన్విటేషన్ పేరుతో ఓ APK ఫైల్ ను క్రియేట్ చేసి వాట్సాప్ కు పంపిస్తున్నారు. ఫైల్ ఓపెన్ చేయగానే మనకి తెలియకుండానే ఓ థార్ట్ పార్టీ యాప్‌ ఓపెన్ అయిపోయి.. మన ఫోన్‌ నుంచి మన కాంటాక్ట్ అన్నిటికి మెసేజ్ వెళ్ళిపోతుంది. దీని ద్వారా మన పర్సనల్ డేటా తో పాటు సైబర్ నేరగాళ్లకు చెందిన సాఫ్ట్‌వేర్‌ సైతం మన ఫోన్లో ఇన్‌స్టాల్ అవుతుంది. దీని ద్వారా మన బ్యాంకు ఖాతా వివరాలు, ఇతర అంశాలు క్రిమినల్స్ చేతికి వెళ్లే ప్రమాదం ఉంది. దీన్ని మొదట్లోనే అడ్డుకునే ప్రయత్నంలో భాగంగా పోలీసులు అవగాహన కల్పిస్తున్నారు.

వెడ్డింగ్ ఇన్విటేషన్ పేరుతో గుర్తు తెలియని నంబర్ల నుంచి వచ్చే లింకులను ఎట్టి పరిస్థితుల్లో క్లిక్ చేయవద్దని సూచిస్తున్నారు. కేవలం వెడ్డింగ్ ఇన్విటేషన్ లోనే కాకుండా మన స్నేహితుల నుండి కొన్నిసార్లు వచ్చే లింకులను సైతం క్లిక్ చేయవద్దని పోలీసులు అవగాహన కల్పిస్తున్నారు. ఒకవేళ అనుకోకుండా అలాంటి లింకులను క్లిక్ చేస్తే.. వెంటనే 1930 నెంబర్ కి కాల్ చేయాల్సిందిగా పోలీసులు సూచిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి.