మాడు పగిలే ఎండాకాలంలో తడిచి ముద్దయ్యే వానలు.. దేశమంతటా వర్షాలు.. వడగండ్ల వానలు.. తెలుగు రాష్ట్రాల్లో అయితే అలుపు లేకుండా వరుణుడు విజృంభిస్తూనే ఉన్నాడు. అకాల వర్షాలతో పంట నష్టాలు.. ఉరుములు.. మెరుపులు.. పిడుగులు.. ఆగని కుండపోత.. హైదరాబాద్‌లో అయితే.. మొదలైతే చాలు దంచికొడుతోంది.. తెలంగాణలో వాతావరణ శాఖ ఎల్లో అలెర్ట్ జారీ చేసింది. ఏపీలో కూడా భారీ వర్షాలు కురుస్తున్నాయి. హైదరాబాద్‌లో అయితే ఆదివారం రాత్రి వరుణుడు.. ఈ మహానగరాన్ని నీటితో ముంచెత్తాడు. షేక్ పేటలో రికార్డు స్థాయిలో వర్షం కురిసింది. సుచిత్ర, జీడిమెట్ల, సూరారం, మాదాపూర్, గచ్చిబౌలి, రాయదుర్గం, కూకట్‌పల్లి, బోరబండ, మోతీనగర్, ఎర్రగడ్డ, సనత్‌నగర్, అమీర్‌పేట, యూసఫ్‌గూడ, పంజాగుట్ట హోల్ ట్విన్ సిటీస్ మొత్తం తడిచి ముద్దయ్యింది.
సిటీలోని పలు ప్రాంతాల్లో చాలా సేపు ట్రాఫిక్ స్తంభించింది. సైదాబాద్‌లో ఈదురు గాలుల కారణంగా విద్యుత్ సరఫరా నిలిపివేశారు. షాద్‌నగర్‌లో చెట్లు విరిగి రహదారిపై పడటంతో భారీగా ట్రాఫిక్ స్తంభించింది. వికారాబాద్ జిల్లాలోనూ ఈదురు గాలులు, వర్షానికి చెట్లు నేలకొరిగాయి. అమీర్‌పేట మైత్రివనం దగ్గర.. రోడ్డుపక్కనే పార్కింగ్ చేసిన వాహనాలు వరద నీటిలో మునిగాయి. భారీ వర్షాల నేపథ్యంలో హైదరాబాద్ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జీహెచ్‌ఎంసీ అధికారులు విజ్ఞప్తి చేశారు. పాదచారులు, వాహనదారులు జాగ్రత్తలు తీసుకోవాలని, నాలాల వద్దకు పిల్లలు వెళ్లకుండా చూడాలని సూచించారు. అత్యవసర సాయం కోసం జీహెచ్‌ఎంసీ కంట్రోల్ రూమ్ 040-211 11111కు ఫోన్ చేయాలని జీహెచ్‌ఎంసీ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి సూచించారు.
#1May 1:20AM⚠️
Current Heavy Rains Slowly Moving Away Towards Yadadri Bhongir District.
Still During Midnight -Early Morning one or two Rain Spells possible in #Hyderabad.#Shaikpet Records 105.8mm in the last 2Spells.#HyderabadRains pic.twitter.com/M0ERUwu0JT
— Hyderabad Rains (@Hyderabadrains) April 30, 2023
తెలంగాణలో వాతావరణ శాఖ ఎల్లో అలెర్ట్ జారీ చేశారు. వారం పాటు రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది. ఈ రోజు యాదాద్రి – భోంగీర్ నుంచి జనగాం, సిద్దిపేట నుంచి వరంగల్, హన్మకొండ, భూపాలపల్లి, ములుగు, మహబూబాబాద్, భద్రాద్రి – కొత్తగూడెంలో మళ్లీ మోస్తరు వర్షాలు – వనపర్తి, గద్వాల్, నాగర్‌కర్నూల్, సూర్యపేట, నల్గొండ, నల్గొండలో భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. తెలంగాణలో ఈ వారం మొత్తం చెదురుమదురు వర్షాలు, ఉరుములతో కూడిన వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం..