Weather Forecast: బంగాళాఖాతంలో అల్పపీడన ప్రభావం.. రెండు రోజుల పాటు తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు

|

Jun 16, 2021 | 3:55 PM

Weather Forecast: గత రెండు మూడు రోజులుగా తెలంగాణ, ఆంధ్రప్రదేవ్‌ రాష్ట్ర వ్యాప్తంగా పలు చోట్ల భారీ వర్షాలు కురుస్తున్నాయి. అయితే మరో మూడు రోజుల పాటు రాష్ట్రంలో తేలికపాటి..

Weather Forecast: బంగాళాఖాతంలో అల్పపీడన ప్రభావం.. రెండు రోజుల పాటు తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు
Follow us on

Weather Forecast: గత రెండు మూడు రోజులుగా తెలంగాణ, ఆంధ్రప్రదేవ్‌ రాష్ట్ర వ్యాప్తంగా పలు చోట్ల భారీ వర్షాలు కురుస్తున్నాయి. అయితే మరో మూడు రోజుల పాటు రాష్ట్రంలో తేలికపాటి నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావం తెలుగు రాష్ట్రాల్లో మరో మూడు రోజుల పాటు ఉండనుందని, దీంతో రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది.

కొన్ని ప్రాంతాల్లో భారీగా వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. ఈ రోజు రేపు ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులు (ఈదురు గాలులు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో) కూడిన వర్షం కురిసే అవకాశం ఉందన్నారు. ఈ రోజు రాష్ట్రంలో సాధారణ వర్షపాతం 7 మీ.మీ నుంచి 13 మీ.మీ వర్షపాతం నమోదైనట్లు తెలిపారు. అత్యధికంగా పెద్దపల్లి జిల్లాలో నమోదైంది. ఆదిలాబాద్‌, కుమరంభీం ఆసిఫాబాద్‌, నిర్మల్‌, నిజామాబాద్‌, మంచిర్యాల, జయశంకర్‌ భూపాలపల్లి జిల్లాల్లో భారీగానే వర్షపాతం నమోదైంది.

ఇవీ కూడా చదవండి:

AP Govt jobs: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. వైద్య ఆరోగ్య శాఖలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్

US Bans Dogs: అమెరికా కీలక నిర్ణయం.. ఆయా దేశాల నుంచి తీసుకువచ్చే కుక్కలపై నిషేధం.. ఎందుకంటే..!