Rain Alert: తెలుగు రాష్ట్రాల్లో దంచికొడుతున్న వానలు.. మరో రెండు రోజులపాటు ఇంతే.. ఐఎండీ అలెర్ట్

|

Jul 13, 2021 | 4:28 PM

Weather Forecast in AP - Telanagana: తెలుగు రాష్ట్రాల్లో రుతు పవనాలు చురుగ్గా మారాయి. బంగాళాఖాతంలో అల్పపీడన ప్రభావంతో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్

Rain Alert: తెలుగు రాష్ట్రాల్లో దంచికొడుతున్న వానలు.. మరో రెండు రోజులపాటు ఇంతే.. ఐఎండీ అలెర్ట్
Rain Alert
Follow us on

Weather Forecast in AP – Telanagana: తెలుగు రాష్ట్రాల్లో రుతు పవనాలు చురుగ్గా మారాయి. బంగాళాఖాతంలో అల్పపీడన ప్రభావంతో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ఇప్పటికే విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. అయితే మరో రెండు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్, అమరావతి వాతావరణ శాఖలు వెల్లడించాయి. రాబోయే రెండు రోజుల పాటు (బుధవారం, గురువారం) తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లోని పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్, అమరావతి వాతావరణ కేంద్రాలు వెల్లడించాయి. ఒకటి రెండు ప్రదేశాల్లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశముందని వెల్లడించాయి. మిగిలిన ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని పేర్కొంది.

పశ్చిమ మధ్య బంగాళాఖాతం, వాయువ్య పరిసరాల్లోని ఉత్తర ఆంధ్రా,దక్షిణ ఒడిస్సా తీరంల దగ్గర కొనసాగిన అల్పపీడనం ఈ రోజు బలహీన పడిందని పేర్కొంది. అనుబంధంగా ఉన్న ద్రోణి దక్షిణ ఒడిస్సా నుంచి ఉత్తర కోస్తా ఆంద్రా మీద కొనసాగుతూ మధ్యస్థ ట్రోపోస్పీయర్ స్థాయి వరకు వ్యాపించి నైరుతి వైపు కొనసాగుతోందని.. దీని కారణంగా చాలా ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశముందని తెలిపింది. దీంతో పగటిపూట ఉష్ణోగ్రతలు తగ్గాయి.

తెలంగాణ వ్యాప్తంగా వర్షాలు విస్తారంగా కురుస్తున్నాయి. రెండు రోజుల నుంచి ఎడతెరిపిలేకుండా కురుస్తున్న వర్షాలతో అన్ని ప్రాంతాలు జలమయ్యాయి. ఎక్కువగా.. భద్రాద్రి కొత్తగూడెం 13 సెం. వర్షపాతం నమోదవ్వగా.. అశ్వరావుపేట 11 సెంటీమీటర్లు, కానరావుపేట రాజన్న సిరిసిల్ల జిల్లాలో 10 సెంటీమీటర్లు, నర్మెట భూపాలపల్లి ఖానాపూర్ ప్రాంతాల్లో 7 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇరు తెలుగు రాష్ట్రాల్లో ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలతో పగటిపూట ఉష్ణోగ్రతలు తగ్గాయి.

Also Read:

Viral Video: పర్యాటక బస్సును చుట్టుముట్టిన పులులు.. వీడియో చూస్తే ఖచ్చితంగా షాక్ అవ్వాల్సిందే.!

Brahmos: బ్రహ్మోస్ క్షిపణి లేటెస్ట్ వెర్షన్ టెస్ట్ విఫలం..కారణాలు కనుగొనే పనిలో శాస్త్రవేత్తలు