Hyderabad Rains: నగరంలో దంచికొడుతున్న వాన… ఉరుములు మెరుపులతో మరో రెండ్రోజుల పాటు వర్షాలే..

|

May 22, 2023 | 7:42 AM

రాజేంద్రనగర్, అంబర్ పేట, శేరిలింగంపల్లి, సంతోష్ నగర్, ఎల్బీనగర్, సికింద్రాబాద్, ఉప్పల్ ఏరియాల్లో భారీ వర్షం కురుస్తోంది. ఈదురు గాలుతో వర్షం కురుస్తుండడంతో అనేక ప్రాంతాల్లో విద్యుత్ కోత పెట్టారు.

Hyderabad Rains: నగరంలో దంచికొడుతున్న వాన... ఉరుములు మెరుపులతో మరో రెండ్రోజుల పాటు వర్షాలే..
Rains In Hyderabad
Follow us on

భానుడు భగభగలతో అల్లాడుతున్న భాగ్య నగరవాసులకు వర్షం ఉపశమనం కలిగించింది. హైదరాబాద్ నగరంలో అర్ధరాత్రి నుంచి భారీగా వర్షం కురుస్తోంది. ఆదివారం సాయంత్రం నుంచి చల్లబడిన వాతావరణం.. అర్ధరాత్రి నుంచి ఒక్కసారిగా పలు ప్రాంతాల్లో కుండపోత వర్షం మొదలైంది. రాజేంద్రనగర్, అంబర్ పేట, శేరిలింగంపల్లి, సంతోష్ నగర్, ఎల్బీనగర్, సికింద్రాబాద్, ఉప్పల్ ఏరియాల్లో భారీ వర్షం కురుస్తోంది. ఈదురు గాలుతో వర్షం కురుస్తుండడంతో అనేక ప్రాంతాల్లో విద్యుత్ కోత పెట్టారు. దీంతో అనేక ప్రాంతాల్లో అంధకారం అలముకుంది. మరోవైపు నగరంలో రోడ్లపై భారీగా వర్షపు నీరు చేరుకుంది. లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. దీంతో అప్రమత్తమైన జీహెచ్‌ఎంసీ యంత్రాంగం సహాయకచర్యలు చేపట్టింది.

హైదరాబాద్ నగరంలో ఉరుములు, మెరుపులతో కూడిన గాలివాన హెచ్చరించిన నేపథ్యంలో నగర ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జీహెచ్ఎంసీ హెచ్చరించింది. అత్యవసరమైతేనే ఇళ్ల నుంచి బయటకు రావాలని సూచించారు. రాజేంద్రనగర్‌ 4.6 సెం.మీల వర్షపాతం, అంబర్‌పేట, శేరిలింగంపల్లిలో 3.9 సెం.మీ
శివరాంపల్లిలో 3.9 సెం.మీ వర్షపాతం నమోదయ్యింది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..