ఆర్మూర్ బీజేపీ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఓడిపోయిన కాంగ్రెస్ అభ్యర్థి తన నియోజకవర్గంలో పెత్తనం చేస్తే కుదరదన్నారు. దొరల రాజ్యం పోయి రెడ్డి రాజ్యం వచ్చిందని ఘాటు కామెంట్లు చేశారు రాకేష్ రెడ్డి. సీఎం రేవంత్ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారని ఆరోపించారు. రాకేష్ రెడ్డి కామెంట్లు ఇప్పుడు కాక రేపుతున్నాయి.
కొడంగల్ ప్రజలు రేవంత్ రెడ్డిని ఎమ్మెల్యేగా గెలిపిస్తే ..ఆర్మూర్ ప్రజలు తనను ఎమ్మెల్యేగా గెలిపించారన్నారు ఆయన. సీఎం రేవంత్ రెడ్డి.. తాను ఇద్దరం సమానమే అన్నారు. ఇద్దరికీ సమాన హక్కులు ఉంటాయని, ఆర్మూర్‌లో ఓడిపోయిన కాంగ్రెస్ అభ్యర్థి వినయ్ కుమార్ రెడ్డి తన అసెంబ్లీ నియోజకవర్గంలో పెత్తనం చేస్తే కుదరదంటూ రాకేష్‌రెడ్డి వార్నింగ్ ఇచ్చారు.
ఓడిపోయిన కాంగ్రెస్ అభ్యర్థులే నియోజకవర్గాల్లో అధికారులతో రివ్యూ మీటింగులు చేయాలని సీఎం రేవంత్ చెప్పడం ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడమే అన్నారు రాకేష్ రెడ్డి. ఆర్మూర్ నియోజకవర్గంలో వేలు పెడితే భద్రం బీకేర్‌ఫుల్ అంటూ కాంగ్రెస్ నేత వినయ్ కుమార్ రెడ్డికి వార్నింగ్ ఇచ్చారు రాకేష్ రెడ్డి. రాకేష్ రెడ్డి కామెంట్లు ఇప్పుడు కాక రేపుతున్నాయి.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి