Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gold Price Today: స్థిరంగా కొనసాగుతున్న బంగారం ధర.. పెరిగిన వెండి

బంగారం, వెండి ధరలు ఉదయం 6గంటలకు నమోదైనవి. బంగారం ధరల్లో ఒకేరోజులో అనేకసార్లు మార్పులు చోటుచేసుకుంటాయి. దీనికితోడు ప్రాంతాల వారిగా గోల్డ్, సిల్వర్ ధరలు మారుతుంటాయి. అందువల్ల బంగారం కొనుగోలు చేసే సమయంలో ఆ సమయానికి ప్రత్యక్ష ధరలను ట్రాక్ చేస్తే కచ్చితమైన ధర నిర్ధారణ చేసుకోవచ్చు..,

Gold Price Today: స్థిరంగా కొనసాగుతున్న బంగారం ధర.. పెరిగిన వెండి
Gold Price Today
Follow us
Subhash Goud

|

Updated on: Dec 26, 2023 | 6:28 AM

బంగారం ధరల్లో ప్రతి రోజు హెచ్చుతగ్గులు చోటు చేసుకుంటాయి. ఒక రోజు బంగారం ధరలు పెరిగితే.. మరో రోజు తగ్గుముఖం పడుతుంటాయి. ఇక డిసెంబర్‌ 26న దేశంలో బంగారం ధరలు నిలకడగా కొనసాగుతున్నాయి. దేశీయంగా పరిశీలిస్తే 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.58,200 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.63,490 ఉంది. తాజాగా దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం.

ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.58,350 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.63,640 ఉంది. హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.58,200 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.63,490 వద్ద ఉంది. చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.58,800 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.64,150 ఉంది. అలాగే ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.58,200 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.63,490 ఉంది. బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.58,200 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.63,490 వద్ద ఉంది. ఇక దేశంలో బంగారం ధరలు స్థిరంగా ఉంటే.. వెండి ధర మాత్రం స్వల్పంగా పెరిగింది. కిలోపై రూ.200 వరకు పెరిగి ప్రస్తుతం కిలో సిల్వర్‌ ధర రూ.79,200 వద్ద కొనసాగుతోంది.

పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు ఉదయం 6గంటలకు నమోదైనవి. బంగారం ధరల్లో ఒకేరోజులో అనేకసార్లు మార్పులు చోటుచేసుకుంటాయి. దీనికితోడు ప్రాంతాల వారిగా గోల్డ్, సిల్వర్ ధరలు మారుతుంటాయి. అందువల్ల బంగారం కొనుగోలు చేసే సమయంలో ఆ సమయానికి ప్రత్యక్ష ధరలను ట్రాక్ చేస్తే కచ్చితమైన ధర నిర్ధారణ చేసుకోవచ్చు.

భారతదేశంతో సహా ప్రపంచంలోని వివిధ ప్రాంతాల్లో బంగారం కొనుగోలు చేసే ఆచారం చాలా కాలంగా ఉంది. అందువల్ల, ఇతర విలువైన లోహాల కంటే బంగారం అమ్మడం సులభం. దాని విలువ కూడా స్థిరంగా ఉంటుంది. ద్రవ్యోల్బణం మొదలైనప్పుడల్లా, ప్రపంచ దేశాల కరెన్సీల విలువ బంగారంతో పోలిస్తే తగ్గుతుంది. అటువంటి సమయాల్లో మీరు బంగారాన్ని తీసుకోవడం ద్వారా ద్రవ్యోల్బణం ప్రభావాన్ని తగ్గించవచ్చు. ఇది కాకుండా, బంగారం ప్రపంచవ్యాప్తంగా గుర్తించబడింది. ఇది దాని లావాదేవీలను చాలా సులభతరం చేస్తుంది. ఇది బంగారాన్ని చాలా ప్రత్యేకంగా చేస్తుంది.

బంగారం పెట్టుబడిపై మంచి రాబడులు

గత 30 ఏళ్ల గణాంకాలను పరిశీలిస్తే, బంగారం పెట్టుబడిదారులకు అద్భుతమైన రాబడిని ఇచ్చింది. 1993లో 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములు రూ.4,598. అప్పటి నుండి, బంగారం పెట్టుబడిదారులకు దాదాపు 1222 శాతం తిరిగి వచ్చింది. 2003లో 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములు రూ.5,830 కాగా, 2013లో 10 గ్రాములు రూ.30,510గా ఉంది. 2003 మరియు 2013 మధ్య, 24 క్యారెట్ల బంగారం ధర 942 శాతం మరియు 99 శాతం పెరిగింది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి