Watch Video: మృత్యువుతో పోరాడుతూనే పంజా విసిరిన చిరుతపులి.. పాపం చివరకు..
ఈ మధ్య క్రూరమృగాలు అభయారణ్యం నుంచి జనావాసాల్లోకి వస్తున్న ఘటనలు ఎక్కువగా వెలుగు చూస్తున్నాయి. తాజాగా ఓ చిరుత అడవిని వదిలి రహదారి వైపు దూసుకొచ్చింది. అనుకోకుండా ఓ వాహనం ఢీ కొట్టడంతో మృతి చెందింది. మృత్యువుతో పోరాడుతూ.. కూడా పంజా విసురుతూ.. చివరకు నప్రాణాలు వదిలింది.

అదో చిరుతపులి. అందులోనూ గాయపడ్డ చిరుతపులి. నడిరోడ్డుపై తీవ్రగాయాలతో అవస్థ పడుతున్న దాన్ని చూసేందుకు జనం పెద్ద గుమ్మిగూడారు. అయితే గాయపడ్డ పులి దగ్గరకు వెళ్లడానికి ఎవరూ సాహసించలేదు. తీవ్రంగా గాయపడి ఎక్కువగా నడవలేని పరిస్థితిల్లో ఉన్నప్పటికీ.. తనకు దగ్గరకు వచ్చే వారిపై పంజా విసిరేందుకు ఏ మాత్రం వెనకాడలేదు ఆ చిరుత. అలా ఎంతోసేపు తీవ్రమైన నొప్పిని భరిస్తూ రోడ్డుపైనే విల్లవిల్లాడిపోయింది. అలా తీవ్రగాయాలతో మృత్యువుతో పోరాడి చనిపోయింది..
మెదక్ జిల్లా నార్సింగి మండల పరిధిలోని వల్లూరు అటవీ ప్రాంతంలో చోటుచేసుకుంది.. మగ చిరుత పులికి సుమారు రెండు సంవత్సరాల పైబడి వయస్సు ఉంటుంది. గురువారం రాత్రి 7:30 గంటల ప్రాంతంలో అటవీ ప్రాంతం నుంచి 44వ జాతీయ రహదారిపైకి వస్తుండగా హైదరాబాద్ వైపు నుంచి వస్తున్న వాహనం దాన్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో చిరుత తీవ్రంగా గాయపడింది. ఈ క్రమంలోనే రహదారి వెంట వస్తున్న వాహనాలపైకి దాడి చేసేందుకు ప్రయత్నించింది. కొద్దిసేపు ప్రాణాలు నిలబెట్టుకునేందుకు పోరాడిన చిరుత.. చివరకు విగతజీవిగా మారింది.
వీడియో చూడండి..
పోలీసులు ఇచ్చిన సమాచారంతో అక్కడికి చేరుకున్న అటవీ అధికారులు.. వల్లూరు అడవి ప్రాంతంలోనే మృతి చెందిన చిరుత పులికి పోస్టుమార్టం చేయించి పూడ్చి పెట్టనున్నట్టు తెలిపారు.
తిరుమల శిలాతోరణం దగ్గర చిరుత సంచారం..
ఇదిలా ఉంటే తిరుమలలోనూ చిరుత కలకలం రేపింది. తిరుమల శిలాతోరణం దగ్గర గురువారం సాయంత్రం చిరుత సంచరిస్తున్నట్లు గుర్తించిన భక్తులు.. టీటీడీ, అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..