కొత్త రేషన్ కార్డుల జారీపై.. రేవంత్ సర్కార్ గుడ్ న్యూస్
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రేషన్ కార్డుల పంపిణీకి పెద్దఎత్తున ఏర్పాట్లు చేస్తోంది. కొత్త దరఖాస్తులకు రేషన్ కార్డులు ఇవ్వడంతో పాటు, పాత కార్డుల్లో మార్పులు, చేర్పులు చేసిన వారికి కొత్త కార్డులు మంజూరు చేయాలని నిర్ణయించింది. ఈ ప్రక్రియ ద్వారా దాదాపు కోటి రేషన్ కార్డులను పంపిణీ చేయనున్నది. కొత్తగా అందించనున్న రేషన్ కార్డులు పోస్ట్‌కార్డు సైజులో ఉండేలా రూపొందిస్తున్నారు. ఎన్నికల సమయంలో తెలంగాణలో ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు, సీఎం రేవంత్ రెడ్డి సర్కార్ కొత్త రేషన్ కార్డుల జారీ ప్రక్రియను ప్రారంభించినున్నది.
కొత్త రేషన్ కార్డుపై ప్రభుత్వ లోగోతో పాటు సీఎం రేవంత్ రెడ్డి, పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చిత్రాలు ఉండే అవకాశం ఉంది. రేషన్ షాపు నంబర్, కుటుంబ సభ్యుల వివరాలు, అడ్రస్ తదితర సమాచారంతోపాటు, ఆధునిక సాంకేతికతగా బార్ కోడ్ లేదా క్యూఆర్ కోడ్ పొందుపరిచే యోచనలో ఉన్నారు.రేషన్ షాపుల్లో బార్ కోడ్ స్కానింగ్, బయోమెట్రిక్ విధానం ద్వారా నిత్యావసర సరఫరా సౌలభ్యం కల్పించాలని ప్రభుత్వం ప్రణాళిక రూపొందిస్తోంది. ఈ విధానం అమలులోకి వస్తే పారదర్శకత పెరిగి, అనర్హులకు రేషన్ సరఫరా నివారించేందుకు వీలవుతుంది. ప్రభుత్వం ఇప్పటికే అనేక సంక్షేమ పథకాలను మహిళల పేరుమీద అందజేస్తోంది. అదే విధంగా, రేషన్ కార్డులను కూడా గృహిణి పేరుమీద జారీ చేయాలని నిర్ణయించింది. ఈ చర్య ద్వారా కుటుంబాలకు సదుపాయాలు మరింత బలోపేతం అవుతాయని భావిస్తున్నారు.
బెంగళూరు ఎయిర్ పోర్టులో పెళ్ళికొడుకు తిప్పలు
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్గా నా భార్యను గెలిపించండి.. కటింగ్ ఫ్రీగా చేస్తా
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
గ్లాస్ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
