Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బీఆర్ఎస్ పనైపోయిందా? ఎవరా మాటన్నది? వీడియో

బీఆర్ఎస్ పనైపోయిందా? ఎవరా మాటన్నది? వీడియో

Samatha J

|

Updated on: Feb 24, 2025 | 2:05 PM

బీఆర్‌ఎస్‌ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌ ఏడు నెలల తర్వాత తెలంగాణ భవన్‌కు వెళ్లారు. పార్టీ విస్తృతస్థాయి సమావేశంలో లీడర్‌లకు, క్యాడర్‌కు దిశానిర్దేశం చేశారు . పార్టీ సభ్యత్వ నమోదు, సిల్వర్‌ జూబ్లీ వేడుకలు, పార్టీ సంస్థాగత ఎన్నికలపై చర్చించారు. పార్టీ ఆవిర్భవించి 25 వ ఏడాదిలోకి అడుగుపెడుతున్న సందర్భంగా పార్టీ సిల్వర్‌జూబ్లీ వేడుకలను ఘనంగా నిర్వహించాలని నిర్ణయించారు కేసీఆర్‌. ఏడాది పొడవునా సిల్వర్‌ జూబ్లీ వేడుకలను జరపాలన్నారు. పార్టీ కమిటీలు వేయాలని డిసైడ్‌ అయిన కేసీఆర్‌.. కమిటీల బాధ్యతలను హరీశ్‌రావుకు అప్పగించారు. త్వరలోనే మహిళా కమిటీలను ఏర్పాటు చేస్తామని ప్రకటించారు.

 ఏప్రిల్‌ పదో తేదీ నుంచి బీఆర్‌ఎస్‌ సభ్యత్వ నమోదు కార్యక్రమం ఉంటుందని.. ప్రతి జిల్లా కేంద్రంలో పార్టీ సభ్యత్వ నమోదు కొనసాగుతుందన్నారు కేసీఆర్. అనుబంధ సంఘాల పటిష్టత కోసం సీనియర్‌ నేతలతో సబ్‌ కమిటీలు వేయనున్నట్లు తెలిపారు. ఏప్రిల్ 10న పార్టీ ప్రతినిధుల సభ ఉంటుందన్నారు కేసీఆర్. ఏప్రిల్‌ 27న బీఆర్‌ఎస్‌ భారీ బహిరంగ సభ నిర్వహిస్తామన్నారు. మీటింగ్‌లో పలువురు బీఆర్ఎస్ నేతలకు క్లాస్ తీసుకున్నారు కేసీఆర్. ఎంపీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓడిపోగానే.. పార్టీ పనైపోయిందంటూ కొందరు ప్రచారం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ భయంతోనే 10 మంది ఎమ్మెల్యేలు పార్టీ మారారన్నారన్నారు కేసీఆర్‌. తెలంగాణ బీఆర్ఎస్ పార్టీ పని ఎప్పుడూ అయిపోదన్నారు. ఒక్క ఎన్నికలో ఓడిపోయినంత మాత్రాన పార్టీ పనైపోయిందనడం సరికాదన్నారు. తెలంగాణ కోసం కొట్లాడిన పార్టీ.. తెలంగాణ తెచ్చిన పార్టీ ఎప్పటికీ ప్రజల గుండెల్లో ఉంటుందన్నారుపార్టీ నేతలంతా ప్రజల్లో ఉండాలని సూచించారు కేసీఆర్. ప్రజల కష్టసుఖాల్లో పాలు పంచుకోవాలన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కష్టపడి పనిచేయాలని దిశానిర్దేశం చేశారు కేసీఆర్. తెలంగాణలో కచ్చితంగా ఉప ఎన్నికలు రావడం ఖాయమన్నారు కేసీఆర్. రాష్ట్రంలో కాంగ్రెస్ గ్రాఫ్‌ పడిపోతుందన్నారు గులాబీ బాస్‌. కాంగ్రెస్‌ పాలనలో రాష్ట్ర ఆదాయం తగ్గిపోయిందన్నారు.

మరిన్ని వీడియోల కోసం :

కల్లు గీసేందుకు తాటి చెట్టు ఎక్కిన గౌడన్న.. తొర్రలోకి చూసి షాక్ వీడియో 

తన భార్యకు మెసేజ్‌లు పంపుతున్న వ్యక్తి చెయ్యి నరికి..చివరికి వీడియో

పిల్లలు పుట్టరని తెలిసినా పెళ్లి చేసుకున్నాడు.. ఎంతమంచివాడో అనుకుంది..చివరికి..