Watch: డిగ్రీ విద్యార్థిని చితకబాదిన వార్డెన్‌పై సస్పెన్షన్‌ వేటు.. వీడియో

జిల్లాలోని ఎస్సీ గర్ల్స్ హాస్టల్‌లో వార్డెన్ డిగ్రీ మూడో సంవత్సరం చదువుతున్న విద్యార్ధిని చితకబాదిన సంఘటనకు సంబంధించిన వీడియో దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌ కావడంతో అధికారులు చర్యలకు ఉపక్రమించారు. ఆమెపై ఇప్పటికే రెండు అభియోగాలు రావడంతో వెంటనే విధుల నుంచి సస్పెండ్ చేస్తూ జిల్లా కలెక్టర్ ఉత్తర్వులు ఇచ్చారు..

Watch: డిగ్రీ విద్యార్థిని చితకబాదిన వార్డెన్‌పై సస్పెన్షన్‌ వేటు.. వీడియో
SC Hostel warden suspended in Bhupalapally

Updated on: Dec 31, 2025 | 8:56 AM

హైదరాబాద్, డిసెంబర్‌ 31: జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని ఎస్సీ గర్ల్స్ హాస్టల్‌లో వార్డెన్ దారుణంగా డిగ్రీ మూడో సంవత్సరం చదువుతున్న విద్యార్ధిని చితకబాదిన సంఘటన తెలిసిందే. ఇందుకు సంబంధించిన వీడియో దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌ కావడంతో అధికారులు చర్యలకు ఉపక్రమించారు. ఎస్సీ బాలికల హాస్టల్‌ విద్యార్థినిని విచక్షణారహితంగా కొట్టిన వార్డెన్‌ భవానీపై వేటుపడింది. విద్యార్థినిని చితకబాదిన వార్డెన్ భవానీని జిల్లా కలెక్టర్ సస్పెండ్ చేశారు. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. వార్డెన్‌పై వచ్చిన ఆరోపణల నేపథ్యంలో పూర్తిస్థాయి విచారణ చేపట్టాలని జిల్లా వెల్ఫేర్‌ ఆఫీసర్‌ (DWO)ని ఆదేశించారు. అసలేం జరిగిందంటే..

భూపాలపల్లి జిల్లా లోని ఎస్సీ గర్ల్స్ హాస్టల్‌లో డిగ్రీ మూడో సంవత్సరం చదువుతున్న విద్యార్థినిని వార్డెన్ చితక బాదుతున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో ప్రత్యక్షమైంది. ఈ వీడియోలో హాస్టల్ వార్డెన్ భవాని కర్రతో విచక్షణారహితంగా విద్యార్థినిపై దాడిచేయడం కనిపిస్తుంది. విద్యార్థినిని చితకబాదుతుండగా అక్కడే ఉన్న తోటి విద్యార్థినులు వీడియో తీసి నెట్టింట పోస్టు చేశారు. ఈ ఘటన గత నెల 24న జరిగినప్పటికీ ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పరీక్ష రాసేందుకు ఎగ్జిట్‌ అయి చెప్పి పోయినావ్‌ కదా.. హాస్టల్‌లో ఎగ్జిట్‌ పన్నెండింటికి అయిపోతదని తెల్వదా? ఎగ్జిట్‌ అయిపోయే టైం హాస్టల్‌ ఉండాలన్న సోయిలేదా నీకు అంటూ వార్డెన్‌ ఓ వైపు తిడుతూనే.. మరోవైపు కర్రలు, చేతులతో విద్యార్థినిని చితకబాదింది.

 

ఇవి కూడా చదవండి

కాగా రెండు నెలల క్రితం ఇదే ఎస్సీ హాస్టల్‌లో విద్యార్థినులకు మత బోధనలు చేయిస్తూ వార్డెన్‌ వార్తల్లో నిలిచింది. వరుస ఘటనలతో హాస్టల్ లో ఏం జరుగుతుందోనని పేరెంట్స్ ఆందోళన చెందుతున్నారు. దీంతో హాస్టల్ ముందు విద్యార్థి సంఘాలు బైఠాయించి వార్డెన్ పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ నిరసన చేపట్టారు. వార్డెన్ తీరుపై సర్వత్రా విమర్శలు రావడంతో జిల్లా కలెక్టర్ వార్డెన్ భవానీని సస్పెండ్ చేశారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి.