AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: వార్నీ మీరెక్కడ దొరికార్రా సామి.. క్షణాల్లో డీసీఎంను ఖాళీ చేసిన జనాలు.. ఇదిగో వీడియో

రోజురోజుకూ మనుషుల్లో మానవత్వం కరువైపోతోంది. ఓ వైపు మనిషి ప్రాణాలు పోతుంటే, మరోవైపు అదేం పట్టనట్టు జనాలు దర్జాగా ప్రమాదానికి గురైన వాహనంలోని యాపిల్ పండ్లను లూటీ చేయడంలో బిజీ అయిపోయారు. అటుగా వచ్చిన కొందరు వాహనదారులు ప్రమాదాన్ని గుర్తించి డ్రైవర్‌ను హాస్పిటల్‌కు తరలించడంతో ప్రాణాపాయం తప్పింది. ఈ ఘటన వరంగల్-ఖమ్మం జాతీయ రహదారిపై వెలుగుచూసింది.

Viral Video: వార్నీ మీరెక్కడ దొరికార్రా సామి.. క్షణాల్లో డీసీఎంను ఖాళీ చేసిన జనాలు.. ఇదిగో వీడియో
People Loot Apples Telangana
Anand T
|

Updated on: Jul 30, 2026 | 5:12 PM

Share

ప్రమాదానికి గురై ప్రాణాపాయంలో ఉన్న డ్రైవర్‌ను కాపాడాల్సింది పోయి.. రోడ్డుపై చెల్లాచెదురుగా పడ్డ యాపిల్ పండ్లను ఎత్తుకెళ్లేందుకు జనాలు పోటీ పడిన ఘటన వరంగల్-ఖమ్మం జాతీయ రహదారిపై తొర్రూరు మండలం మట్టెవాడ వద్ద జరిగింది. యాపిల్ పండ్ల లోడుతో వెళ్తున్న ఓ డీసీఎం వాహనం అదుపుతప్పి బోల్తా పడింది. దీంతో లారీలో ఉన్న యాపిల్ పండ్లు మొత్తం రోడ్డుపై పడిపోయాయి. ఈ ప్రమాదంలో డ్రైవర్‌కు తీవ్ర గాయాలయ్యాయి.

అయితే ప్రమాదాన్ని గమనించిన స్థానికులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. కానీ, గాయపడిన డ్రైవర్‌ను పట్టించుకోకుండా.. రోడ్డుపై పడిపోయిన పండ్లను ఎత్తుకెళ్లడంలో బిజీ అయిపోయారు. సంచులు, డబ్బాలు తీసుకొచ్చి అందిన కాడికి దోచుకెళ్లారు. కొందరైతే ఏకంగా ఆటోలు తీసుకొచ్చి అక్కడున్న పండ్లను నింపుకొని వెళ్లారు. ఇలా కొన్ని నిమిషాల్లోనే వాహనంలోని సరుకునంతా లూటీ చేశారు.

అటుగా వెళ్తున్న కొందరు వాహనదారులు వెంటనే స్పందించి డ్రైవర్‌ను హాస్పిటల్‌కు తరలించారు. అనంతరం పోలీసులకు సమాచారం ఇచ్చారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని స్థానికులను చెదరగొట్టి, ట్రాఫిక్‌ను క్లియర్ చేశారు. ప్రమాదానికి గురైన వాహనం వివరాలు సేకరించి, యజమానికి సమాచారం అందించారు.

జనాలు యాపిల్ పండ్లను ఎత్తుకెళ్తున్న దృశ్యాలను అక్కడే ఉన్న కొందరు వీడియో తీసి సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేయగా, అవి కాస్తా వైరల్‌గా మారాయి. ఈ వీడియో చూసిన నెటిజన్లు తమదైన రీతిలో స్పందిస్తున్నారు. “ఓ పక్క ప్రాణం పోతున్నా పట్టించుకోకుండా పండ్ల కోసం ఎగబడ్డారు.. మనుషుల్లో మానవత్వం అనేది లేకుండా పోతోంది” అని ఒకరు, “ఉచితంగా వస్తుందని ఇలా పరాయి సొమ్మును ఎత్తుకెళ్లడం ఏంటి?” అని మరొకరు కామెంట్లు చేస్తున్నారు.

వీడియో చూడండి..

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
వార్నీ మీరెక్కడ దొరికార్రా సామి.. క్షణాల్లో డీసీఎం ఖాళీ..
వార్నీ మీరెక్కడ దొరికార్రా సామి.. క్షణాల్లో డీసీఎం ఖాళీ..
తక్కువ పిండితో ఎక్కువ బజ్జిలు.. జస్ట్ 10 నిమిషాల్లోనే వేడి వేడిగా
తక్కువ పిండితో ఎక్కువ బజ్జిలు.. జస్ట్ 10 నిమిషాల్లోనే వేడి వేడిగా
పాత పీఎఫ్ అకౌంట్ మార్చిపోయారా..? ఆధార్ నెంబర్ ఎంటర్ చేస్తే చాలు..
పాత పీఎఫ్ అకౌంట్ మార్చిపోయారా..? ఆధార్ నెంబర్ ఎంటర్ చేస్తే చాలు..
MBBS, BDS కౌన్సెలింగ్‌ నిబంధనల్లో కీలక మార్పులు చేసిన AP సర్కార్‌
MBBS, BDS కౌన్సెలింగ్‌ నిబంధనల్లో కీలక మార్పులు చేసిన AP సర్కార్‌
చెన్నై కొత్త కెప్టెన్‌గా హార్దిక్ పాండ్యా.. సంజూకి షాకిచ్చిన ధోనీ
చెన్నై కొత్త కెప్టెన్‌గా హార్దిక్ పాండ్యా.. సంజూకి షాకిచ్చిన ధోనీ
ప్రాణం తీసిన దొంగిలించిన పల్సర్ బైక్.. అసలేం జరిగిందంటే..
ప్రాణం తీసిన దొంగిలించిన పల్సర్ బైక్.. అసలేం జరిగిందంటే..
పీఎఫ్, ఈఎస్‌ఐ ఉంటే ఆయుష్మాన్ భారత్ పథకం వర్తించదా..?
పీఎఫ్, ఈఎస్‌ఐ ఉంటే ఆయుష్మాన్ భారత్ పథకం వర్తించదా..?
9వ తరగతి విద్యార్థులకు రూ.20 లక్షల వరకు SBI స్కాలర్‌షిప్‌.. లింక్
9వ తరగతి విద్యార్థులకు రూ.20 లక్షల వరకు SBI స్కాలర్‌షిప్‌.. లింక్
జెన్ జీ యువతకు పిచ్చెక్కించిన వెబ్ సిరీస్ వచ్చేసింది..
జెన్ జీ యువతకు పిచ్చెక్కించిన వెబ్ సిరీస్ వచ్చేసింది..
మీ ఇంట్లో అదృష్టాన్ని పెంచే మొక్క.. ఒక్క చోట పెడితే డబ్బే డబ్బు
మీ ఇంట్లో అదృష్టాన్ని పెంచే మొక్క.. ఒక్క చోట పెడితే డబ్బే డబ్బు