Watch Video: ఏడు పదుల వయస్సులో మల్ల యుద్దానికి రెడీ అవుతోన్న బామ్మ.. ఎందుకో తెలుసా?

ఏడుపదులు వయసులో ఉన్న వాళ్ళు సాధారణంగా ఏం చేస్తారు??? కృష్ణా... రామా.. అనుకుంటూ కూర్చుంటారు. కానీ ఈ బామ్మ కుస్తీపోట్లకు రెడీ అవుతున్నట్లు కసరత్తులు చేస్తుంది. ఏడుపదుల వయసులో కూడా 20 ఏళ్ల యువతకు ఏమాత్రం గా తీసిపోని విధంగా కసరత్తులు చేస్తున్న ఈ భామ్మను ఒకసారి చూద్దామా... 72 ఏళ్ల బామ్మ అసలు కరత్తులు ఎందుకు చేస్తుంది? ఓపెన్ జిమ్‌లో ఎందుకు అంత కష్టపడుతుంది? అని అనుకుంటున్నారా? ఈ బామ్మకు..

Watch Video: ఏడు పదుల వయస్సులో మల్ల యుద్దానికి రెడీ అవుతోన్న బామ్మ.. ఎందుకో తెలుసా?
72 Year Old Grandmother Exercises In A Gym

Edited By: Srilakshmi C

Updated on: Oct 06, 2023 | 4:24 PM

హైదరాబాద్, అక్టోబర్‌ 6: ఏడుపదులు వయసులో ఉన్న వాళ్ళు సాధారణంగా ఏం చేస్తారు??? కృష్ణా… రామా.. అనుకుంటూ కూర్చుంటారు. కానీ ఈ బామ్మ కుస్తీపోట్లకు రెడీ అవుతున్నట్లు కసరత్తులు చేస్తుంది. ఏడుపదుల వయసులో కూడా 20 ఏళ్ల యువతకు ఏమాత్రం గా తీసిపోని విధంగా కసరత్తులు చేస్తున్న ఈ భామ్మను ఒకసారి చూద్దామా… 72 ఏళ్ల బామ్మ అసలు కరత్తులు ఎందుకు చేస్తుంది? ఓపెన్ జిమ్‌లో ఎందుకు అంత కష్టపడుతుంది? అని అనుకుంటున్నారా? ఈ బామ్మకు పెద్ద గోల్‌ ఉంది మరి.

శ్రీసత్యసాయి జిల్లా ఏనుములపల్లికి చెందిన నాగలక్ష్మమ్మ రోజూ పల్లీలు అమ్ముకునేందుకు ఇంటింటికి, వీధి వీధి తిరుగుతుండేది. అయితే వయోభారంతో వీధి వీధి తిరగాలంటే కాళ్లు నొప్పులు వస్తున్నాయని.. దీనికి తోడు ఉదయం టిఫిన్ సెంటర్లో పనిచేస్తుంది కాబట్టి కాస్తంత శక్తి కోసం ఓపిక చేసుకుని మరి వ్యాయామం చేయడం మొదలుపెట్టింది. సత్యసాయి జిల్లా కేంద్రంలో ఉన్న శిల్పారామంలోని ఓపెన్ జిమ్‌కి వెళ్లి రోజూ ఓ గంట పాటు కసరత్తులు చేస్తుంది. గత కొంతకాలంగా నాగలక్ష్మమ్మ ఈ కసరత్తులు చేయడం వల్ల తాను ఎంతో ఆరోగ్యంగా ఉన్నానని, ప్రస్తుతం తన పనులను తాను ఎంతో అలవోకగా చేసుకుంటున్నట్లు ఆమె చెబుతోంది.

జిమ్ లో కసరత్తులు చేస్తోన్న బామ్మ..

 

ఇవి కూడా చదవండి

ఇవాళ యువత కూర్చున్న చోటే ఉండి కదలకుండా ఉండడం వల్ల ఎన్నో అనారోగ్య సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నారని వ్యాయామం చేస్తే ఆరోగ్యంగా ఉంటారని యువతకు ఆదర్శంగా నిలుస్తుంది నాగలక్ష్మమ్మ. మొదట్లో కొంతమంది ఈ వయసులో ఆమెకు వ్యాయామం అవసరమా?? అని వెటకారం చేసిన వాళ్లే ఇవాళ నాగలక్ష్మమ్మ ఆరోగ్యంగా, ఉత్సాహంగా ఉండటం చూసి వ్యాయామం చేయడం వల్ల శారీరక దృఢత్వంతో పాటు మానసిక ఉల్లాసం కూడా కలుగుతుందని నాగలక్ష్మమ్మను ఆదర్శంగా తీసుకుంటున్నారు. శిల్పారామంలోని ఓపెన్ జిమ్‌లో ఉన్న అన్ని ఎక్సర్‌ సైజులు చేస్తూ మల్ల యుద్ధానికి రెడీ అవుతున్నట్లు కనిపిస్తుంది ఈ బామ్మ.

హుషారుగా కసరత్తులు..

 

 

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి.