AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Asaduddin Owaisi: 'రేవంత్ రెడ్డిపై అసదుద్దీన్‌ ఓవైసీ ఘాటు వ్యాఖ్యలు..

Asaduddin Owaisi: ‘రేవంత్ రెడ్డిపై అసదుద్దీన్‌ ఓవైసీ ఘాటు వ్యాఖ్యలు..

Noor Mohammed Shaik
| Edited By: Ravi Kiran|

Updated on: Oct 06, 2023 | 9:04 PM

Share

తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో ఒక్కసారిగా వేడి పుట్టించేశారు ఓవైసీ బ్రదర్స్. నిన్న మొన్న వరకు అనేక రాజకీయ పార్టీలను విమర్శించిన ఎంఐఎం నేతలు.. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీతో పాటు ముఖ్యంగా రేవంత్ రెడ్డి పైనే విమర్శించడం మొదలుపెట్టారు. రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ముస్లింలకి వ్యతిరేకంగా ఆర్ఎస్ఎస్ భాష మాట్లాడుతున్నాడు అంటూ ఓవేసి ఓ బహిరంగ సభలో ప్రస్తావించారు. భారతదేశంలో ఆర్ఎస్ఎస్..

తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో ఒక్కసారిగా వేడి పుట్టించేశారు ఓవైసీ బ్రదర్స్. నిన్న మొన్న వరకు అనేక రాజకీయ పార్టీలను విమర్శించిన ఎంఐఎం నేతలు.. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీతో పాటు ముఖ్యంగా రేవంత్ రెడ్డి పైనే విమర్శించడం మొదలుపెట్టారు. రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ముస్లింలకి వ్యతిరేకంగా ఆర్ఎస్ఎస్ భాష మాట్లాడుతున్నాడు అంటూ ఓవైసీ ఓ బహిరంగ సభలో ప్రస్తావించారు. భారతదేశంలో ఆర్ఎస్ఎస్ ప్రముఖ నేతలు కూడా ఇస్లాం ముస్లింలు భారతదేశంలో పుట్టిన వ్యక్తులు కాదు.. ఇతర దేశాల నుంచి మన దేశానికి వచ్చి విస్తరించిన వాళ్ళనేసి చెప్తుంటారని అసద్ ప్రస్తావించారు ఈరోజు అదే ఆర్ఎస్ఎస్ ఆలోచనలు ఆర్ఎస్ఎస్ భాష రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు వాడుతున్నారనే కారణంగా ముస్లిం సమాజం కాంగ్రెస్‌కు దూరంగా ఉండాలని విజ్ఞప్తి చేశారు. 70 సంవత్సరాల నుంచి దేశంలో ఆర్ఎస్ఎస్ తో పోరాడుతున్నామని, గతంలో కిషన్ రెడ్డితో కలిసి బిజెపి కోసం పని చేసిన రేవంత్ రెడ్డి చరిత్ర మొత్తం మా దగ్గర ఉందని, ఆర్ఎస్ఎస్ ఆదేశాలతోనే బీజేపీ నుంచి, టీడీపీలో నుంచి కాంగ్రెస్‌లోకి వచ్చిన వ్యక్తులను ఎవరు నమ్మకూడదని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో అనేక మతకలహాలకు అనేక నష్టాలకి కాంగ్రెస్ పార్టీ ప్రధాన పాత్ర పోషించిందని ఓవైసీ సంచలాత్మక కామెంట్ చేస్తూ ప్రజల్లోకి తీసుకెళ్లారు.

హైదరాబాద్ గోల్కొండ లో జరిగిన ఓ బహిరంగ సభలో కాంగ్రెస్ పై మండిపడుతూనే కేసీఆర్‌ను మరోసారి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా చేయాలని, ప్రతి నియోజకవర్గంలో ఎంఐఎం విజయం సాధించేలా చేస్తామని ఓవైసీ చెప్పారు. నెహ్రూ సర్దార్ వల్లభాయ్ వల్లే ఈరోజు దేశంలో ముస్లింలు రాజకీయంగా ఎదగలేకపోయారని ఓ వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం ఇప్పుడు దేశవ్యాప్తంగా పెద్ద చర్చనీయాంశంగా మారింది.

అలాగే అక్బరుద్దీన్‌ ఓవైసీ కూడా రేవంత్‌రెడ్డిపై మండిపడ్డారు. బీజేపీకి తెలంగాణలో ఓటు బ్యాంకు పెద్దగా లేదని, అందులో భాగంగానే ఆరెస్సెస్‌ వ్యక్తిని తీసుకొచ్చి పీసీసీ చీఫ్‌ని చేశారని వ్యాఖ్యానించారు. ఇప్పుడు ఆరెస్సెస్‌తో పాటు.. వీహెచ్‌పీ కూడా రేవంత్‌ సీఎం కావడం కోసం పనిచేస్తున్నారని అన్నారు. తన మాటలు తప్పు అయితే రేవంత్‌ రెడ్డి భాగ్యలక్ష్మీ ఆలయానికి వచ్చి ప్రమాణం చేయాలని సవాల్‌ విసిరారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Published on: Oct 06, 2023 04:49 PM