Watch Video: బండారు క్షమాపణ చెప్పాలి.. మంత్రి రోజాకు సినీ నటి కుష్బూ బాసట..
ఏపీ మంత్రి ఆర్కే రోజాపై టీడీపీ నేత బండారు సత్యనారాయణ అనుచిత వ్యాఖ్యలు చేయడాన్ని సినీ నటి కుష్బూ తీవ్రంగా ఖండించారు. వెంటనే ఆయన తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుని బేషరతు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ విషయంలో తాను మంత్రి రోజాకు మద్ధతుగా పోరాటం చేస్తానని చెప్పారు.
టీడీపీ నేత బండారు సత్యనారాయణపై సినీ నటి, బీజేపీ నాయకురాలు కుష్బూ సుందర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రి రోజాపై ఆయన వ్యాఖ్యలు దారుణమని మండిపడ్డారు. మహిళా మంత్రిపై ఈ రకమైన అనుచిత వ్యాఖ్యలు చేయడం దారుణమన్నారు. ఆయన వ్యాఖ్యలు చాలా జుగుప్సాకరంగా ఉన్నాయని.. ఓ మనిషిగా కూడా సరిపోరని ఆగ్రహం వ్యక్తంచేశారు. మహిళల పట్ల ఏ మాత్రం గౌరవం ఉన్నా ఇలా మాట్లాడరని వ్యాఖ్యానించారు. మహిళలను దూషించడం తన జన్మహక్కు అన్నట్లు టీడీపీ నేత వ్యవహార తీరు ఉందని అభ్యంతరం వ్యక్తంచేశారు. వెంటనే రోజాకు బండారు సత్యనారాయణ బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ విషయంలో తాను రోజాకు సపోర్ట్‌గా పోరాటం చేస్తానని చెప్పారు.
మంత్రి రోజాపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు మాజీ మంత్రి బండారు సత్యనారాయణపై నగిరిపాలెం పోలీసులు కేసు నమోదుచేసి అక్టోబర్ 2న అరెస్టు చేయడం తెలిసిందే. ఆ తర్వాత మొబైల్ కోర్టు బెయిల్ మంజూరు చేయడంతో విడుదలయ్యారు. ఎన్టీఆర్ కుటుంబ సభ్యులను మంత్రి రోజా తీవ్రంగా దూషించినందునే.. తాను తీవ్రంగా స్పందించాల్సి వచ్చిందని ఆయన చెప్పుకొచ్చారు.
ఎలుకా.. మజాకా..!
వాళ్లిద్దరి చనువు వల్లే.. భార్యాభర్తల మధ్య గొడవలు
ఇక.. జ్ఞాపకంగా మిగలనున్న విశాఖ ఎయిర్పోర్ట్
వరల్డ్ వండర్ కిడ్స్ .. చిన్న వయసు.. పెద్ద మనసు!
రైలు ఇంజిన్ చెక్ చేస్తున్న పైలట్.. అక్కడ మనిషి తలను చూసి..
ఫేస్బుక్ ఫ్రెండ్ ఆశల ఎర.. రూ.1.75 కోట్లు పోగొట్టుకున్న మహిళ!
చెడ్డీ గ్యాంగ్ మళ్లీ వచ్చింది.. సీసీ కెమెరాలు పీకేసి మరీ..

