
కుండపోత వర్షాలతో బోగత జలపాతానికి వరద పోటెత్తింది.. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో బోగత జలపాతాల వద్ద అత్యంత ప్రమాదకరంగా వరద ఉధృతంగా ప్రవహిస్తుంది.. ప్రమాదాలు పొంచి ఉండడంతో జలపాతాలలో జలకాలకు లోపలికి ఎవరినీ అనుమతించడం లేదు.. ములుగు జిల్లా వ్యాప్తంగా వర్షాలు విస్తారంగా కురుస్తున్నాయి.. అనేక వాగులు వంకలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. ముఖ్యంగా బోగత జలపాతాలకు జలకల సంతరించుకుంది. జలపాతాల వద్ద వరద అత్యంత ప్రమాదకరంగా ఉప్పొంగి ప్రవహిస్తుంది.
ఎగువన ఛత్తీస్గడ్ రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలతో బోగత జలపాతాలకు వరద పోటెత్తింది.. అత్యంత ప్రమాదకరంగా జలపాతాల వద్ద వరద ప్రవాహం ఉప్పొంగి ప్రవహిస్తుంది.. ప్రమాదాలు పొంచి ఉండడంతో జలపాతాల సందర్శన తప్ప లోపలికి దిగి జలకాలు ఆడడం కోసం ఎవరిని అనుమతించడం లేదు..
ఎగువన కురుస్తున్న వర్షాల ప్రభావంతో జలపాతాలకు మరింత వరద పెరిగే అవకాశం ఉందని అధికారులు అప్రమత్తమయ్యారు..వరద పోటెత్తడం వల్ల ప్రమాదాలు పొంచి ఉన్నాయని అటవీశాఖ సిబ్బంది, పోలీసులు ముందస్తు చర్యలు చేపట్టారు..
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..